
ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ప్రతిపక్షాల కుట్రలతో..
AP Elections Political Latest Updates Telugu..
6:52PM, Jan 22, 2024
సీఎం జగన్ పేదల పక్షపాతి: ఎమ్మెల్సీ పోతుల సునీత
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మ బంధువు సీఎం జగన్
- సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయి
- చంద్రబాబు బీసీలను అడుగడుగునా అవమానించారు.
- బాబుకు దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే తెలుసు
6:20PM, Jan 22, 2024
బీసీలను ఎప్పుడూ బాబు బ్యాక్‌వర్డ్‌గానే చూశారు: మేరుగు నాగార్జున
- బాబు హయాంలో దళితులపై జరిగినన్ని దాడులు దేశంలో ఎక్కడా జరగలేదు
- బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అక్కున చేర్చుకున్న ఘనత సీఎం జగన్‌ది.
5:20PM, Jan 22, 2024
చంద్రబాబు నమ్మించి గొంతుకోసే రకం: ఎంపీ నందిగం సురేష్
- సీఎం జగన్ ప్రజలకు మేలు చేశారు.. ఆ మేలే మళ్లీ జగన్‌ను ముఖ్యమంత్రిని చేస్తోంది
- ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలనలోనే బడుగు బిడ్డలకు భవిష్యత్తు ఉంటుంది
- ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మీద నమ్మకంతోనే సీనియర్ నాయకులు కరణం బలరాం వంటి వారు పార్టీలో ఉన్నారు
- బీసీ, ఎస్టీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం జగన్ పెద్ద పీట వేశారు
- చంద్రబాబు ఆ వర్గాలను మోసం చేశారు
4:42PM, Jan 22, 2024
సీఎం క్యాంప్ ఆఫీస్‌కు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు
- క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లిన మంత్రులు బొత్స, గుడివాడ అమర్నాథ్
- ఎమ్మెల్యేలు మేకా వెంకటప్రతాప్ అప్పారావు, మద్దిశెట్టి వేణుగోపాల్
- తమ నియోజకవర్గ సమస్యలపై అధికారులను కలిసిన నేతలు
3:40 PM, Jan 22, 2024
2024 ఓటర్ల తుది జాబితాను జిల్లాల వారీగా విడుదల చేసిన ఎన్నికల సంఘం
- సీఈఓ ఆంధ్రా వెబ్ సైట్ లో జిల్లాల వారీగా తుది ఓటర్ల జాబితా
- అసెంబ్లీ స్థానాల వారీగా ఓటర్ల జాబితాలు ప్రచురించిన ఎన్నికల సంఘం
- నియోజకవర్గాల వారీగా పీడీఎఫ్ ఓటర్ల జాబితాలు అప్ లోడ్ చేసిన ఈసీ
- ఓటర్ల జాబితాను ఎక్కడికక్కడే విడుదల చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు
3:05 PM, Jan 22, 2024
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడూ ఉద్యోగుల పక్షమే:: మాజీ మంత్రి పేర్నినాని
- మచిలీపట్నంలో అంగన్వాడీల ధర్నా శిబిరానికి వెళ్లిన మాజీ మంత్రి పేర్ని నాని
- అంగన్వాడీలతో పేర్ని నాని మాటా మంతీ
- మొండిపట్టు వీడి.. విధుల్లో చేరాలని అంగన్వాడీలను కోరిన పేర్నినాని
- సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఎప్పుడూ ఉద్యోగుల పక్షమే
- మళ్లీ వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే... ముఖ్యమంత్రి అయ్యేది సీఎం జగనే
- ఎన్నికల తర్వాత మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని అంగన్వాడీలకు భరోసా ఇచ్చిన పేర్ని నాని
1:10 PM, Jan 22, 2024
చంద్రబాబు పాలనను షర్మిల ఎందుకు ప్రశ్నించలేదు: మంతెన మాధవి వర్మ
- రాష్ట్రంలో సీఎం జగన్ సుపరిపాలన అందిస్తున్నారు.
- వైఎస్సార్ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి పాలన సాగించారు.
- చంద్రబాబు లక్ష కోట్లకు పైగా అప్పులు చేసి వెళ్ళిపోయారు.
- రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా కోర్టుల్లో కేసులు పెట్టి బాబు అడ్డుకుంటున్నారు.
- షర్మిల ఆంధ్ర కోసం మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది.
- రాష్ట్రమంతా తిరిగితే అభివృద్ధి ఎంత జరిగిందో తెలుస్తుంది.
- చంద్రబాబు పాలనను ఎందుకు షర్మిల ప్రశ్నించలేకపోయారు
- ఆంధ్రలో కాంగ్రెస్ భూ స్థాపితం అయిపోయింది
- ఎంత మంది కలిసి వచ్చిన సీఎం జగన్‌ను ఏమీ చేయలేరు.
- చంద్రబాబు ప్రయోజనాల కోసమే షర్మిల ఏపీలో రాజకీయాల్లోకి వచ్చారు.
12:30 PM, Jan 22, 2024
కాసేపట్లో చీరాలలో సామాజిక సాధికార బస్సు యాత్ర
- చీరాలలో నేడు సామాజిక సాధికార యాత్ర
- వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్ కరణం వెంకటేష్ ఆధ్వర్యంలో సాధికార బస్సు యాత్ర.
- పట్టణంలో భారీ ర్యాలీకి సిద్ధమవుతున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు.
- మధ్యాహ్నం 3:30 గంటలకు ఐఎంఏ హాల్‌లో ప్రెస్‌మీట్.
- వైఎస్సార్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజద్ భాష, మంత్రులు మేరుగా నాగార్జున, విడుదల రజిని, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, నందిగం సురేష్ పాల్గొననున్నారు.
- సాయంత్రం ఐదు గంటలకు చీరాల గడియార స్తంభం సెంటర్ వద్ద భారీ బహిరంగ సభ.
11:45 AM, Jan 22, 2024
ఏపీలో విడుదల అవుతున్న తుది ఓటర్ల జాబితా
- అనంత జిల్లా తుది ఓటరు జాబితా విడుదల చేసిన జిల్లా కలెక్టర్ గౌతమి
- జిల్లాలో 1994544 మంది ఓటర్లు
- రాజకీయ పార్టీలకు ఓటరు జాబితాను అందజేసిన కలెక్టర్ గౌతమి
- ఎనిమిది నియోజకవర్గాల ఓటరు జాబితా వివరాలు వెల్లడించిన కలెక్టర్ గౌతమి
11:00 AM, Jan 22, 2024
బోండా ఉమకు వెలంపల్లి శ్రీనివాస్ కౌంటర్
- బోండా ఉమా లాగా మాకు కబ్జా, దోచుకున్న ఆస్తులపై ఆశ లేదు
- విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీపై 25వేల మెజార్టీ సాధిస్తాం
- నియోజకవర్గ ప్రజలు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాకి ఎందుకు ఓటు వెయ్యాలి?
- టీడీపీ ప్రభుత్వంలో ఇంత సంక్షేమం ఎప్పుడైనా చూశారా
- చంద్రబాబు ప్రభుత్వంలో 400 కోట్లు పెన్షన్‌కి ఇస్తే..
- సీఎం జగన్ ప్రభుత్వం నెలకు రూ.2000 కోట్లు పెన్షన్లకు ఖర్చు పెడుతోంది
- బోండా ఉమా ముందు టీడీపీ తరఫున సెంట్రల్ నియోజకవర్గం టికెట్ తెచ్చుకో
- వెన్నుపోటు, ప్రజలను దోచుకోవడం, కబ్జా, బైక్ రేసింగ్, రౌడీయిజం చేసినందుకు మీకు ఓటెయ్యలా బోండా
10:15 AM, Jan 22, 2024
వైఎస్సార్ కుటుంబాన్ని క్షోభ పెట్టిన పార్టీ కాంగ్రెస్: జడ్పీటీసీ నరేన్ రామాంజులరెడ్డి
- ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన షర్మిలకు శుభాకాంక్షలు
- పీసీసీ పదవి రాగానే వైఎస్సార్‌సీపీపై, సీఎం జగన్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు
- కాంగ్రెస్ గతంలో గొప్ప పార్టినే.. కానీ ఇప్పుడు రోజు మరుగున పడింది
- కాంగ్రెస్ పార్టీ ఒంటెద్దుపోకడల వల్ల మనుగడ కోల్పోయింది
- శరద పవర్, మమత వంటి నేతలనే కోల్పోయింది
- గల్లీలో బలం లేని నాయకులు ఢిల్లీలో చెప్పే వారి మాటలు విని వైఎస్ జగన్‌ను బయటకు పంపారు
- రాహూల్‌ను ప్రధాని చెయ్యాలనేది వైఎస్సార్ కల
- మరి 2009లో 34 సీట్లుతో గెలిపిస్తే రాహూల్‌ను ఎందుకు ప్రధాని చెయ్యలేదు
- నేను పీఎం కావాలని రాహూల్ ఏనాడు అడగడం లేదు
- వైఎస్సార్‌కు ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలనే కల ఉండేది
- కానీ కాంగ్రెస్ రాష్టాన్ని విడగొట్టింది
- ఎఫ్ఐఆర్‌లో వైఎస్సార్ పేరును చేర్చారు.
- వైఎస్సార్ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేశారు.
- గాంధీజీ, అంబేడ్కర్ కలలను వైఎస్ జగన్ సాకారం చేస్తున్నారు
- శవాలపై పేలాలు ఎరుకునే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు
- వైఎస్సార్ పేరును బద్నాం చెయ్యాలని కుట్ర చేస్తున్నారు
- షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీ సెక్యూలర్ పార్టీ అంటోంది
- సీఎం జగన్ రాజకీయాల్లోకి కులాలను ఎప్పుడు లాగలేదు
- మళ్లీ వైఎస్ జగన్ సీఎం అయితేనే పథకాలు అందుతాయి
- ఎన్ని పార్టీలొచ్చినా వైఎస్సార్‌సీపీకి ఢోకా లేదు
- వైఎస్సార్ ఆశయాలు కేవలం ఒక్క జగన్‌తోనే సాధ్యం.
9:15 AM, Jan 22, 2024
జగనన్నే మళ్లీ సీఎం: పబ్లిక్ టాక్
- సీఎం జగన్ పాలనలోనే ఏపీలో అభివృద్ధి
- అందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి.
- ఊరు కూడా అభివృద్ధి చెందింది.
- ఇంత మంచి చేసిన జగనే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు.
సీఎం @ysjagan పాలనలో మా కుటుంబానికి సంక్షేమ పథకాలు అందడంతోపాటు..ఊరు కూడా అభివృద్ధి చెందింది
— YSR Congress Party (@YSRCParty) January 22, 2024
ఇంత మంచి చేసిన జగనన్నే మళ్లీ సీఎం కావాలి. #PublicVoice #YSJaganAgain #AndhraPradesh pic.twitter.com/VTNUTwzbjc
8:30 AM, Jan 22, 2024
టీడీపీలో చెత్త పాలిటిక్స్
- బాలయోగి వారసుడు హరీష్‌కు ఝలక్
- డబ్బు లేదని పక్కన పెట్టేస్తున్న వైనం
- అమలాపురం పార్లమెంట్ బరి నుంచి తప్పించే యత్నం
- పి.గన్నవరం లేదా అమలాపురం అసెంబ్లీకి పంపే యోచన
- అలిగిన హరీష్.. లెక్కచేయని టీడీపీ అధిష్టానం
- బాలయోగి అభిమానుల్లో ఆగ్రహం
- అమలాపురంలో ఆనందరావుకు చెక్ పెట్టాలని చినరాజప్ప ఎత్తుగడ
8:00 AM, Jan 22, 2024
రాహుల్ యాత్రపై దాడులు.. ఏపీలో కాంగ్రెస్ నిరసనలు
- అసోంలో భారత్ జోడో యాత్రపై దాడులు
- దాడిని ఖండించిన ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల
- దాడులకు వ్యతిరేకంగా ఏపీలో నేడు కాంగ్రెస్ శ్రేణుల నిరసన
The Congress party strongly condemns extremist BJP goons’ attack on Bharat Nyaya Jodo Yatra in Assam. The BJP is not able to digest the fact that the Yatra has been cruising unstoppably, uniting hearts and inspiring people, moving unopposed under Shri Rahul Gandhi’s leadership.…
— YS Sharmila (@realyssharmila) January 21, 2024
7:30 AM, Jan 22, 2024
అచ్చన్నకు చెక్ పెట్టిన బాబు, లోకేష్
- పేరుకే అధ్యక్ష పదవి .. బీసీ నేతకు ఘోర అవమానాలు
- పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేసిన చంద్రబాబు, లోకేశ్
- అధ్యక్షుడి పనులన్నీ వర్ల రామయ్య ఇతర నేతలతో చేయిస్తున్న వైనం
- మీడియా సమావేశాలు పెట్టడానికీ అనుమతి లేదు
- అడపాదడపా ఒకటి, రెండు సమావేశాలకే పరిమితం
- బాబాయ్‌ని తొక్కిపెట్టి, అబ్బాయి రామ్మోహన్‌ని పైకి లేపుతున్న లోకేశ్
- లోలోన రగిలిపోతున్న అచ్చెన్నాయుడు
7:25 AM, Jan 22, 2024
నేడు ఏపీ ఓటర్ల తుది జాబితా విడుదల
- 2023 అక్టోబర్ 27 నాటి ముసాయిదా జాబితాపై విమర్శలు
- జీరో డోర్ నెంబర్‌తో ఓట్లు, డూప్లికేట్ ఓట్లపై వెల్లువెత్తిన ఫిర్యాదులు
- తుది ఓటర్ల జాబితాలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
7:20 AM, Jan 22, 2024
టీడీపీలో సెల్ఫ్ షోలు
- టికెట్ కోసం కొత్త వేషాలు
- ఆలపాటి, పులివర్లి, యరపతినేని హంగామా
- కేశినేని సోదరుల మధ్య చిచ్చు
- ఇదే వరుసలో ఇంకెందరో..
- బాబుపై నమ్మకంలేని నేతలు
- తెనాలి సీటు విషయంలో నాదెండ మనోహర్, ఆలపాటి మధ్య పొలిటికల్ వార్
7:00 AM, Jan 22, 2024
షర్మిల.. ఎవరి ప్రయోజనాల కోసం ఏపీకి వచ్చావ్?
- తెలంగాణ కోడల్ని.. ఇక్కడే పోరాటం చేస్తానన్నవ్
- కాంగ్రెస్ ఎలాంటి పార్టీనో గుర్తులేదా?.
- ఛార్జ్‌షీట్‌లో వైఎస్సార్ పేరును చేర్చిన కాంగ్రెస్
- షర్మిల ఇది నీకు తగునా?
తెలంగాణ కోడల్ని.. ఇక్కడే పోరాటం చేస్తానన్న మీరు.. సీఎం వైయస్ జగన్‌పై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసి.. వైయస్ఆర్ పేరు ఛార్జిషీట్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీలో చేరి.. ఎవరి ప్రయోజనాల కోసం ఏపీకి వచ్చావ్ @realyssharmila?#MorusupalliSharmila pic.twitter.com/ldfcXlmplA
— YSR Congress Party (@YSRCParty) January 21, 2024
6:50 AM, Jan 22, 2024
చంద్రబాబుకు చివరి అస్త్రం షర్మిలనే: సజ్జల రామకృష్ణారెడ్డి
- వైఎస్సార్ ఆలోచనలకు అనుగుణంగా జగన్ పనిచేస్తున్నారు
- కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి, వైఎస్సార్ కుటుంబానికి అన్యాయం చేసింది
- వైఎస్ జగన్‌పై కాంగ్రెస్ అక్రమ కేసులు పెట్టింది
- వైఎస్ జగన్‌పై పెట్టినవి అక్రమ కేసులని గులాం నబీ ఆజాదే చెప్పారు
- వైఎస్సార్ పేరును కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు
- వైఎస్ మరణానంతరం ఆయన కుటుంబ సభ్యులను కాంగ్రెస్ ఇబ్బందులకు గురి చేసింది
- షర్మిల నిన్నటి వరకు తెలంగాణలో ఏం చేశారు?
- షర్మిల.. తెలంగాణ నుంచి హఠాత్తుగా ఏపీకి ఎందుకొచ్చారు?
- రాష్ట్రంలో ఉనికిలేని పార్టీ కాంగ్రెస్
- షర్మిల వాడిన భాష బాగోలేదు
- కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలకు ఏం తెలుసు?
- గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి
- ఆ పార్టీ తరఫున షర్మిల ఇక్కడకు వచ్చి ఏం చేస్తారు?
- చంద్రబాబును ఎలా సీఎం చేయాలన్నదే షర్మిల లక్ష్యంగా కనిపిస్తోంది
- చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసింది
- తెలంగాణలో పోటీ చేస్తానన్న షర్మిల ఎందుకు వెనకడుగు వేశారు?
- ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ పోరాడుతూనే ఉంది
- చంద్రబాబుకు చివరి అస్త్రం షర్మిలనే
- చంద్రబాబు ప్రతీరోజూ చేసే విమర్శలే ఇప్పుడు షర్మిల చేస్తుంది
- వైఎస్ అభిమానుల ఓట్లు చీలితే కొద్దిగా కలిసి వస్తుందనే ఆశతో చంద్రబాబు ఉన్నారు
- ఏపీలో ఎవరికి ఆయుధంలా ఉపయోగపడాలని వచ్చారో అందరికీ తెలుసు
- ఇదంతా చంద్రబాబు ఎత్తుగడే
- అందుకే ఆ వర్గం మీడియా షర్మిలను భుజానికి ఎత్తుకుంది
- వైఎస్సార్ వారసుడిగా ప్రజల హృదయాల్లో జగన్ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు
- రాష్ట్రంలో ఏ వర్గానికి అన్యాయం జరిగినా వైఎస్ జగన్ సహించరు
- రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వైఎస్ జగన్ రాజీపడరు
- ప్రత్యేక హోదాని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చట్టంలో చేర్చలేదు?
- షర్మిల కచ్చితంగా వివరణ ఇవ్వాల్సిందే
- వైఎస్సార్ తనయురాలిగా, వైఎస్ జగన్ చెల్లెలిగా షర్మిలను అభిమానిస్తాం
6:40 AM, Jan 22, 2024
రాష్ట్ర అభివృద్ధి గురించి షర్మిలకేమి తెలుసు?: వైవీ సుబ్బారెడ్డి
- షర్మిల రాష్ట్రానికి తొలిసారి వచ్చారు
- రాష్ట్ర అభివృద్ధి గురించి ఆమెకేమి తెలుసు
- ఆమె మాతో వస్తే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూపిస్తాము
- వైయస్సార్ పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చిన కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరారు
- ఆయన కుమారుడిని 16 నెలలు అన్యాయంగా జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీలో చేరారు
- వైయస్సార్ కు నిజమైన వారసులు ఎవరో ప్రజలే నిర్ణయిస్తారు
- మొన్నటివరకు తెలంగాణ బిడ్డగా అక్కడ తిరిగారు
- ఆమె అక్కడ ఎందుకు పోటీ చేయలేదు తెలియదు.
- షర్మిల కాదు ఎవరు వచ్చినా మా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టలేదు
- రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని ఇబ్బందుల్లో పెట్టింది సోనియాగాంధీ
- పక్క రాష్ట్రం నుండి వచ్చి ఇక్కడ అభివృద్ధి జరగలేదంటే ఎలా?
- ఢిల్లీ కాంగ్రెస్‌లో చేరి మమ్మల్ని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ సమీక్షించుకోవాలి
- అవినీతికి పాల్పడ్డ చంద్రబాబును షర్మిల ప్రశ్నించాలి
- మేము ఎప్పుడు కూడా బీజేపీతో కాంప్రమైజ్ కాలేదు
- ఈనెల 27వ తేదీన భీమిలిలో ఎన్నికల శంఖారావాన్ని సీఎం జగన్ పూరిస్తున్నారు
- రెండు లక్షల మంది 34 నియోజకవర్గాల నుండి హాజరవుతున్నారు
6:30 AM, Jan 22, 2024
సీటు వచ్చినా రాకపోయినా అభ్యర్ధి గెలుపు కోసం పనిచేయాలి: నాదెండ్ల మనోహర్
- నెలాఖరు నుంచి ఏపీలో పవన్ పర్యటన ఉంటుంది
- ఫిబ్రవరి మొదటి నుంచి క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల పవన్ సమావేశాలు పెడతారు
- ప్రతి రోజూ పవన్ మూడు సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ సిద్ధమవుతోంది
- పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుంది
- ఎన్నికల నిర్వహణ కోసం జోనల్ కమిటీని 191 మందితో ఏర్పాటు చేశాం