
AP Elections Political Latest Updates Telugu
5:57PM, Jan 21, 2024
రాష్ట్ర అభివృద్ధి గురించి షర్మిలకేమి తెలుసు?: వైవీ సుబ్బారెడ్డి
- షర్మిల రాష్ట్రానికి తొలిసారి వచ్చారు
- రాష్ట్ర అభివృద్ధి గురించి ఆమెకేమి తెలుసు
- ఆమె మాతో వస్తే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూపిస్తాము
- వైయస్సార్ పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చిన కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరారు
- ఆయన కుమారుడిని 16 నెలలు అన్యాయంగా జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీలో చేరారు
- వైయస్సార్ కు నిజమైన వారసులు ఎవరో ప్రజలే నిర్ణయిస్తారు
- మొన్నటివరకు తెలంగాణ బిడ్డగా అక్కడ తిరిగారు
- ఆమె అక్కడ ఎందుకు పోటీ చేయలేదు తెలియదు.
- షర్మిల కాదు ఎవరు వచ్చినా మా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టలేదు
- రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని ఇబ్బందుల్లో పెట్టింది సోనియాగాంధీ
- పక్క రాష్ట్రం నుండి వచ్చి ఇక్కడ అభివృద్ధి జరగలేదంటే ఎలా?
- ఢిల్లీ కాంగ్రెస్‌లో చేరి మమ్మల్ని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ సమీక్షించుకోవాలి
- అవినీతికి పాల్పడ్డ చంద్రబాబును షర్మిల ప్రశ్నించాలి
- మేము ఎప్పుడు కూడా బీజేపీతో కాంప్రమైజ్ కాలేదు
- ఈనెల 27వ తేదీన భీమిలిలో ఎన్నికల శంఖారావాన్ని సీఎం జగన్ పూరిస్తున్నారు
- రెండు లక్షల మంది 34 నియోజకవర్గాల నుండి హాజరవుతున్నారు
5:05PM, Jan 21, 2024
వైఎస్సార్ ఆశయాలకు సీఎం జగన్ కట్టుబడి పనిచేస్తున్నారు: సజ్జల రామకృష్ణారెడ్డి
- వైఎస్సార్ ఆలోచనలకు అనుగుణంగా జగన్ పనిచేస్తున్నారు
- కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి, వైఎస్సార్ కుటుంబానికి అన్యాయం చేసింది
- వైఎస్ జగన్‌పై కాంగ్రెస్ అక్రమ కేసులు పెట్టింది
- వైఎస్ జగన్‌పై పెట్టినవి అక్రమ కేసులని గులాం నబీ ఆజాదే చెప్పారు
- వైఎస్సార్ పేరును కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు
- వైఎస్ మరణానంతరం ఆయన కుటుంబ సభ్యులను కాంగ్రెస్ ఇబ్బందులకు గురి చేసింది
- షర్మిల నిన్నటి వరకు తెలంగాణలో ఏం చేశారు?
- షర్మిల.. తెలంగాణ నుంచి హఠాత్తుగా ఏపీకి ఎందుకొచ్చారు?
- రాష్ట్రంలో ఉనికిలేని పార్టీ కాంగ్రెస్
- షర్మిల వాడిన భాష బాగోలేదు
- కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలకు ఏం తెలుసు?
- గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి
- ఆ పార్టీ తరఫున షర్మిల ఇక్కడకు వచ్చి ఏం చేస్తారు?
- చంద్రబాబును ఎలా సీఎం చేయాలన్నదే షర్మిల లక్ష్యంగా కనిపిస్తోంది
- చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసింది
- తెలంగాణలో పోటీ చేస్తానన్న షర్మిల ఎందుకు వెనకడుగు వేశారు?
- ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ పోరాడుతూనే ఉంది
- చంద్రబాబుకు చివరి అస్త్రం షర్మిలనే
- చంద్రబాబు ప్రతీరోజూ చేసే విమర్శలే ఇప్పుడు షర్మిల చేస్తుంది
- వైఎస్ అభిమానుల ఓట్లు చీలితే కొద్దిగా కలిసి వస్తుందనే ఆశతో చంద్రబాబు ఉన్నారు
- ఏపీలో ఎవరికి ఆయుధంలా ఉపయోగపడాలని వచ్చారో అందరికీ తెలుసు
- ఇదంతా చంద్రబాబు ఎత్తుగడే
- అందుకే ఆ వర్గం మీడియా షర్మిలను భుజానికి ఎత్తుకుంది
- వైఎస్సార్ వారసుడిగా ప్రజల హృదయాల్లో జగన్ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు
- రాష్ట్రంలో ఏ వర్గానికి అన్యాయం జరిగినా వైఎస్ జగన్ సహించరు
- రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వైఎస్ జగన్ రాజీపడరు
- ప్రత్యేక హోదాని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చట్టంలో చేర్చలేదు?
- షర్మిల కచ్చితంగా వివరణ ఇవ్వాల్సిందే
- వైఎస్సార్ తనయురాలిగా, వైఎస్ జగన్ చెల్లెలిగా షర్మిలను అభిమానిస్తాం
04:40PM, Jan 21, 2024
సీటు వచ్చినా రాకపోయినా అభ్యర్ధి గెలుపు కోసం పనిచేయాలి: నాదెండ్ల మనోహర్
- నెలాఖరు నుంచి ఏపీలో పవన్ పర్యటన ఉంటుంది
- ఫిబ్రవరి మొదటి నుంచి క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల పవన్ సమావేశాలు పెడతారు
- ప్రతి రోజూ పవన్ మూడు సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ సిద్ధమవుతోంది
- పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుంది
- ఎన్నికల నిర్వహణ కోసం జోనల్ కమిటీని 191 మందితో ఏర్పాటు చేశాం
04:01PM, Jan 21, 2024
మహానేత వైఎస్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన ఘనత కాంగ్రెస్‌ది: మంత్రి ఉషాశ్రీ చరణ్
- ఏపీని విడగొట్టి అధోగతి పాలు చేసిన ఘనత కూడా కాంగ్రెస్‌దే
- వైఎస్ జగన్‌ను విమర్శించే అర్హత షర్మిలకు లేదు
- షర్మిల వల్ల వైఎస్సార్‌సీపీకి ఎలాంటి నష్టం లేదు
- వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్‌సీపీనే గెలుస్తుంది
03:50PM, Jan 21, 2024
మండపేటలో చంద్రబాబు సభ పూర్తిగా విఫలమయింది: ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
- ప్రజలకు చంద్రబాబు అవాస్థవాలు చెప్పే ప్రయత్నం చేశారు
- ఇళ్ల స్థలాల గురించి మాట్లాడిన చంద్రబాబు గతంలో ఒక సెంటు భూమి చంద్రబాబు ఏనాడైనా కొనిచ్చారా?
- ఇవాళ సీఎం జగన్ 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు .. ఇళ్ళు కట్టించుకునే ఏర్పాటు చేశారు
02:45 PM, Jan 21, 2024
చంద్రబాబు పాలనలో అంతా దోచుకోవడమే: ఆళ్ల నాని
- సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చారు.
- చంద్రబాబు పాలనలో అంతా దోచుకోవడమే.
- గత ప్రభుత్వంలో బడుగుబలహీన వర్గాలకు ప్రాధాన్యత లేదు.
- చంద్రబాబు, పవన్.. సీఎం జగన్‌ను ఏమీ చేయలేరు.
02:30 PM, Jan 21, 2024
చంద్రబాబు గిరిజన ద్రోహి: ఎమ్మెల్సీ కుంభా రవిబాబు
- చంద్రబాబు ఏనాడూ గిరిజనుల గురించి ఆలోచన చేయలేదన్నారు.
- గిరిజనుల పేరెత్తే అర్హత చంద్రబాబుకు లేదు.
- చంద్రబాబు అసత్య ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్.
- చెప్పిందే చెప్పి అదే నిజమని నమ్మించాలని చూస్తున్నాడు.
- గిరిజన ఎమ్మెల్యేపై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి.
- చంద్రబాబు ఏనాడూ గిరిజనుల గురించి ఆలోచన చేయలేదు.
- 14 ఏళ్లు సీఎంగా బాబు గిరిజనుల కోసం ఏం చేశాడు?.
- గిరిజన కార్పొరేషన్ వేయాలన్న ఆలోచన కూడా ఆయనకు రాలేదు.
- చంద్రబాబు.. గిరిజన శాఖకు మంత్రిని ఎందుకు పెట్టలేకపోయావ్?.
- గిరిజనులకు బుద్ధి లేదంటావా..
- గిరిజనుల పేరెత్తే అర్హత కూడా చంద్రబాబుకు లేదు.
- గిరిజనులకు సెంటు భూమి కూడా ఇవ్వలేదు.
- ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే గిరిజనులకు మేలు చేశారు.
- దేశంలో ఎవరూ చేయలేనంత సంక్షేమం గిరిజనులకు సీఎం జగన్ వల్లే అందింది.
- చంద్రబాబు ఒక్క ఎకరమైనా పోడు భూమి పట్టా ఇవ్వగలిగారా ?.
- అధికారంలోకి రాగానే సీఎం జగన్ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారు.
- రూల్ ఆఫ్ రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేశారు.
- ట్రైబల్ యూనివర్శిటీ, మెడికల్ కాలేజీ ఏర్పాటు ఎవరికీ రాని ఆలోచన.
- గిరిజనుల జీవితాలు మెరుగవ్వాలని ఆలోచన చేసిన వ్యక్తి సీఎం జగన్.
- పాడేరులో మెడికల్ కాలేజీతో పాటు మెడికల్ రీసెర్చ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్‌దే.
- చంద్రబాబు చేతకాని తనాన్ని ప్రజలు తెలుసుకున్నారు.
- పోలవరం ఆర్ఆర్ ప్యాకేజీలో గిరిజనులకు అన్యాయం చేసింది చంద్రబాబే.
- తనకు సంబంధించిన కాంట్రాక్టర్లకు చంద్రబాబు మేలు చేశాడు.
- జీవో నంబర్-97ను తెచ్చింది చంద్రబాబే.
- గిరిజన ప్రాంతాల్లో గతంలో ఎన్నడూ లేనంతగా రోడ్లు, కమ్యూనికేషన్ అభివృద్ధి చెందుతోంది.
- రాబోయే ఎన్నికల్లో మేమంతా ముఖ్యమంత్రి జగన్‌కు అండగా ఉంటాం.
- ఏడు అసెంబ్లీ స్థానాలను, పార్లమెంట్ స్థానాన్ని గెలిచి సీఎం జగన్‌కు కానుకగా ఇస్తాం.
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంపదనంతా హైదరాబాద్‌లో పెట్టారు.
- ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో కోల్పోయారు.
- ఇలాంటి పరిస్థితి మళ్లీ పునరావృత్తం కాకూడదు.
- పరిపాలనా వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యం.
02:00 PM, Jan 21, 2024
షర్మిల కాన్వాయ్ ర్యాలీపై స్పందించిన విజయవాడ సీపీ
- షర్మిళ కాన్వాయ్ ర్యాలీపై స్పందించిన విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా
- కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కాన్వాయ్ కి ఎలాంటి ఆటకం కలగలేదు
- ట్రాఫిక్ క్లియర్ చేయడం కోసం ముందు వాహనాలు పంపడం జరిగింది
- అంతేగానీ ఉద్ధేశ పూర్వకంగా కాన్వాయ్ ను పోలీసులు ఆపారనడంలో అర్థం లేదు
01:57 PM, Jan 21, 2024
టీడీపీ రౌడీయిజానికి భయపడం: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
- ప్రతి ఒక్కరూ సీఎం జగన్ వైపు ఉన్నారు
- మల్లాది విష్ణు, కార్పొరేటర్లతో కలిసి సెంట్రల్ నియోజకవర్గంలో 25 వేల మెజార్టీ తెస్తాం
- ఎమ్మెల్యే మల్లాది విష్ణు సూచనల మేరకే కార్యక్రమం ఏర్పాటు
- మల్లాది విష్ణు.. నేను కలిసే పని చేస్తున్నాం
- విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సీఎం జగన్ అడ్డా
- బోండా ఉమ, తెలుగుదేశం పార్టీ రౌడీయిజానికి భయపడే పరిస్థితి లేదు
- సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ గెలుపే మా అజెండా
- సెంట్రల్ నియోజకవర్గానికి వంగవీటి రాధానా? బోండా ఉమానా? తేల్చుకోవాలి
01:50 PM, Jan 21, 2024
ఏలూరు పార్లమెంట్‌లో మొత్తం సీట్లు గెలవబోతున్నాం: అబ్బయ్య చౌదరి
- కారుమూరి సునీల్ ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తాం
- జగన్ చొరవ వల్లే ప్రతి పేదవాడికి వైద్యం అందుతుంది
- సీఎం జగన్ విద్యా వ్యవస్థ రూపురేఖలు మార్చారు
01:31 PM, Jan 21, 2024
సీఎం జగన్‌ను ఎదుర్కొనే దమ్ము ప్రతిపక్షాలకు లేదు: మంత్రి జోగి రమేష్
- సీఎం జగన్ పాలనలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు
- ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు
- ప్రజల దీవెనలు సీఎంకి ఉన్నాయి
- సీఎం జగన్‌ను ఎదుర్కొనే దమ్ము ప్రతిపక్షాలకు లేదు
- 175 స్థానాలు కైవసం చేసుకుంటాం
- ఎన్ని పార్టీలు గుంపులుగా వచ్చిన గెలిచేది మేమే
- పెనమలూరులో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేస్తాం
- గతంలో కంటే అధిక మెజారిటీతో గెలుస్తాం
12:40 PM, Jan 21, 2024
చంద్రబాబువి కల్లబొల్లి మాటలు: పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి
- అరకులో జరిగింది టీడీపీ మాయసభ
- 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారు?
- ప్రైవేట్ వ్యక్తులకు అరకు కాపీ తోటలను కట్టబెట్టారు
- బాబు హయాంలోనే గంజాయి వ్యాపారం జరిగింది
చంద్రబాబు ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా: ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ
- మన్యంలో అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?
- అరకును అభివృద్ధి చేస్తానని దత్తత పేరిట అంధకారంలోకి నెట్టారు
- చంద్రబాబు మోసపూరిత మాటలు గిరిజనులు నమ్మరు
12:34 PM, Jan 21, 2024
తిరుపతి: వైఎస్సార్‌సీపీ బస్సు యాత్ర
- నాయుడుపేటలో వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర
- మధ్యాహ్నం 3 గంటలకు విజయ గణపతి ఆలయం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ
- బస్టాండ్ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ భారీ బహిరంగ సభ
- హాజరుకానున్న రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, నారాయణ స్వామి, జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు
12:18 PM, Jan 21, 2024
ఏలూరు జిల్లా వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం
- సీఎం జగన్ ఇచ్చిన హామీలను 90 శాతం నెరవేర్చారు:మాజీ మంత్రి ఆళ్ల నాని
- చంద్రబాబు పాలనలో అంతా దోచుకోవటమే జరిగింది
- బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చిన దాఖలాలు లేవు
- ఎంతమంది పవన్ కల్యాణ్‌లు, చంద్రబాబులు వచ్చినా సీఎం జగన్‌ను ఏమీ చేయలేరు
సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపిన నాయకుడు సీఎం జగన్: ఎమ్మెల్యే వాసుబాబు
- సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపిన నాయకుడు సీఎం జగన్
- ఏలూరు పార్లమెంటు బీసీ సామాజిక వర్గానికి కేటాయించిన సీఎం జగన్‌కి ధన్యవాదాలు
- ఏలూరు పార్లమెంట్ మొత్తం క్లీన్ స్వీప్ చేసి సీఎం జగన్‌కు కానుక ఇవ్వాలి
- సీఎం జగన్ చేస్తున్న సంక్షేమంపై ఎల్లో మీడియా బురద చల్లుతుంది
- చంద్రబాబు గ్యారెంటీలంటూ రోడ్లపై తిరిగి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాడు
- చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక సంక్షేమ పథకమైనా ఉందా?
- చంద్రబాబు అబద్దాల మేడలు కడుతున్నాడు
- అమరావతి అనే అబద్దాన్ని మరోసారి ప్రజలకు బూచిగా చూపాలని చూస్తున్నాడు
- లక్షల కోట్లు ఒకే చోట పెట్టుబడి కన్నా మూడు రాజధానులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది
11:25 AM, Jan 21, 2024
రామోజీకి గోనె ప్రకాశ్‌రావు బహిరంగ లేఖ
- సమాజానికి మార్గదర్శకులు అని మీకు మీరే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవద్దు
- మీ నిత్య జీవితం లో విలువలు పాటిస్తున్నారా??
- ఇతరుల విషయాల్లో మీరు పాటించే సూత్రాలు మీ విషయం లో ఎందుకు పాటించరు?
- ఈ బహిరంగ లేఖ ద్వారా ప్రజల పక్షాన అడిగే ప్రశ్నలకు రామోజీ సమాధానం చెప్పాలి
- పదిహేను సంవత్సరాలుగా బలహీన వర్గాలకు చెందాల్సిన భూములు మీ అధీనం లో ఉన్నాయి
- నాగన్‌పల్లి గ్రామం లో సర్వే నెంబర్ 189, 203 కింద 14 ఎకరాల 30 గుంటల భూమిని దివంగత సీఎం వైఎస్సార్ 606 మంది బలహీన వర్గాలకు ఇండ్ల కోసం స్థలం కేటాయించారు
- మీ రాజకీయ పలుకుబడితో 15 ఏళ్లుగా పేదల భూమిని ఆక్రమించారు
- ప్రభుత్వ రహదారిని రామోజీ ఫిలిం సిటీ కింద ఆక్రమించారు
- అనాజ్ పూర్ నుండి ఇబ్రహీంపట్నం వరకు 13 కి.మీ ప్రభుత్వ రహదారి ఆక్రమించారు
- దాని వల్ల కోహెడ ఇబ్రహీంపట్నం వెళ్ళటానికి దూరం పెరిగి ప్రజలకు ఇబ్బంది అవుతుంది
- మీరు ప్రభుత్వ రహదారిని ఆక్రమించడం వల్ల 16 గ్రామాల్లోని 90 వేల మంది ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు
- ప్రజా రహదారిని కబ్జా చేయటాన్ని మీరెలా సమర్ధించుకుంటారు?
- మీరు ప్రజా రహదారులను కబ్జా చేయటం వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురి అవుతున్నారు
- ప్రభుత్వ రహదారులు మీ ఎస్టేట్ కాదు
- మీ సామ్రాజాన్ని సామాన్యులు చూడకూడదు అనుకుంటే భారీ ప్రహరీలు నిర్మించుకోండి
- అంతే కానీ అటువైపు ప్రజలు రాకూడదని ప్రభుత్వ రహదారులు ఆక్రమించటం ఏమిటి?
- రామోజీకి 2024 మార్చ్ 31 వరకు డెడ్ లైన్
- డెడ్ లైన్ లోపు ప్రభుత్వ భూములు తిరిగి ఇచ్చేయాలి
- మీ స్టూడియోలో పని చేసే వారిని ఉన్న పళంగా తీసేస్తారు
- వారికీ జీతాలు ఇవ్వరు, కార్మికుల చట్టాలు ఉల్లఘించారు
- రామోజీ పిరికివాడు, చావు అంటే భయం
- సీఎం రేవంత్ రెడ్డికి మెమోరాండం ఇస్తాను
- రామోజీ ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోండి
11:14 AM, Jan 21, 2024
గుంటూరు తూర్పుపై గందరగోళం
- సరైన అభ్యర్థి కోసం తెలుగుదేశం వెతుకులాట
- నియోజకవర్గం ఇన్‌చార్జి నసీర్ అహ్మద్‌కి సీట్ లేనట్లేనా
- ఇప్పటికే నూరి ఫాతిమాని ప్రకటించిన వైఎస్సార్‌సీపీ
- ఎన్నికలు దగ్గర పడుతున్నా తమ అభ్యర్థి విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్న టీడీపీ
- టీడీపీ కూడా మైనారిటీ మహిళ అభ్యర్థిని బరిలోకి దింపేందుకు యోచన
- సర్వేల ద్వారా ప్రాచుర్యంలో ఉన్న ఆరా మస్తాన్ భార్యను రంగంలోకి దించే ప్రయత్నాలు
10:52 AM, Jan 21, 2024
అది దురా‘గత పాలన’
- బాబు దయ చూ‘పింఛనే’లేదు
- టీడీపీ హయాంలో అవ్వాతాతల ఉసూరు
- జన్మభూమి కమిటీల అరాచకాలు
- కక్ష సాధింపుతో అర్హుల పింఛన్లు తొలగింపు
- బతికున్నోళ్లను చంపేసిన పచ్చమూకలు
- శ్రీకాకుళం జిల్లాలో 74 వేల మంది బలి
- లోకాయుక్తను ఆశ్రయించినా
- చలించని వైనం
- కోర్టు ధిక్కరణ కేసులు పెట్టాక పింఛన్ల పునరుద్ధరణ
- బాధితుల తరఫున అలుపెరగని పోరాటం చేసిన వైఎస్సార్‌సీపీ
10:36 AM, Jan 21, 2024
చంద్రబాబు ప్రజావిశ్వాసాన్ని కోల్పోయారు: ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి
- ఎంత తంటాలుపడ్డా కమలాపురం సభకు జనం కరువు
- ఏడు నియోజకవర్గాల నుంచి జనాన్ని తరలించినా కమలాపురంలో ‘రా కదలిరా’ సభ విఫలం
- చంద్రబాబుపై ప్రజలు నమ్మకం కోల్పోవడమే ఇందుకు కారణం
- చంద్రబాబు ప్రసంగం సంతలో మూలికలు విక్రయించే వారిలా ఉంది
- తాను సీఎంగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి గురించి చంద్రబాబు ఎక్కడా చెప్పలేదన్నారు
- అధికారంలోకి రాగానే ఫ్రీ పథకాలు ఇస్తామంటూ ప్రజలను మరోసారి వంచించే ప్రయత్నం చేశారు
- నాపై టీడీపీ నాయకులు, చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు 2024 ఎన్నికలే సమాధానం చెబుతాయి
- చంద్రబాబు మోసం రైతులు, మహిళలు, ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదు
- రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతారు
09:38 AM, Jan 21, 2024
మసకబారిన ‘చంద్రుడు’
- చంద్రబాబు నాయకత్వ పటిమపై నాయకులు, కేడర్‌లో తగ్గిన నమ్మకం
- జనసేనతో పొత్తు ఫలించని వైనం
- పనిచేసే నాయకులే కరువు
- తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయకత్వం మసకబారుతోంది
- ఇప్పటికే చంద్రబాబు సీఎంగా పనిచేసిన సమయంలో ప్రజలను వంచించిన తీరు
- ఆయనలో నాయకత్వ పటిమ తగ్గడంతో ప్రజల్లో పార్టీపై నమ్మకం విపరీతంగా తగ్గిపోయింది
- ఇటీవలి కాలంలో ఆయన నిర్వహిస్తున్న బహిరంగ సభలు, కార్యక్రమాల్లో పాల్గొనని ప్రజలు
- కార్యకర్తలు కూడా అంతంతమాత్రమే
- ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యారు
- ఒంటరిగా పోటీ చేస్తే పార్టీ గల్లంతేనన్న నిశ్చతాభిప్రాయానికి వచ్చిన చంద్రబాబు..
- జనసేన పార్టీతో పొత్తు.. ఈ పార్టీలు రెండూ దొందు దొందే కావడంతో ప్రజాదరణ కనీస మాత్రంగా కూడా లేదు
- దీంతో రూపాయి ఖర్చు పెట్టినా వృథాయేనన్న ఆలోచన నాయకుల్లో వేళ్లూనుకుపోయింది.
- టీడీపీకి ఎక్కడా సరైన అభ్యర్థులు దొరక్క చంద్రబాబు మల్లగుల్లాలు
09:31 AM, Jan 21, 2024
బాబుకు భంగపాటు
- డుంబ్రిగూడ, మండపేట సభల్లో మధ్యలోనే వెనుదిరిగిన జనం
- చంద్రబాబుకు అటు గిరిజనులు, ఇటు కోనసీమ మండపేట వాసులు ఝలక్
- రెండుచోట్లా ఆయన మాట్లాడుతుండగానే నిన్ను నమ్మం బాబు అనుకుంటూ వెళ్లిపోయిన జనం
- దారితప్పిన బాబు హెలికాప్టర్
- చంద్రబాబు అరకు టూర్‌లో కొద్దిసేపు గందరగోళం
- ఆయన ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి శనివారం మ.11.59 గంటలకు విశాఖ చేరుకున్నారు
- ఇక్కడ నుంచి హెలికాప్టర్‌లో అరకు బయలుదేరాల్సి ఉండగా ఏటీసీ అనుమతి లేకపోవడంతో 30 నిమిషాలు రన్‌వేపై నిలిచిపోయింది.
- ఆ తరువాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఇచ్చిన కోడ్‌ను పైలట్ సరిగ్గా ఫీడ్ చేయకపోవడంతో విజయవాడ దిశగా హెలికాప్టర్ ప్రయాణించింది
- ఇది గమనించిన 17 నిమిషాల తరువాత విశాఖ విమానాశ్రయానికి తిరిగి వచ్చి ల్యాండ్ అయింది
- అధికారులు ఇచ్చిన కోడ్‌ను సరిగ్గా ఫీడ్‌చేశాక 12.33 గంటలకు హెలికాఫ్టర్ తిరిగి బయలుదేరింద
అయినా పార్టీ అధ్యక్షుడే పార్టీ లేదు బొక్కా లేదు అన్నప్పుడు, కార్యకర్తలు పార్టీ జెండాలు తొక్కి పడేయ్యటంలో తప్పులేదులే! 😂
— YSR Congress Party (@YSRCParty) January 20, 2024
ఇదీ రాష్ట్రంలో @JaiTDP పరిస్ధితి! 🤭
Congratulations @NaraLokesh your dream to End TDP is coming true!#EndOfTDP pic.twitter.com/ZTk6gGy2ao
08:34 AM, Jan 21, 2024
అంబేడ్కర్ విగ్రహంపైనా ఏడుపేనా?
- ఎందుకు విషం చిమ్ముతున్నారు.. మీకొచ్చిన నష్టమేంటి?
- ఎల్లోమీడియాపై దళితులు, దళిత సంఘాల నాయకుల ఆగ్రహం
- ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రతులు దహనం
- రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా చేసిన కార్యక్రమంపైనా విషపు రాతలేనా..
- సీఎం జగన్‌కు వస్తున్న ప్రశంసలను జీర్ణించుకోలేని చంద్రబాబు
- ఈనాడు, ఆంధ్రజ్యోతిలో విషపు రాతలు రాయించడం సిగ్గుచేటు
- గతంలో చంద్రబాబు అమరావతిలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి.. ఊరు చివరన శంకుస్థాపన చేసి గాలికొదిలేసిశారు
- అంబేడ్కర్‌ను అంటరాని వ్యక్తిగా చూసింది టీడీపీ ప్రభుత్వం కాదా?
- ఇకపై అనుచిత వ్యాఖ్యలు చేసినా.. విషపు రాతలు రాసినా ఉద్యమిస్తాం
రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు దగ్ధం
— YSR Congress Party (@YSRCParty) January 20, 2024
అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుపై విషపు రాతలు రాసిన పచ్చ పత్రికలను దగ్ధం చేసి నిరసనలు#BanYellowMediaSaveAP pic.twitter.com/jreSyyIzZG
08:22 AM, Jan 21, 2024
పొత్తులమారి నక్క!
- ఉత్తరాంధ్రలో జనసేనకు టీడీపీ ఝలక్!
- 35 సీట్లలో విదిల్చేది ముష్టి మూడేనట!
- అంతర్గతంగాతేల్చిచెబుతున్న టీడీపీ నేతలు
- బలం ఉందని చాటుకునేందుకు జనసేన యత్నాలు
- సహచర పక్షాలను మోసగించే ‘పొత్తులమారి నక్క’ టీడీపీ ఎప్పటిలానే ఈసారి జనసేనకు ఝలక్ ఇచ్చేందుకు వ్యూహం
- ఉత్తరాంధ్రలో ఉన్న 35 సీట్లలో కేవలం విశాఖ దక్షిణ, భీమిలి నియోజకవర్గాలతో పాటు పెందుర్తి/యలమంచిలిలో ఏదో ఒక స్థానాన్ని కలిపి మొత్తం మూడు మాత్రమే జనసేనకు కేటాయించేందుకు సిద్ధమవుతోంది
- ఈ విషయాన్ని అంతర్గతంగా టీడీపీ అధినాయకత్వం ఆ పార్టీ నేతలకు చెబుతుండటం గమనార్హం
- సర్వేల సాకుతో పొత్తు ధర్మానికి తూట్లు పొడిచేందుకు కుట్ర పన్నుతున్నట్టు సమాచారం
08:10 AM, Jan 21, 2024
అది పచ్చపన్నాగమే..
- పథకం ప్రకారమే నేర చరిత్ర ఉన్న శ్రీనివాస్‌కు రెస్టారెంట్‌లో ఉద్యోగం
- నో అబ్జక్షన్ సర్టిఫికెట్ వచ్చేలా చేసిన రెస్టారెంట్ యజమాని
- హత్య చేసేందుకే దాడికి పాల్పడ్డాడని ఎన్‌ఐఏ దర్యాప్తులో వెల్లడి
- అయినా హత్యాయత్నాన్ని తక్కువ చేసి చూపేందుకు ఎల్లో మీడియా కుట్ర
- విశాఖ విమానాశ్రయంలో పక్కా వ్యూహంతోనే జగన్‌పై హత్యాయత్నం
- జనబలం లేని చంద్రబాబుకు అడ్డదారిలో అధికారం కట్టబెట్టేందుకు పచ్చపక్షం తెగ తాపత్రయం
- ప్రజలను తప్పుదారి పట్టించే రీతిలో అడ్డగోలు కథనాలు వండివారుస్తూ ఆపసోపాలు
- సింగిల్‌గా పోరాడుతున్న సింహాన్ని చూసి బెదిరిపోతున్న శక్తులన్నీ ఒక్కటై కత్తులు దూస్తున్నాయి.
- కుట్ర రాజకీయాలు చేస్తూ ప్రతి అంశాన్నీ జగన్‌కు వ్యతిరేకంగా చూపించేలా కట్టుకథలు
- చివరకు 2018లో ఆయనపై విశాఖ విమానాశ్రయం వేదికగా జరిగిన హత్యాయత్నం కేసుపైనా దుష్ప్రచారం
- పథకం ప్రకారమే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ఓ వైపు ఎన్‌ఐఏ ధ్రువీకరిస్తున్నా... దానినీ పక్కదారి పట్టించేలా అసత్యాలను ప్రచారం చేయాలని కంకణం
07:53 AM, Jan 21, 2024
దళిత ద్రోహి ఎవరు.. సామాజిక న్యాయం చేసిందెవరు?
- హవ్వా.. దళిత ఎమ్మెల్యేలనే ట్రాన్స్‌ఫర్ చేస్తారా? ఏంటిది?.. అంటూ టీవీ5 సాంబ చౌదరి కితకితలు
- ఫ్లాష్‌బ్యాక్ తెలియక మనోడు వేస్తున్న వేషాలకు.. ఫ్లాష్‌బ్యాక్ సరైన సమాధానం
- ఏపీ(ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక..) రాజకీయాల్లో అసలు దళితులకు న్యాయం చేసిందెవరు? అన్యాయం చేసిందెవరు?.
- గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశారో సాంబడికి గుర్తు లేనట్లుంది!.
- విశాఖ జిల్లాలో 2019 ఎన్నికలప్పుడు దళిత వర్గానికి చెందిన పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను అక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ చేసి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి బరిలోకి దించారు
- కొవ్వూరు(ఎస్సీ) ఎమ్మెల్యే, అప్పటి మంత్రి కేఎస్ జవహర్‌ను కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గానికి ట్రాన్స్‌ఫర్ చేసి పోటీ చేయించారు.
- ఇదే రీతిలో పలువురు ఎస్సీ, బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను జిల్లాల సరిహద్దులు దాటించి ఇతర నియోజకవర్గాల నుంచి చంద్రబాబు పోటీ చేయించారు చంద్రబాబు.
- వైఎస్సార్‌సీపీ ఇప్పుడు రాబోయే ఎన్నికల కోసం మార్పులు చేర్పులు చేస్తోంది.
- ఈ క్రమంలో నాలుగు జాబితాలకు కలిపి 58 అసెంబ్లీ, 10 ఎంపీ స్థానాలకు మార్పులు చేసింది
- అందులో.. అగ్రవర్ణాలు పోటీ చేసిన 7 అసెంబ్లీ స్థానాలను.. ఐదు బీసీలకు, రెండింటిని మైనారిటీలకు కేటాయించారు సీఎం జగన్
- సీట్ల కేటాయింపులో తన సొంత సామాజిక వర్గాన్ని కూడా ఆయన లెక్క చేయలేదు.
- మంగళగిరి ఆళ్ల రామకృష్ణ రెడ్డి, కదిరి సిద్ధారెడ్డి, ఎమ్మిగనూరు చెన్న కేశవరెడ్డిలకు అలాగే.. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి గతంలోనే సీటు ఇవ్వలేనని తేల్చి చెప్పారాయన
సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం.. వైఎస్సార్‌సీపీ జాబితా
- ఎస్సీలు- 21
- ఎస్టీలు -3
- బీసీలు- 17
- మైనార్టీలు- 4
- ఓసి - 13
10 లోక్‌సభ స్థానాల సమన్వయకర్తల్లో..
- బీసీలు -6
- ఎస్సీలు -2
- ఎస్టీ -1
- ఓసీ -1
- ఏపీ కేబినెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ ఇచ్చిన మంత్రి పదవులు - 17 (కేబినెట్‌లో 70 శాతం)
బీసీ మంత్రులు :
- బాబు పాలనలో-8
- జగన్ పాలనలో-11
ఎస్సీ మంత్రులు:
- బాబు పాలనలో-2
- జగన్ పాలనలో-5
- జగన్ పాలనలో ఉప ముఖ్యమంత్రులు -4 (80 శాతం)
- తొలిసారిగా ఒక ఎస్సీ మహిళను హోంశాఖ మంత్రిగా నియమించారు
స్పీకర్
- బాబు పాలనలో-కోడెల (కమ్మ)
- జగన్ పాలనలో -తమ్మినేని సీతారాం (బీసీ)
బీసీలకు రాజ్యసభ స్థానాలు
- బాబు పాలనలో-0
- జగన్ పాలనలో -4
- బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు
ఎమ్మెల్సీలు
- బాబు పాలనలో-48 మంది ఎమ్మెల్సీలకుగానూ ఆయా సామాజిక వర్గాల నుంచి 18 మంది (37 శాతం )
- జగన్ పాలనలో-43 మంది ఎమ్మెల్సీలకుగానూ ఆయా సామాజికవర్గాల నుంచి 29 మంది (68 శాతం)
- జగన్ హయాంలో మిగతావి..
13 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులలో - 9 (69 శాతం)
14 కార్పొరేషన్ మేయర్ పదవుల్లో -12 (86 శాతం)
గెలిచిన 84 మున్సిపల్ చైర్మన్ పోస్టుల్లో -58 (69 శాతం )
137 వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల ఛైర్మన్ పదవులలో - 79 (58 శాతం)
నామినేటెడ్ డైరెక్టర్ పదవులు-280 (58 శాతం)
196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లలో -117 (60 శాతం)
7,006 ఆలయ బోర్డు మెంబర్ల పదవుల్లో- 3,503 (50 శాతం )
బీసీ వర్గాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు
ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు
ఎస్టీలకు 1 కార్పొరేషన్ ఏర్పాటు
07:05 AM, Jan 21, 2024
చంద్రబాబుపై తిరుగుబాటు చేసిన మాజీ ఎమ్మెల్యే సివెరి సోము కుటుంబ సభ్యులు
- చంద్రబాబు మమ్మల్ని మోసం చేశాడు: సివెరి సోము కుమారుడు సురేష్
- చివరకు సీటు ఇస్తామని చెప్పి తమకు అన్యాయం చేశాడు..
- వచ్చే ఎన్నికల్లో టిడిపి రెబల్ గా పోటీ చేస్తా..
- తమ సత్తా చంద్రబాబుకు చూపిస్తా.
- పార్టీ కోసమే మా నాన్న చనిపోయారు..
- మా నాన్న చనిపోయిన సందర్భంలో ఎమ్మెల్యే సీటు ఇస్తామని చెప్పారు.. ఇవ్వలేదు
- 2024 లో ఎమ్మెల్యే సీటు ఇస్తామని చెప్పారు.. ఇప్పుడు కూడా ఇవ్వలేదు..
- టిడిపిలో కష్టపడిన వారికి న్యాయం జరగదు..
- వచ్చే ఎన్నికల్లో టిడిపి ఎలా గెలుస్తుందో చూస్తాం
- కష్టపడిన వారిని కాకుండా ఎవరో గొట్టం గాడికి సీటు ఇస్తే ఎలా ఊరుకుంటాం
- చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోరు
- చంద్రబాబువి మోసపూరిత మాటలు..
- అరకులో పార్టీని నిలబెట్టింది సివెరి సోము
- మా నాన్న చనిపోయినప్పుడు మా కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు
- మా కుటుంబాన్ని ఆదుకొని చంద్రబాబు మాకు సీట్ ఇస్తాడు అంటే నమ్మాము
- ఇక చంద్రబాబు మాయమాటలను నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు.
- గిరిజన వ్యతిరేకి చంద్రబాబు
- అమాయకులైన గిరిజనులను మోసం చేయడం చంద్రబాబు మొదటి నుంచి అలవాటు