35 వాహనాలు సీజ్, అనుమానితులను ప్రశ్నించిన పోలీసులు
తెనాలి రూరల్: పట్టణ త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని యడ్ల లింగయ్య కాలనీలో పోలీసులు గురువారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో సుమారు 100 మంది పోలీసులు కాలనీలో ప్రతి ఇంటిని సోదా చేశారు. ఇళ్లలో ఉంటున్న వారి వివరాలను పరిశీలించారు. వాహనాల పత్రాలను పరిశీలించారు. అనుమానితుల వివరాలను నమోదు చేసుకున్నారు. 30 బైక్‌లు, ఐదు ఆటోలకు సరైన పత్రాలు లేకపోవడంతో స్టేషనుకు తరలించారు. పెద్ద సంఖ్యలో పోలీసులు ఒక్కసారిగా కాలనీకి రావడంతో ఏం జరిగిందో తెలియని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. జిల్లా ఏఎస్పీ(అడ్మిన్) జీవీ రమణమూర్తి, డీఎస్పీ బి.జనార్దనరావు, త్రీ టౌన్ సీఐ ఎస్.రమేష్‌బాబు పర్యవేక్షించారు. ఏడుగురు రౌడీ షీటర్లు ఉండగా ఐదుగురిని, మరో ఇద్దరు సస్పెక్ట్ షీట్ ఉన్న వాళ్లను అదుపులోకి తీసుకుని విచారించారు. వాహనాల పత్రాలను సమర్పిస్తే తిరిగి ఇస్తామని ఏఎస్పీ రమణమూర్తి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment