బాల్య వివాహ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
నరసరావుపేట రూరల్: బాల్య వివాహ రహిత సమాజాన్ని నిర్మించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు తెలిపారు. కేంద్ర సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహ రహిత భారతదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బాల్య వివాహ రహిత ఆంద్రప్రదేశ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు జిల్లాలో బుధవారం ప్రారంభిచారు. శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్‌లో ముందుగా ప్రతిజ్ఞ నిర్వహించారు. అనంతరం అవగాహన ర్యాలీ జరిపారు. కలెక్టర్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. బాల్య వివాహాల వలన మహిళలకు ఎదురయ్యే సమస్యలను కలెక్టర్ తెలియజేశారు. ఆడపిల్లలకు 18 సంవత్సరాలలోపు వివాహం చేయడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారని తెలిపారు. బాల్య వివాహాలు లేని సమాజం వైపు అందరం అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు. ఈ వివాహాల నియంత్రణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌డీవో కె.మధులత, దిశ డీఎస్పీ రమణ, డీఈవో చంద్రకళ, డీఎంహెచ్‌వో డాక్టర్ బి.రవి, ఏసీడీపీవో మాణిక్యరావు, లీగల్ సెల్ అధ్యక్షులు అమూల్య, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం.పార్వతి తదితరులు పాల్గొన్నారు.
సాగునీటి సమాచారం
తాడేపల్లిరూరల్ (దుగ్గిరాల): కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద బుధవారం 2010 క్యూసెక్కులు విడుదల చేశారు. హై లెవల్ కాలువకు 96, బ్యాంక్ కెనాల్‌కు 100, తూర్పు కెనాల్‌కు 50, పశ్చిమ కెనాల్‌కు 65, నిజాంపట్నం కాలువకు 200, కొమ్మమూరు కాలువకు 2140 క్యూసెక్కులు విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment