పెళ్లి సందడి..! | - | Sakshi
Sakshi News home page

పెళ్లి సందడి..!

Published Mon, Oct 28 2024 1:51 AM | Last Updated on Mon, Oct 28 2024 1:51 AM

పెళ్లి సందడి..!

పెళ్లి సందడి..!

రెండు నెలల్లో వేలాదిగా జరగనున్న పెళ్లిళ్లు

వివిధ వర్గాల వారికి ఉపాధి అవకాశాలు

విజయనగరం: ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీట వేసి నూతన దాంపత్య జీవితానికి సిద్ధమవుతున్న వారికి మంచి రోజులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఉమ్మడి విజయనగరం జిల్లాలో పెళ్లి సందడి ప్రారంభంకాగా.. దీపావళి పండగ ముగియగానే మరింత జోరందుకోనుంది. దీనికోసం వివాహ వేదికలు సిద్ధమవుతున్నాయి. వచ్చే రెండు నెలల పాటు శుభ ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. వివాహ వేడుకల వల్ల మంగళ వాయిద్యాలు, మండపాలు, క్యాటరింగ్‌ నిర్వాహకులకు చేతి నిండా పనిదొరకనుంది.

వసతులను బట్టి..

ఉమ్మడి విజయనగరం జిల్లాలో సుమారు 500 పైగా ఫంక్షన్‌ హాల్స్‌ ఉన్నాయి. వసతులను బట్టి ఒక్కరోజుకు అద్దె రూ.25వేల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తారు. పెళ్లిళ్ల సీజన్‌ మొదలు కానుండడంతో వాటి ధరలు అమాంతం పెంచేశారు. దీపావళి కూడా కావడంతో వస్త్ర, బంగారు దుకాణాలు కొనుగోళ్లతో సందడిగా ఉన్నాయి. ఇదే ఒరవడి రెండు నెలల పాటు సాగుతుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

డిసెంబర్‌ వరకు..

డిసెంబర్‌ వరకు అన్ని రకాల వేడుకలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. పెళ్లిళ్లకు ఎక్కువ సంఖ్యలో ముహూర్తాలు ఉన్నాయి. ఇప్పటికే ఎంతోమంది మమ్మల్ని సంప్రదించారు. రెండు నెలల్లో 21 రోజులు బాగున్నాయి.

– కామేశ్వరశర్మ,

వేద పండితులు, విజయనగరం

మంచి ముహూర్తాలు ఇవే..

రెండు నెలల్లో 21 రోజుల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. ఆయా రోజుల్లో ఉమ్మడి జిల్లాల్లో 5 వేలకు పైగా వివాహాలు జరుగుతాయని అంచనా.

నవంబర్‌ 3, 7, 8, 9, 10, 13, 14, 15, 16, 17 తేదీలు

డిసెంబర్‌ 5, 6, 7, 8, 9, 10, 13, 14, 15, 18 తేదీలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement