
AP Political News And Election News April 3rd Telugu Updates
09:43 PM, April 3rd 2024
తన స్టార్ క్యాంపెయినర్లకు సీఎం వైఎస్ జగన్ పిలుపు
- మన ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి
- తమకి జరిగిన మంచిని మరో 100 మందికి చెప్పి ప్రతి ఓటు కూడా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కి చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్లీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా జాగ్రత్తపడాల్సిన సమయమొచ్చింది!
మన ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి. తమకి జరిగిన మంచిని మరో 100 మందికి చెప్పి ప్రతి ఓటు కూడా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కి చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్లీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా జాగ్రత్తపడాల్సిన… pic.twitter.com/jzfwuV10Ke
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 3, 2024
09:10 PM, April 3rd 2024
కృష్ణా జిల్లా:
వజ్రమ్మ కుటుంబ సభ్యులను ఓదార్చిన మంత్రి జోగి రమేష్
- గంగూరులో పెన్షన్ కోసం వెళ్లి మృతి చెందిన వెంపటి వజ్రమ్మ
- మృతదేహానికి నివాళులర్పించిన మంత్రి జోగిరమేష్
- వజ్రమ్మ మృతి బాధ కలిగించింది: జోగి రమేష్
- చంద్రబాబు అభం శుభం ఎరగని అవ్వను పొట్టన పెట్టుకున్నాడు
- వాలంటీర్లు తలుపు తట్టి అవ్వా తాతలకు పెన్షన్ అందజేసేవారు
- చంద్రబాబు ఈసీకి ఫిర్యాదు చేసి రాక్షసానందం పొందుతున్నాడు
- జగనన్న చేసే మంచి పనులు ఓర్వలేక చంద్రబాబు కోర్టుకు వెళ్లాడు
- చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని ఈనెల 7వ తేదీన ఉయ్యూరు వస్తాడు?
- త్వరలోనే ప్రజలు చంద్రబాబుకి బుద్ధి చెబుతారు
- ప్రజలందరూ ముక్తకంఠంతో మళ్లీ సీఎంగా వైఎస్ జగన్ ఉండాలని ఆకాంక్షిస్తున్నారు
09:06 PM, April 3rd 2024
రాజమండ్రి రూరల్
జగన్ పాలనలోనే ప్రజలకు న్యాయం: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం
- బౌన్సర్లతో పవన్ ప్రజలను భయపెడుతున్నాడు
- పేద ప్రజల మనసు ఎరిగిన వైఎస్ జగన్ పాలనతోనే వారికి న్యాయం జరుగుతుంది
- రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుంది
- చంద్రబాబు కాపులను అణగదొక్కాలని చూస్తే సీఎం జగన్ అక్కున చేర్చుకున్నారు
- ఎన్నికల నేపథ్యంలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పొత్తు ఏర్పరచుకుని కుటిల రాజకీయాలు చేస్తున్నారు
- చంద్రబాబు ఎన్ని దుర్మార్గపు రాజకీయాలు చేసినా, ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినా సీఎం జగన్ చరిష్మా ముందు ఓడిపోక తప్పదు
- పవన్ కాపుల ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టేశాడు
- నన్ను ఎవరు ముట్టుకోకూడదు అంటూ బౌన్సర్లతో జనాలను కొట్టించే నాయకులు రాజకీయాలకు దూరంగా ఉండాలి.
07:45 PM, April 3rd 2024
గంగూరులో టీడీపీ నేత బోడే ప్రసాద్‌కు చేదు అనుభవం
- పెన్షన్ కోసం వెళ్తూ మృతి చెందిన వెంపటి వజ్రమ్మ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన బోడే ప్రసాద్ ,టీడీపీ నేతలు
- ఎందుకు వచ్చారని బోడ్ ప్రసాద్,టీడీపీ నేతలను నిలదీసిన మృతురాలి కుటుంబ సభ్యులు.
- చంద్రబాబు వల్లే వజ్రమ్మ మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువులు
- మృతదేహాన్ని సందర్శించేందుకు రావొద్దని నినాదాలు
- చేసేది ఏమీ లేక వెనుదిరిగిన బోడె ప్రసాద్,టీడీపీ నేతలు
07:00 PM, April 3rd 2024
పూతలపట్టు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం
- ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మనం ప్రభుత్వం మంచి చేయడానికి ఉపయోగించుకుంది
- ఇన్ని జెండాలు, ఇన్ని పార్టీలు ఏకమవుతున్నాయి. కుట్రలు కుతంత్రాలు
- జగన్‌కు, చంద్రబాబుకు యుద్ధం కాదు ఈ ఎన్నికలు
- ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబు, ప్రజలకు జరుగుతున్న ఎన్నికలు
- ఈ యుద్ధంలో నేను ప్రజల పక్షంలో ఉన్నాం
- ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీ, హోదాను అడ్డుకున్న మరో పార్టీ అంతా చంద్రబాబు పక్షమే.
- ఒక్కడిపై పోరాటానికి ఇంతమంది వస్తున్నారు
- మంచివైపు నిలబడి యుద్ధం చేయడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా..?
- ధర్మాన్ని గెలిపించడానికి మీరంతాసిద్ధమా?
6:30 PM, April 3rd 2024
వేలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదు: సీఎం జగన్
- ప్రభుత్వంపై చంద్రబాబు, కూటమి ఎంత విషయం కక్కుతున్నారో ప్రజలు చూస్తున్నారు
- 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మనదే.
- రైతు భరోసా పేరుతో రైతులకు నేరు 34,370 కోట్లు ఇచ్చాం .
- ఉచిత పంటల భీమా కోసం రూ. 7,800 కోట్లు చెల్లించాం.
- ఇన్‌పుట్ సబ్సిడీ పేరుతో రైతుకు రూ. 3,262 కోట్లు అందించాం.
- 53 లక్షల మంది తల్లుల అకంట్లలో అమ్మఒడిడి ద్వారా 26,067 కోట్లు ఇచ్చాం.
- జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కింద 18 వేల కోట్లు ఇచ్చాం.
- వైఎస్సార్ చేయుత కింద 39 ళక్షల మంది అక్క చెల్లెళ్లకు రూ. 19,182 కోట్లు అందించాం.
- ఈబీసీ నేస్తం కింద 1,876 కోట్లు ఇచ్చాం.
- కాపు నేస్తం కింద రూ. 2,029 కోట్లు ఇచ్చాం.
- వైఎస్సార్ ఆసారా కింద 25, 571 కోట్లు.
- ఆరోగ్య శ్రీ కింద 33 12463 కోట్లు ఖర్చు చేశాం.
- సున్నా వడ్డీ కింద అక్క చెల్లెళ్లకు రూ. 4,969 కోట్లు ఇచ్చాం.
- వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద రూ. 1,390 కోట్లు ఇచ్చాం.
- 10 లక్షల మంది అగ్రి గోల్డ్ బాధితులకు రూ. 906 కోట్లు చెల్లించాం.
- 31 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరుతో ఇచ్చాం
- ఆరోగశ్రీని 25 లక్షలకు పెంచింది మీ జగన్ ప్రభుత్వం
- ఏకంగా 2 లక్షల 70 వేల కోట్లను నేరుగా అకౌంట్‌లో వేసింది
- మధ్యలో ఎక్కడా జన్మభూమి లాంటి దళారులు లేరు.
- మీరు వేసే ఓటు ఐదేళ్లు అంటే 1825 రోజులు మీ భవిష్యత్ వారి చేతుల్లో పెట్టినట్లే.
- చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది, మా ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలు ఆలోచించాలి
- ఎవరి హయాంలో మంచి జరిగిందో ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
- ఈ ఓటు వల్ల మన తలరాతలు మారుతాయని ఆలోచించుకోండి
6:00 PM, April 3rd 2024
కోనసీమలో జనసేనకు ఎదురుదెబ్బ
- జనసేన పార్టీకి రాజీనామా చేసిన అమలాపురం ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు
- అమలాపురంలో పార్టీ అధిష్టానం చాలా అన్యాయం చేసింది
- అమలాపురంలో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు..
- జనసైనికుల మీద వీర మహిళల ఆశయాల మీద నీళ్లు చల్లింది.
- పవన్ కళ్యాణ్ అమలాపురం సీటును టీడీపీకి కేటాయించారు
- తెలుగుదేశం పార్టీ కుట్రపూరితంగా అనైతికంగా సీటు దక్కించుకుంది
- ఎన్నో ఉద్యమాలు చేసి అమలాపురంలో జనసేన జెండాను నిలబెట్టాను
- తెలుగుదేశం జెండా మోయడానికి సిద్ధంగా లేము
- పవన్ కల్యాణ్ ఓ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు
- పార్టీకి క్రియాశీల సభ్యత్వానికి పార్టీ ఇంచార్జ్ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నాను
5:30 PM, April 3rd 2024
ఎన్నికల బందోబస్తు, ఇతర ఏర్పాట్లపై ప్రధాన ఎన్నికల కమీషనర్ రాజీవ్ కుమార్ సమావేశం
- సీఎస్, డీజీపీ, సీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్
- శాంతి భద్రతలు, భద్రతా బలగాల మోహరింపు, ఎన్నికల వ్యయ నిర్వహణపై చర్చ
- సెన్సిటివిటి, నోడల్ అధికారుల నియామకంపై చర్చ
- నోటిఫికేషన్ ఆఫ్ డ్రై డే మరియు పెయిడ్ హాలిడే ప్రకటన
5:10 PM, April 3rd 2024
ప్రస్తుత్తం బీజేపీలోనే ఉన్నా : సినీనటి జయప్రద
- నాకు అవకాశం ఇస్తే ఏపీ ప్రజలకు సేవ చేసుకుంటా
- పిలిస్తే స్టార్ క్యాంపెయినర్‌గా ఏపీలో ప్రచారం చేస్తా
- ఏపీకి రాజధాని, ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేస్తా
4:50 PM, April 3rd 2024
నేటి నుంచి చంద్రబాబు రెండో విడత ప్రజాగళం
- 5 రోజుల పాటు చంద్రబాబు ప్రజాగళం సభలు
- నేడు రావులపాలెం, రామచంద్రాపురంలో ప్రజాగళం సభలు
- కాసేపట్లో రాజమండ్రి చేరుకోనున్న చంద్రబాబు
4:30 PM, April 3rd 2024
చంద్రబాబుపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ విమర్శలు
- చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇలాంటి పరిస్థితులు వస్తాయి
- చంద్రబాబు వస్తే 66 లక్షల మందికి ఇబ్బందులు తప్పవు
4:16 PM, April 3rd 2024
కడప జిల్లా రాజంపేట టీడీపీలో చల్లారని అసమ్మతి సెగలు
- అయోమయంలో బత్యాల చెంగల్రాయుడి రాజకీయ భవితవ్యం
- టికెట్ల కేటాయింపుపై పునరాలోచన చేయాలని బత్యాల డిమాండ్
- బత్యాల డిమాండ్ ను పట్టించుకోని టీడీపీ హైకమాండ్
- పార్టీ మారేందుకు సిద్ధమైన బత్యాల చెంగల్రాయుడు
- ఇప్పటికే వైసీపీ నుంచి బత్యాలకు ఆఫర్
- ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్‌కు వెళ్లే ఆలోచన
- ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలంటున్న బత్యాల అనుచరులు
3:55 PM, April 3rd 2024
ఏలూరు పార్లమెంట్ సీటు పై కూటమి నేతల్లో చిచ్చు
- ఇప్పటికే మాజీ ఎంపీ మాగుంట దూరం
- బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరి అసంతృప్తి
- ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని గారపాటి అనుచరుల డిమాండ్
- ఈనెల 6న తన నిర్ణయం ప్రకటిస్తానంటున్న గారపాటి చౌదరి
- గారపాటితో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్నీ వీరాంజనేయులు మంతనాలు
3:54 PM, April 3rd 2024
జనసేనను వదలని సింబల్ టెన్షన్
- కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఫ్రీ సింబల్స్ జాబితాలో గాజు గ్లాసు గుర్తు
- ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తు కేటాయించొద్దని ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలు
- ఏటా ఏప్రిల్ లో ఇదే తరహా ఫ్రీ సింబల్స్ విడుదల చేస్తూనే ఉంటుంది
- గాజు గ్లాసు గుర్తును తమకే కేటాయించాలని సీఈసీని కోరతామంటున్న జనసేన నేతలు
3:43 PM, April 3rd 2024
చంద్రబాబు దొంగ నాటకాలు: మాజీ మంత్రి పేర్ని నాని
- చంద్రబాబు ఏనాడూ సచివాలయం గుమ్మం తొక్కలేదు
- ఒకటో తేదీనే పెన్షన్లు ఇచ్చిన ఘన చరిత్ర సీఎం జగన్ ది
- చంద్రబాబు దొంగ నాటకాలు ఆడుతున్నారు
- చంద్రబాబుకు పేదలపై ప్రేమ ఇప్పుడొచ్చిందా ?
- రైతు రుణమాఫీ చేస్తామని మీరు అప్పుడు ఎగ్గొట్టారు
- 2019 ఎన్నికల సమయంలో రైతుకు జన్మభూమి కమిటీ ద్వారా డబ్బులు పంచుతున్నా మేం అడ్డుకోలేదు
- జన్మభూమి కమిటీల ద్వారా టీడీపీ కార్యకర్తలకు పంచుకున్నారు
- పసుపు కుంకుమ పేరుతో డబ్బులు వేసినా ఆపాలని మేం ఈసీకి ఫిర్యాదు చేయలేదు
- ఈసీ దగ్గర పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు
- సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయాలని ఇప్పుడు చెబుతున్నారు
- నిన్నటిదాకా ఏం మాట్లాడారు ? .. ఇప్పుడేమంటారు ?
- మేం ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఇన్నాళ్లు ఆరోపించారు
- లక్షా 60 వేల మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారని మీరు ఇప్పుడు చెబుతున్నారు
- మరి ఈ సచివాలయ ఉద్యోగులంతా ఎక్కడి నుంచి వచ్చారు ?
- ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్న పాపపు నోళ్లతోనే లక్షా 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పాల్సి వచ్చింది
- జగన్ సీఎం అయ్యాక 2 లక్షల మందికి పైగా ఉద్యోగాలిచ్చారు
- జగన్ ప్రభుత్వంలోనే యువతకు లంచాలు లేకుండా ఉద్యోగాలు వచ్చాయి
- చంద్రబాబు సిగ్గు లేకుండా జగన్ ప్రభుత్వం పై నిందలు వేస్తున్నారు
- ఐదేళ్ల పరిపాలన చూసి ఓటేస్తారా లేక చివరి 2 నెలలు పెన్షన్లు ఎవరిచ్చారో చూసి ఓటేస్తారా ?
- చంద్రబాబు కూడా 40 వేల కోట్లు ఇచ్చారు
- మరి అప్పుడు జనం ఎందుకు ఓటేయలేదు ?
- పసుపు కుంకుమ, రైతు నేస్తం అంటూ చంద్రబాబు ఎర వేసినా జనం నమ్మలేదు
- పెన్షన్లు ఆపాలన్న దౌర్భాగ్యపు ఆలోచన ఎవరికి వచ్చింది ?
- ముసలివారి ఉసురు మీకు తగలదా ?
- వాలంటీర్లు ఇంటికెళ్లి పెన్షన్ ఇస్తే మాకు ఓటేస్తారా ?
- 50 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే నీకు ఇంటికెళ్లి పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా ?
- 58 నెలలు ఇంటికి వెళ్లి పెన్షన్లు అందించాం
- 2 నెలలు పెన్షన్లు ఆపినంత మాత్రాన లబ్దిదారులకు జగన్ పై ప్రేమ తగ్గిపోతుందా ?
- వాలంటీర్ల వ్యవస్థ పై విషం కక్కారు
- వాలంటీర్ల వ్యవస్థ దుర్మార్గమైనదైతే ప్రజలే మమ్మల్ని ఓడిస్తారు కదా ?
- నిన్నటిదాకా మీరు మాట్లాడిన ప్రతిమాటా విషపు మాటే
3:13 PM, April 3rd 2024
పెన్షనర్ల పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ
- పెన్షన్లను వాలంటీర్లు పంపిణీ చేయొద్దన్న ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ పిటిషన్
- పెన్షనర్ల పిటిషన్‌ను డిస్మిస్ చేసిన ఏపీ హైకోర్టు
- ఈసీ చర్యలపై అడిగి తెలుసుకున్న ఏపీ హైకోర్టు
- ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని హైకోర్టుకు తెలిపిన ఏపీ సీఎస్
2:00 PM, April 3rd 2024
టీడీపీకి వెల్లంపల్లి శ్రీనివాస్ కౌంటర్
- కండ్రిక 64 డివిజన్ వైఎస్సార్‌సీపీకి కంచుకోట.
- రూరల్ ప్రాంతమైనా సరే అభివృద్ధి విషయంలో ముందే ఉంది.
- డివిజన్‌లోని చిన్న చిన్న సమస్యలపై శాశ్వత పరిష్కారానికి కృషి.
- దుర్మార్గుడు చంద్రబాబు చేసిన పనికి అవ్వతాతలు, దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు.
- రాష్ట్రంలో పెన్షన్‌దారుల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది.
- సంక్షేమానికే సీఎం జగన్ ప్రత్యేక ప్రాధాన్యత.
- చంద్రబాబు పరాకాష్టానికి రోజులు దగ్గరపడ్డాయి.
- రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ఆర్థికంగా బలపరిచింది సీఎం జగనే.
- చంద్రబాబు చేసిన దిక్కుమాలిన పనికి రాష్ట్రంలో ఉన్న పెన్షన్‌దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాకు బుద్దే లేదు.
- వాలంటీర్లను దూరంగా పెట్టాలని ఎలక్షన్ కమిషన్‌కు టీడీపీ నేతలే ఫిర్యాదు చేశారు.
- మళ్లీ ఎందుకు బోండా ఉమా ఈ నాటకాలు ఆడుతున్నాడు.
- తాగుబోతు బోండా ఉమా ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియదు.
- బోండా ఉమా గజినీలా తయారయ్యాడు. రాత్రి చెప్పినవి పొద్దునకి మర్చిపోతున్నాడు.
- సెంటర్లో బోండా ఉమాకు ఓటమి ఖాయమని తెలుసు.
1:40 PM, April 3rd 2024
టీడీపీ అభ్యర్థికి నిరసన సెగ..
- కూనవరం మండలంలో రంపచోడవరం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థికి నిరసన సెగ.
- మిరియాల శిరీష భర్త మఠం భాస్కర్‌పై అనేక అవినీతి అభియోగాలున్నాయని టీడీపీ వర్గాల ఆరోపణ.
- వంతల రాజేశ్వరికి కాకుండా, కనీసం పార్టీలో సభ్యత్వం కూడా లేని మిరియాల శిరీషకు టికెట్ ప్రకటించడంపై అసంతృప్తి.
- ఈ క్రమంలో చంద్రబాబుపై టీడీపీ శ్రేణులు సీరియస్
- రంపచోడవరం ఎమ్మెల్యే స్థానం పట్ల పునరాలోచించాలని, లేదంటే తాము సహకరించబోమని హెచ్చరిక.
1:15 PM, April 3rd 2024
పవన్ తెనాలి పర్యటన రద్దు..
- పవన్ ఆరోగ్యం సరిగా లేనందున్న తెనాలి పర్యటన రద్దు చేసుకున్నారన్న లోకం మాధవి
- తెనాలిలో నిర్వహించాల్సి ఉన్న రోడ్ షో, బహిరంగ సభ రద్దు
- రేపు నెలిమర్లలో నిర్వహించాల్సి ఉన్న వారాహి బహిరంగ సభ వాయిదా
- పవన్ ఆరోగ్యం సరిగా లేనందున రేపటి నెలిమర్ల సభ వాయిదా
- నెల్లిమర్ల వారాహి సభ కొత్త తేదీ మళ్లీ ప్రకలిస్తామన్న మాధవి.
12:45 PM, April 3rd 2024
పేదల పాపం చంద్రబాబుకు తగులుతుంది: కేశినేని నాని ఫైర్
- సీఎం జగన్ చలువతో వాలంటీర్లు ఇంటికే వెళ్లి పెన్షన్లు ఇచ్చేవారు
- చంద్రబాబు వాలంటీర్లపై మొదటి నుంచీ విషం కక్కుతున్నాడు
- పేదల పాలిట.. ఈ రాష్ట్రం పాలిట శాపం చంద్రబాబు
- మండుటెండలో వృద్ధులను ఇబ్బంది పడేలా చేశాడు
- వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయించాలని చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు
- పేదలు, పెన్షన్‌దారులపై చంద్రబాబు తన కక్ష తీర్చుకుంటున్నాడు
- పేదలు, వృద్ధుల శాపం కచ్చితంగా చంద్రబాబుకి తగులుతుంది
12:20 PM, April 3rd 2024
వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు..
- కాకినాడలో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు
- 84 సచివాలయాల పరిధిలో పని చేస్తున్న 500 మంది రాజీనామా
- గతంలో చంద్రబాబు, పవన్ కళ్యణ్ వ్యాఖ్యలపై మనస్ధాపం
- మా వ్యక్తిగత పనుల కోసం బయటకు వచ్చినా.. ఎందుకు వచ్చారు అనే ప్రశ్నలతో అవమానాలు ఎదుర్కోంటున్న వాలంటీర్లు.
- దీంతో ముకుమ్మడిగా రాజీనామాలను మున్సిపల్ అధికారులకు అందజేసిన వాలంటీర్లు.
12:00 PM, April 3rd 2024
చంద్రబాబుపై ఎంపీ భరత్ ఫైర్
- రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక్కసారి అందరు గమనించండి.
- అవ్వాతాతలను, దివ్యంగులను లైన్లో మళ్ళీ నుంచోబెట్టిన పెట్టిన వ్యక్తి చంద్రబాబు
- ఒకవైపు వాలంటీర్లపై ఫిర్యాదు చేసి మళ్ళీ ఇళ్ళ వద్దకే పెన్షన్లు తీసుకువెళ్లాలని అధికారులను చంద్రబాబు ఎలా కోరుతున్నారు
- వాలంటీర్లు లేకుండా ఇళ్ల వద్దకు పెన్షన్ ఇవ్వడం ఎలా సాధ్యమవుతుంది చంద్రబాబు
- లోకేష్‌కు చంద్రబాబుకు చెప్పి పెన్షన్లు వాలంటీర్లతో ఇవ్వకుండా అడ్డుకున్నది తానేనని ఆదిరెడ్డి వాసు చెప్పుకోవడం దారుణం
- ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి అవ్వాతాతలకు పెన్షన్ అడ్డుకున్నామని తెలుగుదేశం నాయకులు కాలర్ ఎగరేసి చెబుతున్నారు
- టీడీపీ నాయకుల దుర్మార్గాలను ప్రజలు గమనిస్తున్నారు
- వాలంటీర్లు కాకుండా ఎవరు ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేస్తారో చంద్రబాబు చెప్పాలి.
- చంద్రబాబు ఇప్పటికైనా మీ కడుపు మంట చల్లారిందా?.
11:30 AM, April 3rd 2024
షర్మిలకు ఎమ్మెల్యే రాచమల్లు కౌంటర్
- పీసీసీ చీఫ్ షర్మిల తన స్దాయికి మించిన మాటలు మాట్లాడుతున్నారు
- ఆమె సంబంధంలేని మాటలు మాట్లాడుతున్నారు
- తెలంగాణ ఆడబిడ్డగా ఏపీకి సంబంధించి మాట్లాడటం విడ్డూరం
- షర్మిల కామెంట్స్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలే
- వైఎస్సార్ పేరును కాంగ్రెస్ ఎఫ్ఐఆర్‌లో నమోదు చేసింది
- అదే విషయాన్ని నీవు విమర్శించావు
- కాంగ్రెస్‌కు జీ హూజూర్ అన్నప్పుడే నీవు నైతికంగా చనిపోయావు
- నిందితుడు అవినాష్‌కు టికెట్ అన్నావు
- ఆ మాట అనే అధికారం ఆమెకు ఎవరిచ్చారు
- నిర్దారణ చేయాల్సింది న్యాయస్దానం, ప్రజాస్థానం.
- రేపు ఎన్నికల్లో ఇచ్చే తీర్పు రెఫరెండంగా భావిస్తావా?.
- అలా అనుకుంటే మేము సంసిద్దం.
- కోర్టు తీర్పు ఇచ్చినా మేము సిద్దమే.
- ఇవన్నీ జరిగితే మీరు ముక్కున వేలేసుకుంటారా?
- రేపు ఎన్నికల తరువాత అవినాష్ అందరి ప్రసంశలు అందుకుబోతున్నారు.
- ఇప్పుడు అందరి చెవ్వుల్లో పూలు పెడుతున్నారా?.
- నేను తెలంగాణా బిడ్డను అన్నావు.. ఇక్కడే చదివా.. పెళ్లి చేసుకున్నా.. పాడేరు మట్టి కోసం బ్రతుకుతానన్నావు.
- క్యాలెండర్‌లో ఒక పేజీ మారేలోపు మాట మార్చి రాష్టం మార్చావు.. జెండా మార్చావు.
- కుట్ర పూరిత ఆలోచనలకు పావయ్యావు
- నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావో అందరికీ తెలుసు.
- వైఎస్సార్ కుమార్తెగా నిన్ను గౌరవిస్తాం
- కానీ, మాటకు మాట.. చర్యకు ప్రతి చర్య తప్పక మావైపు నుంచి ఉంటుంది
11:20 AM, April 3rd 2024
మచిలీపట్నంలో టీడీపీకి షాక్
- టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరిన సీనియర్ నాయకులు, 20 టీడీపీ కుటుంబాలు
- ఎమ్మెల్యే పేర్ని నాని , మచిలీపట్నం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి పేర్ని కిట్టు ఆధ్వర్యంలో పార్టీలో చేరిక
- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి పేర్ని నాని, పేర్ని కిట్టు
11:00 AM, April 3rd 2024
వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్.. రాజ్యసభలో టీడీపీ జీరో..
- రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతైంది.
- టీడీపీ ఏకైన రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ పదవీ కాలం ముగిసింది.
- రాజ్యసభలో టీడీపీ జీరో అయ్యింది.
- టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా రాజ్యసభలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది.
- రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా వైఎస్సార్‌సీపీ అవతరించింది.
- రాజ్యసభలో బీజేపీ (97), కాంగ్రెస్(29), టీఎంసీ (13) తర్వాత స్థానం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదే.
- ఏపీలోని 11 రాజ్యసభ సీట్లకు గాను 11 సీట్లను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది.
- రాజ్యసభ సీట్లలో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ విజయం సాధించింది.
- నేటి నుంచి అధికారికంగా ఏపీ నుంచి రాజ్యసభలో వైఎస్ఆర్‌సీపీకి సంపూర్ణ ప్రాతినిధ్యం ఉంటుంది.
- రేపు రాజ్యసభ సభ్యులుగా నూతన ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
10:30 AM, April 3rd 2024
వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేత
- సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేత హరికృష్ణ
- మాజీ మంత్రి కుతూహలమ్మ కుమారుడు హరికృష్ణ.
- 2019లో టీడీపీ తరపున గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన హరికృష్ణ
- అమ్మగారిపల్లె స్టే పాయింట్ వద్ద వైఎస్సార్‌సీపీలో చేరిక.
9:30 AM, April 3rd 2024
ఏడో రోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా..
Memantha Siddham Yatra, Day -7.
— YSR Congress Party (@YSRCParty) April 3, 2024
ఉదయం 9 గంటలకు అమ్మగారిపల్లె దగ్గర నుంచి ప్రారంభం
సాయంత్రం 3 గంటలకు పూతలపట్టు బైపాస్ రోడ్డులో బహిరంగ సభ
సభ అనంతరం రేణిగుంట మీదుగా గురవరాజుపల్లె వరకు కొనసాగుతుంది.
గురువరాజుపల్లె వద్ద రాత్రి బస #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/qw7x7QFOCM
8:30 AM, April 3rd 2024
పేదలపై పచ్చ బ్యాచ్ పంతం..
- ఐదేళ్లుగా ఇంటి వద్దే అందుతున్న సంక్షేమ పథకాలపై పెత్తందారుల అక్కసు
- వలంటీర్ వ్యవస్థపై తొలి నుంచి విషం కక్కిన చంద్రబాబు, పవన్‌కళ్యాణ్
- గోనె సంచులు మోసే ఉద్యోగాలంటూ తూలనాడిన చంద్రబాబు
- ఇంట్లో మగాళ్లు లేనప్పుడు తలుపులు తడుతున్నారంటూ నీచమైన వ్యాఖ్యలు
- వలంటీర్లు సంఘ విద్రోహ శక్తులంటూ పవన్ విద్వేష ప్రసంగాలు
- తాము అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామంటూ హూంకరింపులు
- ఎన్నికల వేళ కుట్రపూరితంగా వలంటీర్ల సేవలను అడ్డుకున్న వైనం
- లక్షలాది మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులపై తీవ్ర ప్రభావం
- ప్రజా వ్యతిరేకతతో ఎప్పటిలాగే బాబు యూటర్న్ డ్రామాలు
- ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయాలంటూ మొసలి కన్నీళ్లు
8:00 AM, April 3rd 2024
టీడీపీకి షాక్..
- గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో టీడీపీకి షాక్..
- టీడీపీ వీడి వైసిపిలో చేరిన 15 కుటుంబాలు..
- పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాస్..
7:32 AM, April 3rd 2024
దొరికిన దొంగ చంద్రబాబు..
- పెన్షన్లపై చంద్రబాబు చిల్లర రాజకీయం
- తామే ఈసీకి లేఖ రాసినట్టు ఒప్పుకున్న టీడీపీ నేత ఆదిరెడ్డి వాసు.
కోర్టులో కేసు వేసి, వాలంటీర్ల సేవలను అడ్డుకుని, అవ్వాతాతలకి పెన్షన్ ఇవ్వనీయకుండా చేసింది టీడీపీనే అని నిజం ఒప్పుకున్న టీడీపీ నేత ఆదిరెడ్డి వాసు.
— YSR Congress Party (@YSRCParty) April 2, 2024
ఇంత చిల్లర రాజకీయాలు దేనికి @ncbn?#TDPAgainstVolunteers #TDPAntiPoor#EndOfTDP pic.twitter.com/6DqinBjtol
7:15 AM, April 3rd 2024
చంద్రబాబు డ్రామాలపై సీఎం జగన్ సీరియస్
- చంద్రబాబు డ్రామాలు.. దిగజారుడుతనంపై ప్రజలు ఆలోచన చేయాలి.
- 2014లో చంద్రబాబు సంతకం చేసి ఇంటింటికీ పంపిన మేనిఫెస్టోలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు.
- కానీ ఇప్పుడు మరోసారి మోసం చేసేందుకు రంగురంగుల మేనిఫెస్టోతో దత్తపుత్రుడు, మోదీ గారితో కలిసి చంద్రబాబు మరో డ్రామాకి తెరదీస్తున్నాడు.
- లక్షల మంది అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులకి ప్రతి నెలా ఒకటో తారీఖున చేతికి పెన్షన్ వచ్చేది.
- పెన్షన్లు ఇచ్చే వలంటీర్లు.. ఏప్రిల్ 1 నుంచి ఇవ్వ డానికి వీల్లేదని చంద్రబాబు ఆయన మనుషుల చేత ఈసీకి ఫిర్యాదు చేయించి ఆదేశాలిప్పించాడు.
- చంద్రబాబు ఏ స్థాయికి దిగజారిపోయాడో ఆలోచించండి.
లక్షల మంది అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులకి ప్రతి నెలా ఒకటో తారీఖున చేతికి పెన్షన్ ఇచ్చే వాలంటీర్లు.. ఏప్రిల్ 1 నుంచి ఇవ్వడానికి వీళ్లేదని చంద్రబాబు తన మనుషుల చేత ఈసీకి ఫిర్యాదు చేయించి ఆదేశాలిప్పించాడు. చంద్రబాబు ఏ స్థాయికి దిగజారిపోయాడో ఆలోచించండి!#MemanthaSiddham… pic.twitter.com/hlDNmzyupI
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 2, 2024
7:05 AM, April 3rd 2024
టీడీపీ రెడీ చేసిన చీరలు స్వాధీనం..
- పామర్రు (మ) పెరిశేపల్లిలో ఓ ఇంట్లో భారీ మొత్తంలో చీరలు స్వాధీనం
- ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు చీరలను సిద్ధం చేసిన టీడీపీ
- రమణ అనే వ్యక్తి ఇంట్లో చీరల బస్తాలను గుర్తించిన పోలీసులు
- పక్కా సమాచారంతో ఎస్.ఎస్.టీమ్ తో కలిసి తనిఖీలు చేపట్టిన పోలీసులు
- సుమారు 10 లక్షల విలువైన చీరలు స్వాధీనం
- డీఎస్పీ శ్రీకాంత్ కామెంట్స్
- ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు పెద్ద మొత్తంలో గిప్ట్ లు తెచ్చినట్లు సమాచారం వచ్చింది
- మాకు అందిన సమాచారం మేరకు ఎస్ ఎస్ టీమ్ తో తనిఖీలు నిర్వహించాం
- మావద్ద ఉన్న ఆధారాలతో రమణ, గణేష్ అనే వ్యక్తులను విచారించాం
- ఎలక్షన్లలో పంపిణీ చేసేందుకు టీడీపీ పార్టీ వారు తెప్పించినట్లు నిర్ధారణ అయ్యింది
- సుమారు 10 లక్షల విలువ ఉంటుందని ప్రాథమిక అంచనా వేస్తున్నాం
- విజయవాడలో బుక్ చేసి పంపిణీ కోసం పామర్రు తెచ్చినట్లు గుర్తించాం
6:50 AM, April 3rd 2024
వైజాగ్ ఎంపీ సీటుపై కూటమిలో కుంపటి
- బీజేపికి కేటాయించాలని కమలంలో ఊపందుకున్న డిమాండ్
- వివిధ మోర్చాల ఆధ్వర్యంలో కీలక సమావేశం
- గతంలో గెలిచిన సీటును పొత్తుల పేరుతో వదలడం బీజేపీకి నష్టం చేయడమేనంటున్న నేతలు
- పొత్తులో భాగంగా టీడీపీకి వెళ్ళిన వైజాగ్ ఎంపీ టిక్కెట్
- టిడిపి ఎంపీ అభ్యర్థిగా ప్రచారం ప్రారంభించిన బాలయ్య చిన్నల్లుడు భరత్
- టీడీపీకి సీటు కేటాయిస్తే ఓటింగ్‌కు దూరం అవుతామని తేల్చేసిన నార్త్ ఇండియన్ సంఘాలు
- అనపర్తి, నర్సాపురం వంటి చోట మార్పులు జరుగుతున్నప్పుడు వైజాగ్ ఎందుకు మార్చరని డిమాండ్
6:40 AM, April 3rd 2024
అవనిగడ్డ జనసేనలో కుంపట్లు
- అవనిగడ్డ సీట్ బుద్ధ ప్రసాద్‌కు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న శ్రీనివాస్ వర్గీయులు
- జనసేన పిల్లల పార్టీ అన్న బుద్ధప్రసాద్‌కి సీట్ ఎలా ఇస్తారంటున్న ఆ పార్టీ నేతలు
- ఇవాళ అవనిగడ్డలో జనసేన నేత విక్కుర్తి శ్రీనివాస్ ఆత్మీయ సమావేశం
- చివరి నిమిషంలో తన సీట్ మార్చారంటున్న శ్రీనివాస్
- డబ్బులకు సీట్లు అమ్ముకున్నారని ఆరోపించిన బుద్ధప్రసాద్‌కి సీట్ ఇస్తారా?
- జనసేనలో చేర్చుకుని మరీ సీట్ ఇవ్వాల్సిన అవసరం ఏముందంటున్న నేతలు
6:30 AM, April 3rd 2024
వాలంటీర్ల వ్యవస్థను ధ్వంసం చేసేలాగ చంద్రబాబు వ్యవహరిస్తున్నారు: మంత్రి మేరుగ నాగార్జున
- పెన్షన్లను పంపిణీ చేయకుండా వృద్దులు, వికలాంగులను తీవ్రంగా ఇబ్బందులు పెట్టారు
- పేదలకు సహాయం చేయనీయకుండా చేశారు
- బీసీలు జడ్జీలుగా పనికిరారని విమర్శలు చేశారు
- ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని చంద్రబాబు అన్నారు
- టిప్పర్ డ్రైవర్‌లకు సీటు ఇవ్వటం ఏంటని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు
- చంద్రబాబుకు డ్రైవర్లంటే ఎందుకు అంత కక్ష?
- ఇంత బరితెగింపు రాజకీయాల్లో ఎప్పుడూ చూడలేదు
- చంద్రబాబు, ఆయన కూటమికి డ్రైవర్లు తగిన బుద్ది చెప్తారు
- పెన్షన్లను ఆపటానికి చంద్రబాబే కారణం
- కరోనా సమయంలో చంద్రబాబు హైదరాబాదు పారిపోయారు
- కానీ వాలంటీర్లే దగ్గరుండి పేదలకు సేవలు చేశారు
- అలాంటి వారిని మెచ్చుకోకపోగా కక్ష సాధించటమేంటి?
- ఇలాంటి చంద్రబాబుకు ఎవరు ఓటేస్తారు?
- చంద్రబాబు బతుకు చెడ
- జగన్ ని బడుగు, బలహీన వర్గాలు అండగా నిలుస్తాయి
- పవన్ కళ్యాణ్ మాటలు పట్టించుకోవాల్సిన పని లేదు
Comments
Please login to add a commentAdd a comment