గిరిజన ప్రాంతాల్లో వైద్యుల సేవలు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

గిరిజన ప్రాంతాల్లో వైద్యుల సేవలు తప్పనిసరి

Published Sun, Oct 27 2024 12:27 AM | Last Updated on Sun, Oct 27 2024 12:27 AM

గిరిజన ప్రాంతాల్లో వైద్యుల సేవలు తప్పనిసరి

గిరిజన ప్రాంతాల్లో వైద్యుల సేవలు తప్పనిసరి

–8లో

క్రీడా సముదాయానికి పదెకరాలు

పార్వతీపురం మన్యం జిల్లాలో క్రీడా సముదాయం ఏర్పాటు చేసేందుకు కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ పది ఎకరాల

స్థలాన్ని కేటాయించారు.

సాక్షి, పార్వతీపురం మన్యం : గిరిజన ప్రాంతాల్లోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికీ తప్పనిసరిగా వైద్యులు ఉండాలని.. లేనిలోట సర్దుబాటు చేయాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులతో పాటు మందులు కూడా అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో ఆమె వివిధ శాఖల పురోగతిపై శనివారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో రక్తహీనత నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి కోసం ఎస్‌సీఎం ఇంజక్షన్‌ అందుబాటులో ఉంచుకోవాలని, వాటికి అవసరమైన నిధులను ప్రభుత్వం మంజురు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సాలూరులో నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రికి ఇటీవలే ప్రభుత్వం రూ.4 కోట్ల నిధులను మంజూరు చేసిందని, మిగిలిన పనులను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసి, ప్రారంభానికి సిద్ధం చేస్తామన్నారు. కురుపాంలోని ఆస్పత్రికి రూ.40 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసిందని, సంక్రాంతి నాటికి నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో 129 పాఠశాలలు మూతపడ్డాయని, వాటిపై సమగ్ర సర్వే చేసి అవసరమైన వాటిని ప్రారంభించాలని ఆదేశించారు. ప్రధానంగా గిరిజన ప్రాంతంలోని పాఠశాలలను తెరిచేందుకు కృషి చేస్తామని తెలిపారు. వసతిగృహ విద్యార్థులకు కాస్మోటిక్స్‌ సామగ్రిని జీసీసీ ద్వారా నేరుగా అందించేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ప్రతి పది మంది విద్యార్థులకూ ఒక మరుగుదొడ్డి ఉండాలని స్పష్టం చేశారు. టాయిలెట్లు లేని పాఠశాలలను గుర్తించి నిర్మించాలని సూచించారు.

తొలిదశలో 549 గ్రామాలకు

రహదారి సౌకర్యం

జిల్లాలో 2,748 గ్రామాలకు రహదారి సౌకర్యం లేదని మంత్రి చెప్పారు. తొలి దశలో 549 గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని.. దశల వారీగా మిగిలిన పనులను పూర్తి చేయాలని సూచించారు. కుంకీ ఏనుగులతో గ్రామాల్లోని ఏనుగుల సమస్యను పరిష్కరించాలని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో ప్రతి పంచాయతీలో బాల విహార్‌, యువ కేంద్రాలు చేపట్టాలని చెప్పారు. 469 అంగన్‌వాడీ కేంద్రాల్లో టాయిలెట్స్‌ సదుపాయం లేదని, అక్కడ నిర్మించడంతో పాటు, నీటి సదుపాయం కల్పించాలన్నారు. సొంత అంగన్‌వాడీ భవన నిర్మాణాల కోసం ఐదు సెంట్ల స్థలాన్ని వీఆర్‌ఓల ద్వారా సేకరించాలని జిల్లా రెవెన్యూ అధికారిని ఆదేశించారు. జిల్లా ప్రగతిని, చేపట్టబోయే కార్యక్రమాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ వివరించారు. సమావేశంలో కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, సంయుక్త కలెక్టర్‌ ఎస్‌.ఎస్‌.శోభిక, సబ్‌ కలెక్టర్‌ అశుతోశ్‌ శ్రీవాస్తవ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కొరత ఉన్నచోట సర్దుబాటు చేయండి

పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో మరుగుదొడ్ల నిర్మాణం

రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement