104, 108 ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

104, 108 ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

Published Mon, Oct 28 2024 1:50 AM | Last Updated on Mon, Oct 28 2024 1:50 AM

104,

104, 108 ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

విజయనగరం ఫోర్ట్‌: 104 ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు జి.అప్పలసూరి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ స్థానిక కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులకు బకాయి ఉన్న మూడు నెలల జీతం తక్షణమే చెల్లించాలన్నారు. ప్రతి నెలా 5వ తేదీలోగా జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ నియామకాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లకు, డీఈఓలకు వెయిటేజీ ఇవ్వాలన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్‌.రామరాజు, ప్రధాన కార్యదర్శి జగన్‌మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

108 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

108 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఏపీ 108 సర్వీస్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు అప్పలనాయుడు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఆదివారం సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనియన్‌ ఇచ్చిన డిమాండ్‌ నోటీస్‌పై యాజమాన్యం జరిపిన చర్యల్లో పలు ప్రధాన సమస్యలకు సానుకూల హామీ రాకపోవడంతో నవంబర్‌ 8 వరకు నల్ల రిబ్బన్లతో విధులకు హాజరు కావాలని నిర్ణయించినట్టు తెలిపారు. సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బోను వెంకటరమణ, ఎస్‌.సతీష్‌కుమార్‌, కళ్యాణ్‌, పండు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
104, 108 ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి1
1/1

104, 108 ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement