అనితర సాధ్యం! | - | Sakshi
Sakshi News home page

అనితర సాధ్యం!

Published Mon, Oct 28 2024 1:51 AM | Last Updated on Mon, Oct 28 2024 1:50 AM

అనితర సాధ్యం!

అనితర సాధ్యం!

అబద్ధాలు,

అభాండాలు

సాక్షి ప్రతినిధి, విజయనగరం:

బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్నవారు పరామర్శకు వచ్చినప్పుడు బాధితులకు భరోసా కల్పించాలి. ధైర్యం చెప్పాలి. ప్రభుత్వం అండగా ఉంటుందని అభయమివ్వాలి. ఇంటి దిక్కును కోల్పోయిన ఆ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి పరిహారం ఏమి ఇస్తామో స్పష్టంగా ప్రకటించాలి. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర హోం మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా వంగలపూ డి అనిత మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. గత గురువారం వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గుర్ల మండలంలో డయేరియా మృతుల కుటుంబాలను పరామర్శించి వెళ్లిన వెనువెంటనే ఆమె ఆగమేఘాలపై గుర్ల గ్రామానికి వచ్చారు. ‘ఎలా చనిపోయారు?’ అనే ఒక్క మాట తప్ప ప్రభుత్వం నుంచి తాము ఏ పరిహారం ఇప్పిస్తామో ఆమె చెప్పకపోవడంతో ఆ 14 బాధిత కుటుంబాలకు నిరాశ, నీరస మే మిగిలాయి. తర్వాత కలెక్టరేట్‌లో సమీక్ష సమా వేశం తర్వాత కూడా డయేరియా బాధితులకు ఊరటనిచ్చే ఒక్క మాట కూడా చెప్పలేదు. తమ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికి నోటికొచ్చిన అబద్ధాలు చెప్పారు. గత ప్రభుత్వంపై అభాండాలు వేశారు. ఈ ప్రావీణ్యం తనకు తప్ప వేరెవ్వరికీ ‘అనిత’ర సాధ్యమని మరోసారి నిరూపించారు.

మరణాలపై తలో మాట...

గుర్ల ఘటనలో బాధిత కుటుంబాలకు అండగా నిల వాల్సిన ప్రభుత్వం 14 మంది మరణాలను సైతం అపహాస్యం పాలు చేస్తోంది. ఒక్కొక్కరు ఒక్కో మాట చెబుతూ పొంతన లేకుండా ప్రకటనలు చేస్తున్నారు. డయేరియా ఘటనను నీరుగార్చే ప్రయ త్నం చేస్తూనే వస్తున్నారు. గుర్ల మండలంలో డయేరియాతో ఎనిమిది మంది చనిపోయారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతుంటే, పది మంది కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సొంతంగా సాయం ప్రకటించి వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌. అయితే ఇప్పటికీ ఆ రూ.లక్ష బాధితులకు అందలేదు. అంతలోనే మళ్లీ డయేరియాతో మృతి చెందినవారు ఒక్కరేనని ఆ పాత పాటే తన నోట పలికారు జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనిత.

ఆ భరోసా ఏదీ..?

డయేరియాతో 460 మందికిపైగా మంచాన పట్టా రు. వాంతులూ విరేచనాలతో ఆరోగ్య పరిస్థితి విషమించి 14 మంది చనిపోయారు. వ్యాధి ప్రారంభంలోనే అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం తగిన వైద్యపరమైన ఏర్పాట్లు చేయలేదు. ప్రభుత్వ వైఫల్యం అడుగడుగునా కనిపిస్తోంది. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో మృతుల కుటుంబాలను పరామర్శిం

చుకునేందుకు ఈనెల 24న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గుర్ల వచ్చారు. మోకాళ్లపై కూర్చొని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కష్టాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటాన ని అభయమిచ్చారు. వారికి న్యాయం జరిగేవరకూ వారి తరఫున ప్రభుత్వంతో పోరాటం చేస్తానని భరోసా ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి వైఎస్సార్‌ సీపీ తరఫున రూ.2 లక్షలు చొప్పున ఆర్థి క సాయం ఇస్తానని ప్రకటించారు. అంతవరకు గు ర్ల ఘటన గుర్తుకు రాని జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనితకు జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ముగిసిన కొద్ది గంటల్లోనే గుర్తుకొచ్చింది. ఆయన వెనుదిరిగిన గంట వ్యవధిలోనే ఆగమేగాలపై గుర్లలో పర్యటించినా బాధితులకు ఎలాంటి భరోసా ఇవ్వకుండానే వెనుదిరిగారు. వెళ్తూవెళ్తూ జగన్‌మోహన్‌రెడ్డి సాయం ప్రకటించడమే తప్ప ఇవ్వరంటూ అబద్ధాలు చెప్పారు.

వైద్యంపై అబద్ధాలు...

వాస్తవానికి ఈ నెల 12న డయేరియా కేసులు ఉద్ధృతంగా బయిటపడ్డాయి. 13, 14 తేదీల నుంచే మరణాలు సంభవించాయి. దీంతో పత్రికల్లో వరుస కథనాలు వెలువడ్డాయి. అప్పటికి కానీ ప్రభుత్వం స్పందించలేదు. ఈ నెల 16న గుర్లలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కానీ డయేరియా రోగులకు వెంటనే వైద్యం అందించామని ఇన్‌చార్జి మంత్రి అనిత బుకాయింపు మాట లు చెబుతున్నారు. వెంటనే వైద్య శిబిరాలు ఏర్పా టు చేసి వైద్యం అందిస్తే 14 మంది ఎలా చనిపోయారన్నది హోంమంత్రే చెప్పాలన్నది గ్రామస్తుల మాట.

గుర్ల డయేరియా ఘటనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వం ఆపసోపాలు

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్‌.

జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించిన వెంటనే జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనిత రాక

బాధిత కుటుంబాలతో మొక్కుబడిగా మాటామంతీ

ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ సాయమూ అయోమయం

తప్పుల నుంచి తప్పించుకోవడానికి

గత ప్రభుత్వంపై అభాండాలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement