పాలకొండ రూరల్: చెక్‌బౌన్స్ కేసులో ముద్దాయికి రూ.లక్షా 20వేల జరిమానాతో పాటు ఏడాది జైలు శిక్షను పాలకొండ న్యాయస్థానం బుధవారం విధించింది. కోర్టు అధికారులు అందించిన వివరాల మేరకు పాలకొండలోని మురళీ మోహన్‌నగర్‌కు చెందిన సవిరిగాన దాలినాయుడికి శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నివాసముంటున్న పిలక తిరుమల రెడ్డి 2018లో ఇచ్చిన చెక్కు బౌన్స్ కావడంతో అప్పట్లో నమోదైంది. ఈ కేసులో కొనసాగిన వాదోపవాదాల అనంతరం స్థానిక జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎ.విజయ్‌కుమార్ పై విధంగా తీర్పు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment