అరకు ఎంపీకి సముచిత స్థానం | - | Sakshi
Sakshi News home page

అరకు ఎంపీకి సముచిత స్థానం

Published Sun, Oct 27 2024 12:27 AM | Last Updated on Sun, Oct 27 2024 12:27 AM

అరకు

అరకు ఎంపీకి సముచిత స్థానం

రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ కమిటీలో సభ్యురాలిగా నియామకం

పార్లమెంట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఉత్తర్వులు

సాక్షి, పాడేరు: అరకు ఎంపీ డాక్టర్‌ గుమ్మా తనూజారాణికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక కమిటీలో సముచిత స్థానం కల్పించింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ కమిటీ సభ్యురాలిగా ఆమెను నియమిస్తూ పార్లమెంట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఆమె కేంద్ర ప్రభుత్వం పరిధిలోని హౌసింగ్‌, జాతీయ ఇతర వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ సభ్యురాలిగా పని చేస్తున్నారు. అదనంగా రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కమిటీ సభ్యురాలిగా నియమించడంపై పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు.

సీతంపేటలో పీజీఆర్‌ఎస్‌ రేపు

సీతంపేట/పార్వతీపురం: సీతంపేట ఐటీడీఏలోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక సోమ వారం నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ ఎ.శ్యాంప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ అర్జీలను సమర్పించుకోవచ్చన్నారు. జిల్లా అధికారులంతా హాజరు కావాలని కోరారు.

బాధ్యతలు చేపట్టిన డీఈఓ

పార్వతీపురం టౌన్‌: పార్వతీపురం డీఈఓగా ఎన్‌.తిరుపతిరావు శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈయన ఇప్పటివరకు విజయనగరం డైట్‌ సీనియర్‌ లెక్చరర్‌గా విధులు నిర్వహించారు. ఇప్పటివరకు డీఈఓగా విధులు నిర్వహించిన జి.పగడాలమ్మ విజయనగరం డైట్‌ ప్రిన్సిపాల్‌గా వెళ్లారు. పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యారంగ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తిరుపతిరావు తెలిపారు. ఆయనను డీఈఓ కార్యాలయ సిబ్బంది అభినందించారు.

29న ధ్రువపత్రాల పరిశీలన

సీతంపేట: భామిని, మెళియాపుట్టి ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో పీజీటీ, ఫిజిక్స్‌, గణితం, కెమిస్ట్రీ ఉపాధ్యాయుల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 29న ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్లు ఐటీడీఏ పీఓ యశ్వంత్‌కుమార్‌ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. భామిని ఈఎంఆర్‌ఎస్‌లో ఉదయం 10 గంటలకు ఒరిజనల్‌ విద్యార్హత సర్టిఫికెట్లతో పాటు గెజిటెడ్‌ ఆఫీసర్‌తో అటెస్టేషన్‌ చేసిన జిరాక్స్‌ కాపీలు తీసుకురావాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అరకు ఎంపీకి  సముచిత స్థానం1
1/1

అరకు ఎంపీకి సముచిత స్థానం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement