హైకోర్టు ఉత్తర్వులతో రీ పోస్టుమార్టం
యడ్లపాడు/పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): ఏడాదిన్నర కిందట ఖననం చేసిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యడ్లపాడు మండలం కోట గ్రామానికి చెందిన మహమ్మద్ కరిముల్లా(50) ఏడాదిన్నర కిందట గ్రామంలోని బావిలో పడి మృతి చెందాడు. ఆస్తుల వివాదంలో తన తండ్రి మరణంపై కుమారుడు సాధిక్ అనుమానం వ్యక్తం చేశాడు. మత ఆచారం ప్రకారం శవపంచనామాకు పెద్దలు అంగీకరించలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఉత్తర్వులతో మంగళవారం గుంటూరులోని శ్మశాసంలో కరిముల్లా శవాన్ని వెలికితీసి శవపంచనామా నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment