AP Elections Political Latest Updates Telugu..
09:03 PM, Mar 7th, 2024
ఏపీ పొత్తు రాజకీయాలు
- ఢిల్లీ చేరుకున్న పవన్ కల్యాణ్
- కాసేపట్లో బీజేపీ పెద్దలతో భేటీ
- ఇప్పటికే చేరుకున్న చంద్రబాబు...అమిత్ షాతో భేటీకి యత్నం
- ఏపీ ఎన్నికల కోసం ఇప్పటికే చేయి కలిపిన టీడీపీ, జనసేన
- బీజేపీని కూడా కూటమిలోకి ఆహ్వానించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు
- ఇప్పటికే ఓసారి అమిత్ షాతో భేటీ అయ్యి భంగపడ్డ బాబు
- టీడీపీతో పొత్తు కోసం బీజేపీని ఒప్పించబోయి తిట్లు తిన్నానన్న పవన్
- పొత్తులపై అర్ధరాత్రి లేదంటే ఉదయం కల్లా స్పష్టత వచ్చే అవకాశం
08:51 PM, Mar 7th, 2024
శెట్టి బలిజలకు వైఎస్సార్‌సీపీ న్యాయం: టీడీపీ నేత!
- డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో జరిగిన శెట్టిబలిజల ఆత్మీయ సమావేశం
- శెట్టిబలిజలకు వైఎస్సార్‌సీపీ కల్పించిన ప్రాధాన్యత చెబుతూ పొగిడిన టీడీపీ నేత రెడ్డి సుబ్రమణ్యం
- శెట్టిబలిజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పించింది: సుబ్రమణ్యం
- ఒక మంత్రి, రాజ్యసభ ఎంపీ, రెండు ఎమ్మెల్సీలు, రెండు పార్లమెంటు సీట్లు, మూడు ఎమ్మెల్యే సీట్లు ఉమ్మడి గోదావరి జిల్లాలో కేటాయించింది: సుబ్రమణ్యం
- ఆధికార పార్టీకి ధీటుగా టీడీపీ శెట్టిబలిజలకు సముచిత స్థానం ఇవ్వాల్సిందే: సుబ్రమణ్యం
- అధికార పార్టీ ఇచ్చినట్టు టీడీపీలో కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వాలంటూ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తీర్మానం
08:10 PM, Mar 7th, 2024
బందరు ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్
- వ్యూహం మార్చిన వైఎస్సార్‌సీపీ
- మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావు
- మార్పుతో.. అధికారికంగా ప్రకటించిన వైఎస్సార్‌సీపీ
- ఈ ప్రాంత ప్రజలకు చంద్రశేఖర్ బాగా సుపరిచితులు:పేర్ని నాని
- ఆయన తండ్రి కూడా మూడుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు:పేర్ని నాని
- మంత్రిగా కూడా ఆయన పని చేశారు:పేర్ని నాని
- చంద్రశేఖర్ మచిలీపట్నం ఎంపీగా పోటీ చేస్తారు:పేర్ని నాని
- ఆయన రావటం వలన పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో మంచి జరుగుతుంది:పేర్ని నాని
- మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని సీఎం కోరటంతో చంద్రశేఖర్ వచ్చారు :పేర్ని నాని
- నన్ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించటం సంతోషంగా ఉంది: సింహాద్రి చంద్రశేఖర్‌రావు
- ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఎప్పుడూ లేను: సింహాద్రి చంద్రశేఖర్‌రావు
- ప్రజలకు సేవలు అందించటానికే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చా: సింహాద్రి చంద్రశేఖర్‌రావు
07:39 PM, Mar 7th, 2024
టీడీపీ వాళ్లు ఓటు వృథా చేసుకోవద్దు: నాని సెటైర్లు
- చంద్రబాబు ప్రభుత్వ అభివృద్ధిని.. నేడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు గమనించాలి
- కుప్పం నియోజకవర్గానికి 30 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు చేసిన అభివృద్ధి శూన్యం
- జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుప్పం నియోజకవర్గం ఎంత అభివృద్ధి జరిగిందో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు
- జగ్గయ్యపేట నియోజకవర్గంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన టీడీపీ నేత శ్రీరామ్ రాజగోపాల్ ఏనాడూ అభివృద్ధి గురించి ఆలోచించలేదు
- నేడు సామినేని ఉదయభాను నిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు
- తెలుగుదేశం పార్టీ వారు ఓటు వృధా చేసుకోవద్దు
- టీడీపీ వారి ఓటు కూడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థికే వేయాలి
- వచ్చేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే
- 175 కి 175 అసెంబ్లీ సీట్లు గెలిచి చరిత్ర సృష్టించబోతున్నాం
- విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలు
06:40 PM, Mar 7th, 2024
గుంతకల్లు టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి
- గుమ్మనూరు జయరాంను వ్యతిరేకిస్తూ గుత్తిలో టీడీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.
- గుంతకల్లు నుంచి పోటీ చేస్తానంటున్న గుమ్మనూరు జయరాం
- గుమ్మనూరు జయరాం మాకొద్దు.. జితేంద్ర గౌడ్ ముద్దంటూ నినాదాలు.
- గుమ్మనూరు జయరాం గుంతకల్లు నుంచి పోటీ చేస్తే కచ్చితంగా ఓడిస్తామంటున్న టీడీపీ కార్యకర్తలు
06:00 PM, Mar 7th, 2024
కాకినాడ రూరర్‌లో వేడెక్కిన రాజకీయం
- పొత్తులో భాగంగా జనసేనకు వెళ్ళిన సీటు
- పంతం నానాజీకి టీడీపీ నుంచి దక్కని మద్దతు
- టీడీపీలో హార్ట్ టాపిక్‌గా పిల్లి అనంతలక్ష్మి తీరు
05:21 PM, Mar 7th, 2024
చంద్రబాబు చిత్రపటాన్ని చించి పడేసిన మహిళలు
- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శ్రీ భగవాన్ బాలయోగిశ్వరుల తపో ఆశ్రమంలో అపచారం?
- టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారంటూ ఆరోపణ
- హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ మండిపడ్డ ఆశ్రమ భక్తులు
- చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని చించి సమీప పంట బోదులో పాడవేసిన మహిళలు
- పాలాభిషేకం జరిగిన ప్రదేశాన్ని పసుపు నీళ్లతో శుద్ధిచేసిన మహిళలు
05:01 PM, Mar 7th, 2024
మేదరమెట్ల సిద్ధం.. జోరుగా ఏర్పాట్లు
- మేదరమెట్ల వద్ద ఈనెల 10న సిద్ధం సభ
- అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమైన వైఎస్సార్‌సీపీ
- శరవేగంగా జరుగుతున్న ఏర్పాట్లు
- సభకు 15 లక్షల పైగా జనం హాజరవుతారని అంచనా
- జన సందోహానికి ఇబ్బందులు జరగకుండా సకల ఏర్పాట్లు
- గుంటూరు -ఒంగోలు కి మధ్యలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ మళ్లించే అవకాశం
- సభ ఏర్పాట్లను పరిశీలించనున్న పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి
04:37 PM, Mar 7th, 2024
నారా లోకేష్‌కు ఝలక్
- మడకశిరలో నారా లోకేష్ కు అసమ్మతి నేతల ఝలక్
- లోకేష్ శంఖారావం సభకు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గైర్హాజరు
- మడకశిర అభ్యర్థి సునీల్ కుమార్ ను మార్చాలని కోరుతున్న గుండుమల తిప్పేస్వామి
04:19 PM, Mar 7th, 2024
ఎన్నికల కమిషన్ సీఈఓ అఖిలపక్ష సమావేశం
- ఎన్నికల నిర్వహణపై విజయవాడలో అన్ని పార్టీలతో సమావేశమైన సీఈవో ముఖేష్ కుమార్ మీనా
- ఈసీ నిబంధనలు, ఎన్నికల కోడ్ అమలుపై పార్టీలకు అవగాహన కల్పించిన సీఈవో
- నామినేషన్లు ర్యాలీ లు, హెలికాప్టర్ లు, సభలు, సమావేశాలకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని ఆదేశం
04:04 PM, Mar 7th, 2024
చీవాట్లు పెట్టినా సరే.. ఢిల్లీకి చంద్రబాబు
- బీజేపీ పొత్తు కోసం చంద్రబాబు శతకోటి ప్రయత్నాలు
- బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లిన చంద్రబాబు
- రాత్రి 8 గంటలకు ఢిల్లీ చేరుకోనున్న పవన్ కళ్యాణ్
- రాత్రి 9 గంటల తరువాత బీజేపీ నేతలతో బాబు, పవన్ సమావేశం అయ్యే అవకాశం
- పొత్తు పెట్టుకోవాలని బీజేపీని కోరనున్న బాబు, పవన్
- పొత్తుకు ఓకే అంటే ఇప్పుడే ఎన్డీయే లో చేరుతున్నట్టు ప్రకటిస్తానన్న చంద్రబాబు
- కుదిరితే రేపో, ఎల్లుండో అభ్యర్థుల ఖరారు
- రాత్రికి ఢిల్లీలోనే చంద్రబాబు బస
- చంద్రబాబుతో పొత్తు అంటేనే బీజేపీ పెద్దలు చీవాట్లు తినిపించారని ప్రకటించిన పవన్ కళ్యాణ్
- చీవాట్లు పెట్టినా సరే.. పొత్తు పెట్టుకోవాల్సిందే అంటోన్న చంద్రబాబు
- బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి గత కొన్నాళ్లుగా బాబు ప్రయత్నాలు
- బీజేపీలోకి నలుగురు రాజ్యసభ సభ్యులను పంపిన చంద్రబాబు
03:45 PM, Mar 7th, 2024
తంబళ్లపల్లి టీడీపీలో ముదిరిన విభేదాలు
- టి.సదుంలో టీడీపీ అభ్యర్ధి జయచంద్రారెడ్డి కారుపై రాళ్ల దాడి.
- జయచంద్రారెడ్డి కారుపై రాళ్లు రువ్విన వ్యతిరేక వర్గం
- తంబళ్లపల్లి టీడీపీ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే శంకర్.
- టి.సదుంలో వాయిదా పడిన టీడీపీ విజయ సంకల్ప యాత్ర
- సొంతపార్టీ నేతలే రాళ్లు రువ్వారని భావిస్తున్న జయచంద్రారెడ్డి
03:30 PM, Mar 7th, 2024
అనుచరులతో ముద్రగడ భేటీ
- త్వరలో శుభవార్త వింటారు.
- అమావాస్య తర్వాత నిర్ణయం చెప్తాను.
- మనకి అవకాశం ఇచ్చే వారిని మనం గౌరవించాలి.
- కచ్చితంగా రాజకీయాలు చేస్తాను
03:25 PM, Mar 7th, 2024
ఎన్నికల్లో పోటీపై వాసిరెడ్డి పద్మ స్పందన
- మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గా రాజీనామా చేశాను
- పోటీ చేయాలనే ఆలోచన మాత్రమే రాజీనామాకు కారణం కాదు
- పోటీ చేయడమే గీటు రాయి కాదు
03:20 PM, Mar 7th, 2024
పిఠాపురం జనసేన-టీడీపీ కూటమిలో లుకలుకలు
- పిఠాపురం స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మకు కేటాయించాలని నేటి సాయంత్రం సమావేశం ఏర్పాటు చేసుకున్న టీడీపీ నేతలు.
- పొత్తులో భాగంగా పిఠాపురం సీటు జనసేనకు వెళుతుందని ప్రచారం.
- సాయంత్రం సమావేశంలో పార్టీకి రాజీనామాపై వర్మ నిర్ణయం.
- పార్టీ టికెట్ ఇవ్వకపోతే వర్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని చెప్తున్న అనుచరులు.
- 2014లో టీడీపీ టికెట్ నిరాకరించడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచిన వర్మ.
03:10 PM, Mar 7th, 2024
దళితులను అవమానించిన పార్టీ టీడీపీ: మంత్రి ఆదిమూలపు సురేష్
- కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నారు ఎల్లో మీడియా, టీడీపీ పార్టీ.
- దళితులుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారు అన్న వ్యక్తులు దళితుల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది.
- వెలిగొండ సభలో ఆ ప్రాంత ప్రజలు ముఖ్యమంత్రి దగ్గరకు రావాలని ఆరాటపడుతుంటే వాళ్లను తీసుకొని రావడనికి నేను, తాటిపర్తి చంద్రశేఖర్ వెళ్లాం.
- దానిని ఏదో జరిగిపోయినట్టు, దళితులకు అవమానము జరిగినట్లు ఎల్లో మీడియా ప్రచారం చేయడం దారుణం.
- ఇచ్చిన మాట నిలుపుకునే వ్యక్తి జగన్.. 2020లో మాట ఇచ్చాడు 2024 లో ప్రాజెక్టు పూర్తి చేశారు.
- నిద్రపోయే వాళ్లని లేపవచ్చు, నిద్రపోయినట్లు నటించే వాళ్లను లేపలేం.
- ప్రాజెక్టు పూర్తి కాలేదు అనే వాళ్ళను తీసుకెళ్లి చూపిస్తాం రండి.
- అభివృద్ధి చెయ్యడం చేతకాననే మా ప్రభుత్వంపై నిందలు.
- ఓటమి ఖాయం అని తెలిసే ప్రశాంత్ కిషోర్ చేత టీడీపీ అసత్యాలు పలికిస్తున్నారు.
- రెండునెలలో ఎవరికి ఓటమో తెలుస్తుంది.
02:44 PM, Mar 7th, 2024
చంద్రబాబు ఢిల్లీ టూర్ పై కేశినేని నాని కౌంటర్
- ఎన్డీఏ కూటమి నుండి ఎందుకు బయటకు వచ్చాడో .. మళ్లీ ఎందుకు వెళ్తున్నాడో చంద్రబాబే సమాధానం చెప్పాలి
- 2018 సంవత్సరంలో చంద్రబాబు ఆదేశాల మేరకు నేనే ప్రధాని మోదీ పై అవిశ్వాస తీర్మానం పెట్టా
- పార్లమెంటులో సభ్యులు ఏం మాట్లాడాలనేది చంద్రబాబు స్లిప్పులు రాసి పంపించాడు
- ముందు స్పెషల్ ప్యాకేజీ ముద్దు అన్న చంద్రబాబు మళ్ళీ ప్యాకేజీ వద్దంటూ స్పెషల్ కేటగిరి కావాలంటూ రివర్స్ అయ్యాడు
- 2019 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుంది అనే ఆలోచనతో కాంగ్రెస్ తో కలిశాడు
- పనికిరాని కొడుకు లోకేష్ ను ముఖ్యమంత్రి చేసి తాను ప్రధాని కావాలనేది చంద్రబాబు దురాలోచన
- అందుకే అప్పట్లో ఆత్మ పోరాట దీక్షల పేరుతో ప్రధానమంత్రి మోడీ పై వ్యక్తిగత విమర్శలు చేశాడు
- ఆరోజు ప్రధానమంత్రి మోదీని విచక్షణ కోల్పోయి తిట్టారు
- ఆంధ్ర రాష్ట్ర ప్రజల డబ్బులతో ప్రత్యేక విమానంలో మోదీకి వ్యతిరేకంగా రాష్ట్రాలు తిరిగాడు
- ఇతర పార్టీలతో కలిసి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేయాలనుకుని బొక్క బోర్లా పడ్డాడు
- ఇప్పుడు మోదీ , అమిత్ షా కరుణాకటాక్షాల కోసం ఎన్డీఏ కూటమిలో చేరటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు
- వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎన్ని అడ్డదారులు తొక్కటానికైనా చంద్రబాబు సిద్ధంగా ఉంటాడు
- చంద్రబాబును రాష్ట్ర ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరు
02:23 PM, Mar 7th, 2024
ముఖ్య నేతలతో సీఎం జగన్ భేటీ
- అనకాపల్లిలో ముఖ్య నాయకులతో భేటీ అయిన సీఎం జగన్
- స్థానిక ఇంఛార్జి లు, ఎమ్మెల్యే లతో సీఎం జగన్ చర్చ
- సమావేశం అనంతరం బయటకి వచ్చి అభిమానులకి అభివాదం
- భేటీ అనంతరం హెలికాఫ్టర్‌లో విమాన విమానాశ్రయానికి
01:49 PM, Mar 7th, 2024
నారా లోకేష్‌కు చేదు అనుభవం
- హిందూపురం, మడకశిర నియోజకవర్గాల్లో నారా లోకేష్‌కు చేదు అనుభవం
- జనం లేక వెలవెల బోయిన నారా లోకేష్ శంఖారావం సభలు
- హిందూపురంలో జనం లేక కుర్చీలను మడతేసిన టీడీపీ నేతలు
- మడకశిరలో ఖాళీ కుర్చీలతో బోసిపోయిన సభ
- టీడీపీ నేతలపై అసహనం వ్యక్తం చేసిన నారా లోకేష్
- నా సభలకు జనం ఎందుకు రాలేదంటూ లోకేష్ అసంతృప్తి
01:36 PM, Mar 7th, 2024
కార్లను మార్చినట్లు భార్యలను మార్చేస్తాడు.. పవన్‌పై సీఎం జగన్ సెటైర్లు
- చంద్రబాబు పేరు చెబితే మోసాలు, వంచనలే గుర్తొస్తాయి
- చంద్రబాబు పేరు చెబితే పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తొస్తుంది!
- దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే మచ్చగా గుర్తొస్తాడు
- కార్లను మార్చినట్లు భార్యలను మార్చేస్తాడు
- వీరద్దరూ కలిసి 2014లో వాగ్ధానాలు ఇచ్చి మోసం చేశారు.
- బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానంటూ దగా చేశారు
- 2014లో ఒక్క వాగ్ధానం అయినా చంద్రబాబు అమలు చేశాడా?
- మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన వ్యక్తి చంద్రబాబు
- పండంటి బిడ్డ పథకం పేరుతో మోసం చేశారు
- కాల్‌మనీ సెక్స్ రాకెట్‌ను నడిపించిన ప్రభుత్వం చంద్రబాబుది
- చంద్రబాబును నమ్మడం అంటే కాటేసే పామును నమ్మడమే
- వీరిని నమ్మడం అంటే తినేసే పులిని ఇంటికి తెచ్చకోవడమే
- చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటీ లేదు
- ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారు
- బీసీలకు చంద్రబాబు చేసింది సున్నా
- రాబోయే రోజుల్లో మరిన్ని అబద్ధాలు చెబుతారు
- కేజీ బంగారం, ప్రతీ ఇంటికీ బెంజ్‌కారు ఇస్తామంటారు
- చంద్రబాబు, దత్త పుత్రుడు కలిసి మేనిఫెస్టో పేరుతో మోసం చేస్తారు
- రాబోయే రోజుల్లో మరిన్ని అబద్ధాలు చెబుతారు
11:33 AM, Mar 7th, 2024
ముద్రగడను కలిసిన మిథున్‌రెడ్డి, ద్వారంపూడి
- కాకినాడ: కిర్లంపూడిలో ముద్రగడను కలిసిన మిథున్‌రెడ్డి, ద్వారంపూడి
- ముద్రగడను మర్యాదపూర్వకంగా కలిసిన మిథున్‌రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి
11:25 AM, Mar 7th, 2024
ముద్రగడ నివాసానికి కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి
- కిర్లంపూడి లో కాపు ఉద్యమనేత ముద్రగడను మర్యాదపూర్వకంగా కలిసిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
- మరికాసేపట్లో ముద్రగడను కలవనున్న వైఎస్సార్‌సీపీ రిజనల్ కోఆర్డినేటర్ మిధున్ రెడ్డి
10:43 AM, Mar 7th, 2024
ఎన్టీఆర్ జిల్లా: మైలవరంలో మూడు ముక్కలైన టీడీపీ
- టిక్కెట్ కోసం కొట్టుకుంటున్న ఉమా,వసంత,బొమ్మసాని
- వసంతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చంద్రబాబు
- రగిలిపోతున్న దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు
- వసంతకు సహకరించేది లేదంటున్న ఉమా, అతని వర్గం
- వసంతకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని తట్టుకోలేకపోతున్న మైలవరం టీడీపీ నేతలు, శ్రేణులు
- నేను లోకల్.. నేనే లోకల్ అంటున్న బొమ్మసాని సుబ్బారావు
- ఉమా, వసంతలకు పోటీగా బలప్రదర్శన నిర్వహించిన బొమ్మసాని సుబ్బారావు
- పార్టీ కోసం పనిచేస్తున్న తనను చంద్రబాబు గుర్తించాలంటున్న బొమ్మసాని
- తనకే మైలవరం సీటు అడిగే అర్హత ఉందంటున్న బొమ్మసాని
9:55 AM, Mar 7th, 2024
రాజకీయంగా బాబు అండ్‌కోను గోతిలో పాతిపెట్టండి: కొడాలి నాని
- సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎనీఆర్‌ను గుండెల్లో పెట్టుకుని అభిమానించే ప్రతి ఒక్కరూ.. పందుల్లా కలిసి వస్తున్న చంద్రబాబు అండ్‌కోను రాబోయే ఎన్నికల్లో గోతిలో పాతి పెట్టాలి
- పనికి రాని లోకేశ్‌ను గెలిపిస్తే.. పెద్ద ఎన్టీఆర్ మాదిరిగానే జూనియర్ ఎన్టీఆర్‌ను బయటకు గెంటేసి టీడీపీని ఆక్రమించుకుంటారు
- పుట్టిన రోజు, చావు రోజుకు తేడా తెలియని లోకేశ్‌ను సీఎం చేయాలనే దురుద్ధేశంతో జూనియర్ ఎన్టీఆర్‌పై అనేక కుట్రలు చేసి ఇబ్బందులు పెడుతున్నారు
- 120 సార్లు బటన్ నొక్కి పేద ప్రజలకు రూ.2.50లక్షల కోట్లను సంక్షేమ ఫలాలుగా అందించిన సీఎం జగన్ కోసం రెండు సార్లు ఈవీఎం బటన్‌ను ఫ్యాన్ గుర్తుపై నొక్కాలి
8:41 AM, Mar 7th, 2024
చంద్రబాబు, పవన్ అన్యాయం చేశారు..
- కృష్ణాజిల్లా: పెడన సీటు విషయంలో పట్టువీడని జనసేన కార్యకర్తలు
- చంద్రబాబు, పవన్ తమకు అన్యాయం చేశాడంటున్న జనసేన నాయకులు
- బూరగడ్డ వేదవ్యాస్‌ను ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలని ఒత్తిడి తెస్తున్న పెడన కాపు సామాజికవర్గం జనసేన నేతలు
- చంద్రబాబుపై మండిపడుతున్న జనసేన నాయకులు చలంకుర్తి పృథ్వీ ప్రసన్న
- చంద్రబాబు, పవన్ పెడన సీటు విషయంలో పునరాలోచించుకోవాలి
- పొత్తు పేరుతో 24 సీట్లు కేటాయించి అన్యాయం చేశారు
- చంద్రబాబు అరెస్టయ్యాక టీడీపీ పార్టీ చచ్చిపోయింది
- మా నాయకుడు చెప్పగానే చంద్రబాబు కోసం జనసేన కార్యకర్తలు ధర్నాలు చేశారు
- మాకు న్యాయం చేయకపోతే చంద్రబాబు, పవన్ కచ్చితంగా ఇబ్బంది పడతారు
- చంద్రబాబు కమ్మ వారి సీట్లలో కమ్మ వారికి ఇచ్చారు
- కాపుల సీట్లలో బీసీలకు కేటాయించారు
- కాపులు, బీసీలకు మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు
- మొన్నటి వరకూ జనసేన అని ధైర్యంగా చెప్పుకుని తిరిగాం
- కేవలం 24 సీట్లకు పరిమితం చేసి జనసేన పార్టీని చంద్రబాబు అవమానించారు
- టీడీపీకి ఆక్సిజన్ ఇచ్చిన మా నాయకుడిని చిన్నచూపు చూస్తున్నారు
- వైఎస్సార్‌సీపీ ఇప్పటి వరకూ ప్రకటించిన సీట్లలో 21 మంది కాపులకు అవకాశం కల్పించింది
- చంద్రబాబు ప్రకటించిన 94 సీట్లలో కాపులకిచ్చింది నాలుగు మాత్రమే
- సంఖ్యాబలంలో అధికులమైన కాపులను చిన్నచూపు చూస్తున్నారు
- కృష్ణాజిల్లాలో పెనమలూరు, గుడివాడ, గన్నవరం కమ్మవారికి ఇచ్చారు
- కాపులు ఎక్కువ ఉన్న మచిలీపట్నం,పెడన బీసీలకు ఇచ్చారు
- 49 వేల పైచిలుకు కాపు ఓట్లున్న పెడన సీటు కాపులకే ఇవ్వాలి
- వేదవ్యాస్‌కు ఇస్తే జనసేన అండగా నిలుస్తుంది
- రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ప్రకటించిన బూరగడ్డ వేదవ్యాస్
7:49 AM, Mar 7th, 2024
ఢిల్లీ: బీజేపీ-టీడీపీ పొత్తుపై కొనసాగుతున్న సస్పెన్స్
- నిన్న అర్ధరాత్రి బీజేపీ హైకమాండ్‌తో అభ్యర్థులు ఎంపికపై ఏపీ బీజేపీ నేతలు చర్చలు
- పొత్తులపై ఎలాంటి చర్చ జరగలేదని ప్రకటించిన పురందేశ్వరి
- ఈ రోజు మరోసారి హై కమాండ్ తో సమావేశం అవుతామని వెల్లడి
- ఐదు ఎంపీ సీట్లు, 11 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు రెడీ అంటూ టీడీపీ లీకులు
- 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లకు అభ్యర్థులను తయారు చేస్తున్న బీజేపీ
- నేడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన
- నేడు పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం
- అరకొర సీట్లతో పొత్తుల వల్ల బీజేపీకి ఒరిగేదేమీ లేదంటున్న ఏపీ బీజేపీ నేతలు
7:42 AM, Mar 7th, 2024
ఇవాళ ఢిల్లీకి చంద్రబాబు
- సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు
- బీజేపీ పెద్దలను కలవనున్న టీడీపీ అధినేత
- బీజేపీతో పొత్తు, ఎన్డీయేలో చేరిక, సీట్ల సర్దుబాటుపై స్పష్టత వస్తుందంటున్న టీడీపీ వర్గాలు.
7:33 AM, Mar 7th, 2024
ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు దురుద్దేశపూరితమే: ఎంపీ విజయసాయిరెడ్డి
- ఆయన వ్యాఖ్యలను గమనిస్తే ఎటువంటి గణాంకాలు, శాస్త్రీయ ఆధారాలు లేకుండా చెప్పినట్టు స్పష్టమవుతోంది
- వాటిని ప్రజలు నమ్మరు
- సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ మరోసారి క్లీన్‌స్వీప్ చేయడం ఖాయం
- సీఎం జగన్ 2019 ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోలో 99 శాతం హామీలను నెరవేర్చారు
- వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత సమాజంలో ఆర్థిక, సామాజిక అసమానతలను నిర్మూలించి బడుగు, బలహీన వర్గాల వారు ఆర్థికాభివృద్ధి చెందేలా పాలన సాగించారు
- గత ప్రభుత్వంతో పోలిస్తే తలసరి ఆదాయం, స్థూల ఉత్పత్తిలో మన రాష్ట్రం దేశంలోనే ఒకటి, రెండు స్థానాల్లోనే ఉంది
- అది తెలిసి కూడా రాష్ట్రం వెనుకబడి ఉందని ప్రతిపక్షాలు విమర్శించడం అర్థరహితం
- సిద్ధం సభలకు విశేష స్పందన లభిస్తోంది
- రాష్ట్ర ప్రజల్లో వైఎస్సార్‌సీపీ పట్ల ప్రేమ, అభిమానం మరింత అధికమైంది
- ఇక్కడ పుట్టి పెరిగిన తనకు ఈ జిల్లాకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు సీఎం జగన్‌కి ప్రత్యేక ధన్యవాదాలు
ప్రశాంత్ కిషోర్ మాటల్లో విశ్వసనీయత లేదు. ఆ మాటల వెనక దురుద్దేశం ఉంది.. వాటిని ప్రజలు నమ్మరు.
— YSR Congress Party (@YSRCParty) March 6, 2024
-నెల్లూరు ఎంపీ అభ్యర్థి & రీజినల్ కో-ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి pic.twitter.com/BXVIbcXp69
7:20 AM, Mar 7th, 2024
ఇది దేవుడి స్క్రిప్ట్..నాన్న మొదలుపెడితే..నేను పూర్తి చేశా
- ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం.. నిజంగా నా అదృష్టం
- వెలిగొండను జాతికి అంకితం చేసిన సీఎం వైఎస్ జగన్
- వాయువేగంతో జంట సొరంగాలు పూర్తి
- పూర్తయిన టన్నెళ్లను స్వయంగా పరిశీలించి పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం
- ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగు నీరు.. 30 మండలాల్లో 15.25 లక్షల మందికి తాగునీరు కూడా..
- రూ.1,200 కోట్లతో ఎల్‌ఏ, ఆర్‌అండ్‌ఆర్
- ఆగస్టు నుంచి ప్రాజెక్టు ద్వారా నీళ్లు
- రూ.53 కోట్లతో రెండు ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన
- గిద్దలూరు నియోజకవర్గంలో 13,500 ఎకరాలకు సాగునీరు
ప్రకాశం, నెల్లూరు, వైయస్ఆర్ కడప జిల్లాల్లోని ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత మెట్ట ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించాలన్నది దివంగత మహానేత వైయస్ఆర్ గారి ఆశయం. అందుకు అనుగుణంగా ఆ ప్రాంతాలకు జీవనాడి వంటి పూల వెంకటసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్‌కు 2004లో శంకుస్థాపన… pic.twitter.com/CRp33xrmIs
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 6, 2024
7:15 AM, Mar 7th, 2024
విప్లవ భేరి
- రాష్ట్రంలో 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన
- విప్లవాత్మక మార్పులు తెచ్చిన సీఎం వైఎస్ జగన్
- తొలి కేబినెట్ ఏర్పాటుతోనే సామాజిక విప్లవం ఆవిష్కరణ
- మేనిఫెస్టోయే దిక్సూచి.. 99 శాతం హామీల అమలుతో విశ్వసనీయత
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు.. మహిళలకు నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం రిజర్వేషన్
- వివక్ష, లంచాలకు తావు లేకుండా పేదల ఖాతాల్లో నేరుగా రూ.2.55 లక్షల కోట్లు జమ
- ఈ సొమ్ము సద్వినియోగంతో 11.77 శాతం నుంచి 4.19 శాతానికి తగ్గిన పేదరికం
- గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు
- స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు
- ఇందులో ఈ 58 నెలల్లో నియమించినవే 2.13 లక్షలు
- ఒకే నోటిఫికేషన్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.34 లక్షల ఉద్యోగాల భర్తీ
- నాడు–నేడుతో పాఠశాలలకు కొత్త రూపు.. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్
- అమ్మ ఒడితో ప్రభుత్వ పాఠశాలల్లో 98.73 శాతానికి పెరిగిన విద్యార్థుల నికర నమోదు నిష్పత్తి
- కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి.. పూర్తిస్థాయిలో సిబ్బంది నియామకం
- ఆరోగ్యశ్రీ పరిధి రూ.25 లక్షలకు పెంపు, విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్, జనన్న ఆరోగ్య సురక్షతో నాణ్యమైన వైద్య సేవలు
- సులభతర వాణిజ్యంలో ఏపీ అగ్రగామి.. పారిశ్రామికాభివృద్ధి వేగవంతం
- ఆర్బీకేల ద్వారా వ్యవసాయ రంగంలో దూసుకుపోతున్న రాష్ట్రం
- జీవన ప్రమాణాలు మరింతగా పెరగాలంటే ఈ విప్లవం కొసాగాలని కోరుకుంటున్న అన్ని వర్గాల ప్రజలు, మేధావులు
7:06 AM, Mar 7th, 2024
టీడీపీలో కొత్త కష్టాలు
- వలస నేతలతో ఉన్న నేతలకు గండం
- వేమిరెడ్డి రాకతో సోమిరెడ్డి, శ్రీనివాసులరెడ్డి సీట్లు గల్లంతు
- సోమిరెడ్డికి బదులు సర్వేపల్లిలో రూప్‌కుమార్‌కి సీటివ్వాలని వేమిరెడ్డి పట్టు
- కోవూరు సీటును తన సతీమణికి ఇప్పించేందుకు ప్రయత్నాలు
- లావు శ్రీకృష్ణదేవరాయలు చేరికతో యరపతినేని, అరవింద్‌బాబు సీట్ల కిందకు నీరు
- గుమ్మనూరు జయరాం దెబ్బకు జితేంద్ర గౌడ్.. సారథి ప్రభావంతో ముద్దరబోయినకు చెక్
- ఫిరాయింపు నేతలకు పెద్దపీట వేసి తమను అవమానిస్తున్నారని సీనియర్ల ఆగ్రహం
7:04 AM, Mar 7th, 2024
మాజీ ఎంపీ హరిరామజోగయ్య లేఖాస్త్రం
- కాపుల డిక్లరేషన్ ఎప్పుడు పవన్?
- బీసీలకు ప్రకటించిన హామీలను కాపులకూ ప్రకటించాల్సిందే..
- 52 శాతం ఉన్న బీసీలకు డిక్లరేషన్ ప్రకటించడం ఆహ్వానించదగ్గ విషయమే
- కాపులకూ డిక్లరేషన్ ఎప్పుడు ప్రకటిస్తారో కూడా తెలియజేయాల్సింది
- మంగళగిరిలో ఏర్పాటుచేసిన జయహో బీసీ సభలో చంద్రబాబు, పవన్‌లు బీసీ డిక్లరేషన్ పేరుతో 10 ఎన్నికల హామీలిచ్చారు
- ఇందులో పవన్ తన వంతుగా బీసీలకు రాజ్యాధికారం దక్కేలా.. యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి తెస్తానంటూ 11వ హామీ ఇచ్చారు
- అదే విధంగా 25 శాతం ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తుల ఆర్థిక సామాజిక పరిస్థితులపైనా చర్చించాల్సిన అవసరం ఉంది
- టీడీపి –జనసేన కూటమి తమ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ప్రకటించిన హామీలతో సమానంగా కాపులకూ ప్రకటించాల్సిందే
- ఇదిలా ఉండగా, మదనపల్లికి.. శ్రీరామ రామాంజనేయులు, తిరుపతి.. ఆరణి శ్రీనివాస్, రాజంపేట.. ఎంవీ రావు, అనంతపురం.. టీసీ వరుణ్, పుట్టపర్తి.. శివశంకర్, తంబళ్లపల్లి కొండా నరేంద్ర, గుంతకల్లు.. మణికంఠకు కేటాయించాలని సూచిస్తూ పవన్‌కు జోగయ్య మరో లేఖ
బీసీలకు అండగా నిలించింది ఎవరు?
— YSR Congress Party (@YSRCParty) March 6, 2024
చంద్రబాబు హయాంలో బీసీల కోసం ఖర్చు చేసింది కేవలం రూ.19 వేల కోట్లు
సీఎం వైయస్ జగన్ పాలనలో 2019 నుంచి ఇప్పటివరకు చేసిన ఖర్చు రూ.1.78 లక్షల కోట్లు (డీబీటీ + నాన్ డీబీటీ)#YSRCPWithBCs#TDPAntiBC pic.twitter.com/D5pteMdI09
6:51 AM, Mar 7th, 2024
మడతబెట్టిన హామీలకు డిక్లరేషన్ రూపం..
- బీసీల కోసం మరో వేషం
- వచ్చే ఐదేళ్లలో బీసీలకు బాబు చేస్తానన్న ఖర్చు రూ.1.50 లక్షల కోట్లు
- గత ఐదేళ్లలో జగన్ బీసీలకు చేకూర్చిన లబ్ధి రూ.1.76 లక్షల కోట్లు
- బీసీలంటే ‘బ్యాక్ బోన్’ అన్న వైఎస్సార్‌సీపీ స్లోగన్‌నే కాపీ కొట్టిన టీడీపీ
- బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలన్నీ జగన్ సర్కారు అమలు చేస్తున్నవే
- బీసీ కార్పొరేషన్లు.. కుల ధ్రువీకరణ పత్రాలు.. కుల గణన.. ఇలా అన్నీ కాపీనే
- అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేయకుండా డ్రామాలు
- నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం ఇస్తామన్న బాబు
- 50 శాతానికిపైగా పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చిన వైఎస్సార్‌సీపీ
- అభాసుపాలైన చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ బీసీ డిక్లరేషన్
Comments
Please login to add a commentAdd a comment