
బరంపురం: లంచం తీసుకున్న ఇద్దరు ఏఎస్‌ఐలు, ఒక కానిస్టేబుల్‌ను అరెస్టు చేసిన ఘట న శనివారం చోటుచేసుకుంది. బరంపురం ఎస్పీ సార్వణ్ వివేక్ తెలిపిన వివరాలు మే రకు.. గొళంతరా పోలీసుస్టేషన్ పరిధి హోల్ధియాపదర్ ఓవర్ బిడ్జి దగ్గర వారం రోజుల క్రితం రెండు పికప్ వ్యాన్‌లలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశాకు తరలిస్తున్న ఆవులను సరిహద్దు గిరిసిల చెక్‌పోస్టు వద్ద గొళంతరా పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు.
అయితే కేసు లేకుండా ఉండాలంటే రూ.50 వేల లంచం ఇవ్వాలని ఏఎస్‌ఐలు సంతోషిని సాహు, రోనలి పాణిగ్రహిలు వ్యాన్ డ్రైవర్ పి.నాగభూషణంకు డిమాండ్ చేశారు. దీంతో సంతో
షిని సాహు బ్యాంక్ అకౌంట్‌కు తొలుత రూ.30 వేలు అనంతరం మరో రూ.10 వేలు పంపాడు. అయితే మరో రూ.10 వేలు ఇవ్వాల్సిందేనని ఏఎస్‌ఐలు ఒత్తిడి చేయడంతో వ్యాన్ డ్రైవర్ పి.నాగభూషణం ఎస్పీ సార్వణ్ వివేక్‌కి ఫిర్యాదు చేశాడు. ఎస్పీ పక్కాగా దర్యాప్తు చేసి సాక్ష్యాలు సేకరించి ఏఎస్‌ఐలు సంతోషిని సాహు, రోనలి పాణిగ్రహిలతో పాటు ఒక కానిస్టేబుల్‌ను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment