![ఆకతాయిలు పాడుచేసిన తరగతి గదులను
పరిశీలిస్తున్న పోలీసులు, మహిళా పోలీసులు - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/28/27sktp21b-370022_mr_1.jpg.webp?itok=0z8w4PR2)
ఆకతాయిలు పాడుచేసిన తరగతి గదులను పరిశీలిస్తున్న పోలీసులు, మహిళా పోలీసులు
వేపాడ:
మండలకేంద్రం వేపాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆకతాయిల ఆరాచకాలు రోజురోజుకు పెరిగిపోవడంతో పాఠశాల హెచ్‌ఎం వల్లి ఉపాధ్యాయులు వల్లంపూడి పోలీసులకు సోమవారం సమాచారం అందజేశారు. పాఠశాలకు ప్రహరీ ఉన్నప్పటికీ ఆకతాయిలు చొరబడి తరగతిగదులు పాడుచేస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో సోమవారం పాఠశాలకు వచ్చి చూసేసరికి 9,10 తరగతుల గదుల తలుపులు పగులగొట్టి ఉన్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. గదుల్లోకి వెళ్లి చూసేసరికి గదిలో కర్బూజా పండు ముక్కలు తిని టేబుల్స్‌పై రుద్దారు. మద్యం సీసాలు అక్కడే వదిలేశారు. మూత్రవిసర్జన చేయడంతో పాఠశాల తరగతి గదులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. దీంతో పాఠశాల హెచ్‌ఎం మహిళాపోలీసులకు సమాచారం ఇచ్చి వల్లంపూడి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, మహిళా పోలీసులు పాఠశాలకు వెళ్లి పరిశీలించారు. గతంలో పలు పర్యాయాలు ఇలానే తరగతి గదులు పాడుచేస్తుండడంతో పోలీసులకు సమాచారం అందించారు. కొంతకాలంగా ఏమీ జరగలేదని, మళ్లీ గత వారంలో ట్యాబ్‌లన్నీ విరగ్గొట్టారని చెప్పారు. గ్రామపెద్దలు, పోలీసులు సహకరించి పాఠశాలలో అభ్యంతరకరమైన పనులు జరగకుండా చూడాలని హెచ్‌ఎం, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
వేపాడ హైస్కూల్‌లో వీరంగం
పోలీసులకు సమాచారం ఇచ్చిన హెచ్‌ఎం
Comments
Please login to add a commentAdd a comment