వికసిత్ భారత్ నిర్మాణంలో సహకార సంఘాల పాత్ర ముఖ్యం
నరసరావుపేట: వికసిత్ భారత్ నిర్మాణంలో సహకార సంఘాల పాత్ర ఎంతో ముఖ్యమని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని చాంబర్‌లో 71వ అఖిల భారత సహకార వారోత్సవాలు వాల్‌పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 71వ అఖిల భారత సహకార వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నవంబర్ 14న సహకార మంత్రిత్వ శాఖ కొత్త కార్యక్రమాల ద్వారా ఉద్యమాన్ని బలోపేతం చేసే కార్యక్రమాలు, 15న సహకార సంఘాలలో నూతన ఆవిష్కరణలు, సాంకేతికత, సుపరిపాలన కార్యక్రమాలు, 16న వ్యవస్థాపకత, ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి పెంపొందించడంలో సహకార సంఘాల పాత్ర కార్యక్రమాలు, 17న సహకార సంస్థలు వ్యాపార ప్రయోజత సంస్థలుగా రూపాంతరం కార్యక్రమాలు, 18న సహకార సంఘాల మధ్య సహకారాన్ని పెంపొందించుట కార్యక్రమాలు, 19న మహిళలు, యువత, బలహీన వర్గాల కోసం సహకార సంఘాలు కార్యక్రమాలు, 20న సుస్థిర అభివృద్ధి లక్ష్యసాధన, మెరుగైన సమాజ నిర్మాణంలో సహకార సంఘాల పాత్ర వంటి తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీసీవో వెంకట రమణ, డివిజనల్ కోఆపరేటివ్ అధికారి నాగ శ్రీనివాస్, జిల్లా కోపరేటివ్ ఆడిట్ అధికారి శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.
పల్నాటి ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
కారెంపూడి: పల్నాటి వీరారాధన ఉత్సవాలకు వచ్చే వీరాచారులకు తగిన సౌకర్యాల కల్పనపై ఎంపీడీఓ జి శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ ఆర్ వెంకటేశ్వర్లు నాయక్ మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉత్సవాలకు వచ్చే వీరాచారుల సౌకర్యార్థం ముఖ్యంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఎంపీడీఓ, తహసీల్దార్ నిర్ణయించారు. మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల ఉద్యోగులు విరాళాల ద్వారా టాయ్‌లెట్స్ నిర్మించడానికి నిర్ణయించుకున్నట్లు ఏంపీడీఓ వెల్లడించారు. దాత బత్తుల కోటేశ్వరరావు గతంలో టాయిలెట్స్ నిర్మాణానికి పూనుకుని అసంపూర్తిగా వదిలేసిన వాటిని పూర్తి చేస్తామని, తాము కూడా కొన్ని ఏర్పాటు చేయిస్తామని టీడీపీ నాయకులు హామీ ఇచ్చారని తెలిపారు. చాలా కాలంగా వీరాచారులు ఇబ్బందులు పడుతున్నారని సమస్యను పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉత్సవాల ప్రధాన ప్రాంగణమైన వీరుల గుడి ఆవరణలో తగినన్ని ఎల్‌ఈడీ లైట్లు వేయించాలని, బస్టాండ్ సెంటర్ చెన్నకేశవస్వామి, అంకాలమ్మ తల్లి ఆలయాల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఎంపీడీఓ, తహసీల్దార్‌లు ఆదేశించారు. నాగులేరును పరిశుభ్రం చేసే చర్యలను తీసుకోవాలని ఇన్‌చార్జి ఈఓపీఆర్డీ కసిన్యానాయక్‌ను ఎంపీడీఓ ఆదేశించారు. నాగులేరు గంగధారి మడుగును పరిశుభ్రం చేయాలని వీరాచారులు ఆచార వ్యవహారాలు నిర్వహించుకునేందుకు వీలుగా అక్కడ పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. మంచినీరు అందించే ఏర్పాట్లు, ఏర్పాట్లు వీరుల గుడి వద్ద వీరాచారులు జట్లు స్నానాలు చేయడానికి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా నాగులేరు పరిసరాలలలో పరిశుభ్రంగా ఉంచేందుకు వాచ్‌మెన్‌ను నియమించాలని పంచాయతీకి సూచించారు. ప్రజలు కూడా ఎవరూ వ్యర్ధాలు నాగులేరులో వేయవద్దని వేస్తే తగిన చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారులను పలువురు గ్రామ పెద్దలు సూచించారు. సమావేశంలో అన్ని శాఖల మండల స్థాయి అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
క్రీడాకారులకు అవకాశాలు మెండు
నరసరావుపేట ఈస్ట్: క్రీడాకారులకు విద్య, ఉద్యోగ రంగాలలో ప్రభుత్వాలు ప్రాధాన్యమిచ్చి ఎన్నో అవకాశాలను కల్పిస్తున్నట్టు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు తెలిపారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల మహిళా కబడ్డీ పోటీలు మంగళవారం కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో ప్రారంభమయ్యాయి. పోటీలను ప్రారంభించిన గోనుగుంట్ల మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు క్రీడా పాలసీని తీసుకువచ్చి క్రీడాకారులకు అవకాశాలు పెంచినట్టు తెలిపారు. విద్య, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్ శాతాన్ని పెంచటంతోపాటు క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలని సూచించారు. వర్సిటీ క్రీడా విభాగాధిపతి ప్రొఫెసర్ పాల్‌కుమార్ మాట్లాడుతూ క్రీడాకారులకు వర్సిటీ ఎన్నో అవకాశాలను కల్పిస్తున్నదని తెలిపారు. ఒక్క ఏఎన్‌యూ మాత్రమే జాతీయస్థాయి క్రీడల్లో పతకాలు సాధించిన విద్యార్థులకు 10 శాతం మార్కులను కలపటంతోపాటు నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నదన్నారు. జాతీయ, సౌత్ జోన్, సెంట్రల్ జోన్ స్థాయిలో పతకాలు సాధించిన విద్యార్థులకు మార్కులతోపాటు నెలవారీ స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కోమటినేని నాసరయ్య, ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు, ధనలక్ష్మి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చుండు వెంకటరావు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈదర ఆదిబాబు తదితరులు పాల్గొన్నారు.
లీగ్‌కు చేరిన జట్లు...
వర్సిటీ అంతర్ కళాశాలల మహిళా కబడ్డీ పోటీలను నాకౌట్ కమ్ లీగ్ విధానంలో నిర్వహిస్తున్నారు. వర్సిటీ పరిధిలోని కళాశాలల నుంచి 11 జట్లు పోటీలకు హాజరయ్యాయి. పోటీల్లో భాగంగా వర్సిటీ వ్యాయామ కళాశాల, కృష్ణవేణి డిగ్రీ కళాశాల, విక్టరీ డిగ్రీ కళాశాల (నరసరావుపేట) జెఎంజె మహిళా కళాశాల (తెనాలి) జట్లు లీగ్ దశకు చేరుకున్నాయి. నాకౌట్ దశలో బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల జట్టుపై బాపట్ల మహిళా కళాశాల జట్టు 10 పాయింట్లు, వాగ్దేవి కళాశాల జట్టుపై ఎంఏఎం ఫార్మసీ కళాశాల జట్టు 4 పాయింట్లు, ధనలక్ష్మి వ్యాయామ కళాశాల జట్టుపై విక్టరీ కళాశాల జట్టు, గుంటూరు ఉమెన్స్ కళాశాల జట్టుపై ఏఎన్‌యూ జట్టు, ఎంఏఎం కళాశాల జట్టుపై కృష్ణవేణి కళాశాల జట్టు విజయం సాధించాయి.
జిల్లాలో అఖిల భారత సహకార వారోత్సవాలు ఘనంగా నిర్వహించండి వాల్‌పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు
రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గోనుగుంట్ల ఉత్సాహంగా ప్రారంభమైన వర్సిటీ మహిళా కబడ్డీ పోటీలు లీగ్ దశకు చేరుకున్న జట్లు
Comments
Please login to add a commentAdd a comment