గిరిజనుల జీవితాల్లో చిగురాశలు
నాబార్డు ఆర్థిక సహకారంతో అవార్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలోని నకరికల్లు, రాజుపాలెం మండలాల్లో నాబార్డు టీడీఎఫ్ (ట్రైబల్ డెవలప్‌మెంట్ ఫండ్)లో భాగంగా మా తోట అభివృద్ధి పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకంలో గిరిజనుల సమగ్ర అభివృద్ధి కృషి చేస్తున్నారు. ఆరేళ్ల కాల పరిమితి గల ఈ పథకంలో పండ్ల తోటల పెంపకం, మార్కెటింగ్, ఉపాధి వంటి అవకాశాలు కల్పిస్తున్నారు.
నకరికల్లు: రెండేళ్లుగా అమలు చేస్తున్న పథకం ద్వారా నకరికల్లు, రాజుపాలెం మండలాల్లోని దాదాపు 429 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ప్రధానంగా హార్టికల్చర్ డెవలప్‌మెంట్, భూసార అభివృద్ధి పనులు, వాటర్ రీసోర్స్ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్, జీవనోపాధి వంటి కార్యక్రమాలు చేపడతున్నారు. 2023–24 సంవత్సరంలో 200 మంది ఎస్టీ రైతులను లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చారు. 2024–25 ఏడాదికిగాను ఇప్పటికే 229 మంది రైతులను ఎంపిక చేశారు. భూమి లేని నిరుపేదలు మరో 50 మందిని గుర్తించి వారి ఉపాధికి బాటలు వేశారు. ఇప్పటికే 100 ఎకరాల్లో పండ్ల తోటలు వేయడం పూర్తి కాగా... మరో 129 ఎకరాలను ఈ ఏడాది డిసెంబర్ కల్లా వినియోగంలోకి తీసుకురానున్నారు.
ఆరో ఏడాది నుంచి మార్కెటింగ్...
పంట వేసి ఐదేళ్ల కాలం పూర్తి చేసుకున్న తరువాత రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ చేయిస్తారు. సంఘంలోని రైతులకు మార్కెటింగ్‌పై అవగాహన కల్పిస్తారు. ఆసక్తి గల వారికి ప్రాసెసింగ్ యూనిట్‌లను ఏర్పాటు చేసుకునేందుకు సహకారం అందిస్తారు. అలాగే నాచురల్ ఫార్మింగ్‌పై అవగాహన కల్పిస్తారు.
రైతుల సమగ్రాభివృద్ధికి నాబార్డు చేయూత ఉచితంగా మామిడి, బత్తాయి మొక్కలు పంపిణీ ట్యాంకర్‌ల ద్వారా నీటి సరఫరాకు చర్యలు సస్యరక్షణ, మార్కెటింగ్‌కు సహకారం ‘మా తోట అభివృద్ధి’ పథకంపై శిక్షణ తరగతులు
హార్టికల్చర్ విధానంలో....
దరఖాస్తు చేసుకునే అవకాశం
నాబార్డు సౌజన్యంతో అవార్డు సంస్థ ద్వారా గిరిజన రైతుల అభివృద్ధి కోసం చేపడుతున్న ఈ పథకంలో లబ్ధి పొందేందుకు ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్టీ రైతులు తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పొలం పాస్‌పుస్తకం జీరాక్స్‌లతో నకరికల్లులోని కార్యాలయంలో సంప్రదించవచ్చు. వివరాలకు ఫోను నెంబరు 72869 47977లో సంప్రదించవచ్చు.
– ఎం.సుధాకర్, అవార్డు సంస్థ ప్రాజెక్టు కో ఆర్డినేటర్
Comments
Please login to add a commentAdd a comment