వైఎస్సార్‌సీపీలో చేరిన పలువురు నాయకులు | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో చేరిన పలువురు నాయకులు

Published Thu, May 9 2024 5:05 AM

వైఎస్

సాలూరు: మండలంలోని పెదపధం పంచాయతీకి చెందిన పలువురు నాయకులు, ప్రజలు మళ్లీ వైఎస్సార్‌సీపీ గూటికి చేరారు. పంచాయతీకి చెందిన సుమంతల వెంకట్రావు, నందేల శ్రీధర్‌, అల్లు తిరుపతి, అప్పలనాయుడు, గౌరమ్మ, విజయ, బొమ్మి శేషగిరి తదితరులు వైఎస్సార్‌సీపీ మహిళావిభాగం జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పద్మావతి, వైస్‌ఎంపీపీ రెడ్డి సురేష్‌ల ఆధ్వర్యంలో బుధవారం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పాలకేంద్రానికి వెళ్లిన వారిని, రామమందిరం వద్ద కూర్చుని ఉన్న వారిని టీడీపీ వాళ్లు పిలిచి మాయమాటలు చెప్పి ఆ పార్టీ కండువాలు వేశారని, మేమంతా వైఎస్సార్‌సీపీయేనని పార్టీలో చేరిన వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అందుకే మళ్లీ వైఎస్సార్‌సీపీలో చేరామని వివరించారు.

మలేరియా నిర్మూలనకు

విస్తృత చర్యలు

సీతంపేట: మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రబలకుండా విస్తృత చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా మలేరియా నివారణాధికారి జగన్‌మోహన్‌రావు తెలిపారు. ఈ మేరకు సీతంపేట మండలంలోని దోనుబాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించి అక్కడి సిబ్బందికి పలు సూచనలిచ్చారు. ల్యా బ్‌ రికార్డులు తనిఖీ చేసి, జ్వరాలు ఏ మేరకు నమోదవుతున్నాయో పరిశీలించారు. జ్వర లక్షణాలు న్న వారికి సత్వరమే రక్తపూతలు సేకరించి నివేదికలు తెలియజేయాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, శిశువుల్లో చిన్న ఆరో గ్య సమస్య లున్నా వెంటనే హైరిస్క్‌గా పరిగణించి తగు చికిత్సలు అందజేయాలని కోరా రు. కిల్కారీ వాయిస్‌ వినిపించాలని చెప్పారు. రక్తహీనత నివారణపై దృష్టిపెట్టాలని, గ్రామాల్లో డ్రై డే కార్యక్రమం పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఎంవో సూర్యనారాయణ, వైద్యాధికారి గిరీష్‌, సూపర్‌వైజర్‌ ధమయంతి, గంగమ్మ పాల్గొన్నారు.

ఆటోబోల్తా: నలుగురికి గాయాలు

సీతంపేట: మండలంలోని జజ్జువ సమీపంలో బుధవారం ఆటో బోల్తాపడడంతో జరిగిన ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. తమ గ్రామం నుంచి నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవడానికి పాలకొండకు ఆటోలో వస్తుండగా మార్గమధ్యంలో మలుపు వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నిమ్మక మాణిక్యం, నారాయణమ్మ, సవర సూ రయ్య, రామారావులకు గాయాలయ్యాయి. వారిని స్థానిక ఏరియా ఆస్ప త్రిలో చేర్పించగా ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పాలకొండ ఒకరిని, శ్రీకాకుళం రిమ్స్‌కు మరొకరిని రిఫర్‌ చేశారు. మిగతా ఇద్దరు కోలు కున్నట్లు ఏఎస్సై సంజీవరావు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై చెప్పారు.

ఎన్నికల ఏర్పాట్లలో

లోపాలుండకూడదు

ఆర్‌ఓ విష్ణుచరణ్‌

సాలూరు: ఎన్నికల ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు తలెత్తకూడదని ఐటీడీఏ పీఓ, సాలూ రు అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి విష్ణుచరణ్‌ అన్నారు. ఈ మేరకు స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఏర్పాటుచేసిన ఎన్నికల సామగ్రి పంపిణి కేంద్రాన్ని బుధవారం ఆయన పరి శీలించారు. ఎన్నికల సిబ్బందికి మంచినీరు, అల్పాహారం, భోజనం తదితర పంపిణీ కౌంటర్లపై ఆరా తీశారు. సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. ఎవరు ఎక్కడ ఎన్నికల సామగ్రి తీసుకోవాలనే అంశంపై సందేహాలకు తావులేకుండా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ను ఆయన పరిశీలించారు. హోమ్‌ ఓటింగ్‌ బ్యాలెట్‌లను సీల్‌ చేశారు.

వైఎస్సార్‌సీపీలో చేరిన పలువురు నాయకులు
1/2

వైఎస్సార్‌సీపీలో చేరిన పలువురు నాయకులు

వైఎస్సార్‌సీపీలో చేరిన పలువురు నాయకులు
2/2

వైఎస్సార్‌సీపీలో చేరిన పలువురు నాయకులు

Advertisement
 
Advertisement
 
Advertisement