సోమవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2024 | - | Sakshi
Sakshi News home page

సోమవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2024

Published Mon, Oct 28 2024 1:51 AM | Last Updated on Mon, Oct 28 2024 1:50 AM

సోమవా

సోమవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2024

బాణసంచా దుకాణాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి

ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి

పార్వతీపురం టౌన్‌: బాణ సంచా దుకాణాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి పేర్కొన్నారు. దీపావళి పండగను పురస్కరించుకుని బాణసంచా విక్రయించే వ్యాపారులకు ఎస్పీ ఆదివారం పలు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల భద్రత దృష్ట్యా పోలీసులకు వ్యాపారులు సహకరించాలని కోరారు. నిబంధనలు పాటించకున్నా, హెచ్చరికలు పెడచెవిన పెట్టినా కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా బాణసంచా దుకాణాలు పెట్టకూడదని, అక్రమంగా నిల్వ ఉంచినా, అనధికారికంగా విక్రయాలు జరిపినా సంబంధిత వ్యాపారులపై పేలుడు పదార్థాల చట్టం, ఐపీసీ సెక్షన్‌ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతులు తీసుకోని దుకాణాలపై దాడులు జరిపేందుకు ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. శాశ్వత, తాత్కాలిక బాణ సంచా తయారీ, విక్రయాల లైసెన్సు కలిగిన దుకాణాల్లో మా త్రమే బాణసంచా విక్రయాలు జ రుపుకోవాలన్నారు. ప్రమాదాల ని వారణకు అవసరమైన నీరు, ఇసు క, తదితర అగ్నిమాపక సామగ్రిని తప్పనిసరిగా టపాసుల విక్రయ దుకాణాల వద్ద సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.

నేడు రక్తదాన శిబిరం

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా పార్వతీపురం పోలీసు మల్టీఫంక్షన్‌ హల్‌లో సోమవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి తెలిపారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వారం రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అందులో భాగంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. స్వచ్ఛందంగా వచ్చి ఈ రక్తదాన శిబిరంలో ఎవరైనా పాల్గొనవచ్చని పేర్కొన్నారు.

తివ్వాకొండ పరిసరాల్లో గజరాజులు

భామిని: మండలంలోని తివ్వాకొండ పరిసర గిరిజన గ్రామాలకు మళ్లీ గజరాజుల బెడద మొదలైంది. మండలంలోని మాసగూడ, జామిగూడ పరిసరాల్లో ఏనుగులు ఆదివారం సంచరించినట్టు అటవీ శాఖాధికారులు గుర్తించారు. ఈ ప్రాంతానికి ఏనుగులు మళ్లీ రావడంపై ఆదివాసీ గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే గిరిజన గ్రామాల పరిధిలో ఏనుగుల గుంపు కొండ దిగి వచ్చాయని, అప్రమత్తంగా ఉండాలని బత్తిలి ఎస్‌ఐ డి.అనిల్‌కుమార్‌, అటవీ శాఖాధికారులు హెచ్చరించారు. రాత్రి పూట కొండల వైపు ఎవరూ వెళ్లరాదని సూచించారు. ఏనుగుల పట్ల ఎటువంటి కవ్వింపు చర్యలకు దిగరాదని తెలిపారు.

రామతీర్థంలో ప్రత్యేక హోమాలు

నెల్లిమర్ల రూరల్‌: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో ఆదివారం ప్రత్యేక పూజలు జరిగాయి. వేకువజామున స్వామికి ప్రాతః కాలార్చన, బాలభోగం నిర్వహించిన తర్వాత యాగశాలలో ఆదిత్య హృదయం, సుందరకాండ హవనం, తదితర హోమాలు జరిపించారు. అనంతరం లోక క ల్యాణార్థం స్వామి వెండి మండపం వద్ద సీతా రాముల నిత్య కల్యాణం చేపట్టారు. కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

గత ప్రభుత్వంపై అభాండాలు...

గుర్ల మండలంలో 14 మంది మరణాలకు డయేరియా కాదని, గత ప్రభుత్వం వల్లే అంతా జరిగిందని బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టేందుకు ఇన్‌చార్జి మంత్రి ప్రయత్నించారు. చెత్తపన్ను వేసినా చెత్త తరలించలేదని, అంతా పేరుకుపోయి భూగర్భ జలాలు కలుషితమైపోయాయని చెప్పుకొచ్చారు. వాస్తవానికి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మానసపుత్రిక గ్రామ సచివాలయాల వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థతో పారిశుద్ధ్య నిర్వహణ చక్కగా సాగింది. వలంటీర్లు ఇచ్చే సమాచారం ఎంతగానో ఉపయోగపడేది. కరోనా లాంటి మహావిపత్తు సమయంలో ప్రాణనష్టాన్ని కనిష్టస్థాయికి పరిమితం చేయడంలో ఆ వ్యవస్థల పాత్ర అనిర్వచనీయం. అలాంటి వలంటీర్లను కూటమి ప్రభుత్వం పక్కనబెట్టేసింది. సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. దీంతో గ్రామాల్లో పాలన అటకెక్కింది. డయేరియా, విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇవన్నీ చెప్పకుండా డయేరియా కారణాలేమిటో ఇప్పటికీ తెలియదన్నట్లుగా కమిటీలతో కాలక్షేపం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దెబ్బతిన్న తొలికాపు

ఎకరాకు 3 క్వింటాళ్లమేర తగ్గిన దిగుబడి

జిల్లాలో 12,356 ఎకరాల్లో సాగు

ఆవేదనలో రైతులు

భామిని: పత్తి రైతుకు ఈ ఏడాది కష్టకాలం ఎదురైంది. విత్తే సమయంలో వర్షాలు కురవలేదు. పూత, కాపు దశలో వాతావరణ ప్రతికూలతతో పంట పాడైంది. సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో తుపాన్ల ధాటికి మొదటి కాపు పనికిరాకుండా పోయింది. ఎకరాకు 3 క్వింటాళ్ల వరకు దిగుబడి తగ్గింది. పత్తిపంట సాగుకు అధిక పెట్టుబడి కావడం.. దిగుబడి తగ్గడంతో రైతుకు గిట్టుబాటు కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం క్వింటాకు రూ.7,020లు మద్దతు ధర ప్రకటించింది. తుఫాన్‌ అనంతరం అదనంగా క్వింటాకు రూ.500 ధర పెంచినా దళారీ వ్యవస్థ వల్ల రైతు చేతికి ఆ ధర అందని పరిస్థితి. అరకొరగా పండిన పంటను సాలూరు, రాజాంలో ఉన్న కొనుగోలు కేంద్రాలకు తరలించి విక్రయించేందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. దళారులు చెప్పిన ధరకు ఇంటివద్దనే పంటను విక్రయిస్తూ నష్టపోతున్నారు. ప్రధాన వాణిజ్య పంటగా పత్తిని సాగుచేసినా ఫలి తం లేకపోయిందని రైతులు నిట్టూర్చుతున్నారు.

న్యూస్‌రీల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
సోమవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్‌ శ్రీ 20241
1/5

సోమవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2024

సోమవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్‌ శ్రీ 20242
2/5

సోమవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2024

సోమవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్‌ శ్రీ 20243
3/5

సోమవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2024

సోమవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్‌ శ్రీ 20244
4/5

సోమవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2024

సోమవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్‌ శ్రీ 20245
5/5

సోమవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2024

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement