అమరేశ్వరునికి లక్ష బిల్వార్చన
అమరావతి: ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్థిల్లాలని అమరావతి అమరేశ్వరాలయంలో బుధవారం లక్షబిల్వార్చన నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు తొలుత మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. ఆలయ అర్చకులు స్వామివారికి విశేష అలంకరణ చేసి సహస్ర నామాలతో వేడుక జరిపారు. బాల చాముండికా అమ్మ వారికి లక్ష కుంకుమార్చన నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
ఫ్లాగ్ డే విరాళాలు అందజేయండి
నరసరావుపేట: దేశ రక్షణలో అమరులైన సైనికుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రజలు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు విరివిగా విరాళాలు అందజేయాలని జిల్లా సైనిక సంక్షేమాధికారి గుణశీల కోరారు. సాయుధ దళారులు, మాజీ సైనికులు, వితంతువుల సంక్షేమం కోసం డిసెంబరు 7వ తేదీన నిర్వహించే ఫ్లాగ డేను పురస్కరించుకొని బుధవారం తన క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు పోస్టర్, కార్ ఫ్లాగ్స్, పతాక స్టిక్కర్లను ఆవిష్కరించారు. విరాళాలు అందించే వారు ఆన్‌లైన్ ద్వారా ఎస్‌బీఐ, ఎంజీరోడ్డు, గవర్నర్‌పేట, విజయవాడ, కరెంటు అకౌంట్ నం.3388 1128 795, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ ఎస్‌బీఐఎన్ 0016857, ఎంఐసీఆర్ నం. 5200 02046 ద్వారా గానీ, డైరెక్టర్, సైనిక్ వెల్ఫేర్, విజయవాడ పేరిట చెక్కు ద్వారా గుంటూరు హిందూకళాశాల ఎదురుగా ఉన్న జిల్లా సైనిక సంక్షేమాధికారికి పంపాలని గుణశీల కోరారు.
Comments
Please login to add a commentAdd a comment