
AP Elections Political Latest Updates Telugu
7:41PM, డిసెంబర్ 28, 2023
విశాఖ:
బీమిలిలో పచ్చ పార్టీ నేతల దౌర్జన్యం
- సీపీఎం నేత అప్పలరెడ్డిపై దాడి చేసిన టీడీపీ గూండాలు
- ఓపెన్ జిమ్ శంకుస్థాపనలో అప్పలరెడ్డిపై టీడీపీ గూండాల దాడి
- పార్టీలకతీతంగా సీఎం జగన్ అభివృద్ధి చేస్తున్నారన్న సీపీఎం నేత అప్పలరెడ్డి
- ప్రభుత్వ అభివృద్ధిని ప్రశంసించడంతో అప్పలరెడ్డిపై దాడి
6:45PM, డిసెంబర్ 28, 2023
చంద్రబాబు హయాంలో ప్రతీ పదవీ ఒక వర్గానికే దక్కేది : ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను
- బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్ద పీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్
- విజయవాడ మేయర్‌ను బీసీ మహిళకు కేటాయించిన ఘనత సీఎం జగన్‌ది
- మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే జగన్‌మోహన్‌రెడ్డే సీఎంగా ఉండాలి
- ఈ రాష్ట్రానికి మళ్లీ మళ్లీ వైఎస్ జగనే సీఎంగా ఉండాలి
6:01PM, డిసెంబర్ 28, 2023
అంబటి రాయుడు సెకండ్ ఇన్నింగ్స్ పాలిటిక్స్
- YSRCP పార్టీలో అధికారికంగా చేరిన క్రికెటర్ అంబటి రాయుడు
- గత కొన్నాళ్లుగా జిల్లాల్లో పర్యటిస్తోన్న అంబటి రాయుడు
- విద్యార్థులు, యువతను కలిసి మాట్లాడుతోన్న అంబటి రాయుడు
- ఇవ్వాళ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన అంబటి రాయుడు
- కండూవా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ముఖ్యమంత్రి జగన్
5:10PM, డిసెంబర్ 28, 2023
లోకేష్ పాదయాత్రలో మిస్సయింది ఏంటీ?
- 4 వేల కిమీలు నడుస్తానని చెప్పాడు, 3130 కిమీల దగ్గరే ఆగిపోయాడు
- తక్కిన 900 కిలోమీటర్లకు వెన్నుపోటేశాడు
- మొత్తం 175 నియోజకవర్గాలను చుట్టేస్తానన్నాడు
- 100 అసెంబ్లీ నియోజకవర్గాలకు బ్రేకేశాడు
- అంటే పర్యటించింది 57% సీట్లకే.. ఎగ్గొట్టింది 43% నియోజకవర్గాలకు
లోకేష్ మిస్ చేసుకున్న అంశాలంటంటే.?
- చంద్రబాబు అరెస్టు అయిన అద్భుతమైన అవకాశం జారవిడుచుకోవడం
- రాష్ట్రంలో టిడిపి క్యాడర్‌ను నడిపించలేకపోవడం
- నిరసనలు, ఆందోళనలు చేయాల్సిన సమయంలో ఢిల్లీ పారిపోవడం
నాయకత్వంలో ఇంకా నేర్చుకోవాల్సిన అంశాలేంటీ?
- తాను ఎదగాల్సిన విషయం మరిచిపోవడం
- ఇంకా 73 ఏళ్ల చంద్రబాబే ముఖ్యమంత్రిని చేయాలనుకోవడం
- తనకింకా పదవి చేట్టే అనుభవం లేదని ఒప్పేసుకోవడం
- అదే సమయంలో పక్కపార్టీ నుంచి వచ్చిన పార్ట్‌టైం పొలిటిషియన్ పవన్‌కళ్యాణ్‌ను పొడగడం
- క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలతో పాటు ముఖ్యమైన అంశాలపై విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోలేకపోవడం
- అనర్గళంగా మాట్లాడలేకపోవడం (తెలుగు అయినా, ఇంగ్లీషు అయినా)
- స్థానిక అంశాలపై ఎలాంటి పరిణితి పెంచుకోలేకపోవడం
- సీనియర్లను నడిపించలేకపోవడం
- తన శక్తి సామర్థ్యాలను పెంపొందించుకునే ప్రయత్నం చేయలేకపోవడం
- ఇచ్చిన మాట మీద నిలబడలేకపోవడం
- అనవసరంగా నోరు పారేసుకోవడం
- ఆగ్రహం వ్యక్తం చేస్తే జనం గుర్తిస్తారనుకోవడం
ఇప్పటికిప్పుడు చేయాల్సినవేంటీ?
- తాను ఒక నాయకుడినని తనను తాను నమ్మడం
- పార్టీ పగ్గాలు చేపడతానని తండ్రిని, పార్టీని ఒప్పించడం
- ఎప్పటికైనా నేనే ముఖ్యమంత్రిని అవుతానని కనీసం తనవరకైనా నమ్మడం
- పక్కవారిపై ఆధారపడకుండా.. సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం
- ఎల్లోమీడియా భుజకీర్తులను నమ్మకుండా.. చేసిన పనులు, ఇచ్చిన హామీలపై నిజంగా సమీక్షించుకోవడం
- ప్రజల బాగోగులు తెలుసుకుని కొత్త పరిష్కారాలను తీసుకురాగలగడం
- అత్యుత్తమ విధానాలను అనుసరించడం, అనైతిక విధానాలకు (ఫిరాయింపులు, దొంగ ఓట్లు) స్వస్తి చెప్పడం
- షార్ట్‌కట్‌లను నమ్మకుండా కష్టేఫలి అనుకోవడం
4:19PM, డిసెంబర్ 28, 2023
బీసీల ఓట్లతో గెలిచి ఆ తర్వాత వారినే మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది:డిప్యూటీ సీఎం అంజాద్ బాష
- ఇది వరకు పాలకులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లతో గెలిచి అన్యాయం చేశారు
- 14 ఏళ్లు పని చేసిన చంద్రబాబు.. టీడీపీ బీసీల పార్టీ అంటాడు
- బీసీల పేరు చెప్పుకని మోసం చేశాడు
- మన ఓట్లతో గెలిచి మనల్ని మోసం చేశారు
- మోసం చేసిన చంద్రబాబులాంటి వ్యక్తి కావాలా..సామాజిక న్యాయం చేసిన సీఎం వైఎస్ జగన్ కావాలా?
- మైనార్టీని మంత్రి చెయ్యని వ్యక్తి చంద్రబాబు
- చంద్రబాబు వల్ల మైనార్టీల సమస్యలు ఎవరికి చెప్పుకొవాలో తెలియకుండా చేశాడు
- అదే వైఎస్ జగన్ నన్ను రెండు సార్లు ఎమ్మెల్యేను చేసి డిప్యూటి సీఎంను చేశారు
- రాయచోటికి చెందిన జకియా ఖానమ్‌ను మండలి డిప్యూటీ చైర్మన్‌ను చేశారు
- చరిత్ర రాయాలంటే వైఎస్ కుటుంబానికే సాధ్యమవుతుంది
- ఇలాంటి వ్యక్తికి మనమంతా అండగా ఉండాల్సిన అవసరం ఉంది
- అందరిని నా వాళ్లు అని పిలిచే ఎకైక వ్యక్తి సీఎం జగన్
- రాయచోటి ఈ ఐదేళ్లలో ఎంతో అభివృద్ధి చెందింది
- మీ పట్ల ఎవరు చిత్తశుద్దితో పనిచేస్తున్నారో చూడండి
- రాయచోటి అభివృద్దిలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కృషి ఎంతో ఉంది
- రానున్న ఎన్నికల్లో నక్కలు, కుక్కలు, పందులు ఎకమవుతున్నాయి
- అయినా భయపడేది లేదు .. సింహం వైఎస్ జగన్‌లా సింగిల్‌గా వస్తంది
- 175 స్దానాల్లో వైఎస్సార్‌సీపీ గెలుస్తుంది
- 175 స్దానాల్లో టీడీపీకి అభ్యర్థులే లేరు
- మేము ఏరిపారిస్తే వారికి టికెట్లు ఇవ్వాలని చూస్తున్నారు
4:09 PM, డిసెంబర్ 28, 2023
రాష్ట్రానికి దిక్సూచి ఒక్కరే.. అది జగన్ మాత్రమే: ఎంపీ సురేష్
- రాయచోటిలో సామాజిక సాధికార బస్సు యాత్రలో మాట్లాడిన ఎంపి నందిగం సురేష్
- రాష్టంలో YSR ఫ్యామిలీని నమ్మి మోసపోయిన వారు ఎవరు లేరు
- అదే చంద్రబాబును నమ్మిన వారెవరూ బాగుపడిన దాఖలాలు లేవు
- వచ్చే ఎన్నికల్లో ఈ తేడా చూసి YSRCPని గెలిపించండి
- ఇప్పుడు మన పిల్లలు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతున్నారంటే అది వైఎస్ జగన్ పాలన ఘనత
- కార్యాలయాల చుట్టూ జనం తిరగకుండా ఇంటింటికి పథకాలు అందిస్తున్న వ్యక్తి వైఎస్ జగన్
- చంద్రబాబు మాత్రం రాష్టాన్ని అప్పుల పాలు చేశాడని అంటున్నారు
- కానీ మేము ఇచ్చే పథకాలన్ని ప్రజలకే చేరాయి
- అదే టిడిపి హాయంలో పథకాలన్ని కాగితాలకే పరిమితం
- ఎవరో పార్టీ పెడితే దాన్ని లాక్కున్న వ్యక్తి చంద్రబాబు
- బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా రానీ పవన్ ఇప్పుడు మాట్లాడుతారా?
- ఇప్పుడు ఇంత మంది చదువుతున్నారంటే జగన్ మోహన్ రెడ్డి కారణం
- ఇంత మందికి పదవులు ఇచ్చారంటే జగన్ మోహన్ రెడ్డి కారణం
- నా సామాజిక వర్గానికి పదవులు ఇస్తానంటూ దళితులను అవమానపరచిన వ్యక్తి చంద్రబాబు
- అదే వైఎస్ జగన్ హోం మంత్రిగా దళితురాలిని చేశారు
- నందిగాం సురేష్‌గా ఒకప్పుడు జెండా పట్టుకుని తిరిగే వాడిని
- మళ్లీ గెలిపించి చూడండి మన పిల్లలు ఐఎఎస్, ఐపిఎస్ లు అవుతారు
- రాష్టాన్ని ఇంతలా అభివృద్ది చేసిన వ్యక్తి జగన్ ఒక్కరే
4:01PM, డిసెంబర్ 28, 2023
రాజకీయ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు: మంత్రి అమర్నాథ్
- ఒకరిద్దరు వెళ్లిపోతే పార్టీకి నష్టం జరుగుతుంది అనేది అమాయకత్వమే
- ఎమ్మెల్సీ వంశీ జనసేనలో చేరి రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడు
- త్వరలో ఖాళీ అయ్యేది జనసేన, టీడీపీలు మాత్రమే
3:33 PM డిసెంబర్ 28, 2023
YSRCP పాలనలో AP గణనీయమైన అభివృద్ధి : అయోధ్య రామిరెడ్డి
- రెండేళ్లు కరోనాతో ఇబ్బంది పడినా రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని సాధించింది
- నాలుగున్నరేళ్లలో అద్భుతమైన అభివృద్ధి జరిగింది
- తలసరి ఆదాయంలో అయిదేళ్ల కింద 17వ స్థానంలో ఉండే వాళ్లం, ఇప్పుడు ఏకంగా 9వ స్థానానికి ముందుకువచ్చాం
- రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం రాష్ట్రం చక్కటి వృద్ధిని సాధించింది
- 4,93,000 వేల ఉద్యోగాలిచ్చాం
- వ్యవసాయ రంగానికి ఎంతో మేలు జరిగింది
- ఈజ్ ఆఫ్ డూయింగ్ లో రెండు సార్లు ఉత్తమ ర్యాంక్ సాధించాం
- 4 లక్షల పై చిలుకు MSMEలను తెచ్చాం
- 8 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం
- ఆరోగ్యం కోసం నాలుగున్నరేళ్లలో వేల కోట్లు ఖర్చు చేశాం
- ఎన్నడూ లేేనట్లుగా ఫిషింగ్ హార్బర్లు,మెడికల్ కాలేజీలు, పోర్టులు తెచ్చాం
3:15PM. డిసెంబర్ 28, 2023
వాలంటీర్లకు ముఖ్యమంత్రి ఎప్పుడూ మేలు చేస్తారు
వెంకట్రామిరెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు
- ఉపాధ్యాయ సంఘాల్లో పేరెన్నిక గల సంఘం PRTU
- గత ప్రభుత్వం PRTU తప్పిదాల వలన రెండుగా చీలింది
- విడిపోయిన తర్వాత కూడా రెండు ఎమ్మెల్సీ లు గెలుచుకుంది
- ఆ రెండు సంఘాలు ఇప్పుడు కలిశాయి
- వీరి ఐక్యత వలన రానున్న రోజుల్లో ఉపాధ్యాయులకు మేలు చేకూరుతుంది
- వాలంటీర్లు ఎవరూ నిరసన చేయటం లేదు
- కొందరు కమ్యూనిస్టులు ఎన్నికల నేపథ్యంలో గొడవలు చేయాలని చూస్తున్నారు
- వాలంటీర్లు సీఎం జగన్ ఆత్మ లాంటి వాళ్లు
- వారికి ఎప్పుడూ మేలు చేయాలనే సీఎం చూస్తారు
- ఓట్ల కోసమైతే సీఎం జగన్ ఈ ఎన్నికల సమయంలోనే అమలు చేసేవారు తప్ప ముందుగా చేయరు
- కానీ సీఎం జగన్ అందరికీ ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారు
కృష్టయ్య, పిఆర్టియూ నేత
- ఉపాద్యాయ సంఘాల ఐక్యతతో ఉంటే న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం
- వెంకట్రామిరెడ్డి సూచనలతో మా రెండు వర్గాలు ఒకటిగా కలిశాయి
సెక్రటరీ, గాదె శ్రీనివాసులనాయుడు
- విడిపోవటం వలన నష్టం జరుగుతోందని గ్రహించాం
- అందుకే కలిసి పని చేయాలనుకుంటున్నాం
- గ్రౌండ్ లెవల్లో సమస్యలు పరిష్కారం అవుతున్నాయి
- విద్య, వైద్యరంగానికి సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారు
గిరిప్రసాద్, పిఆర్టియు నేత
- సమస్యల పరిష్కారం కోసం రెండు సంఘాలు కలిసి పని చేస్తాయి
- ఉపాధ్యాయ సమస్యలు అన్నీ పరిష్కారం అవుతున్నాయి
2:30PM. డిసెంబర్ 28, 2023
టీడీపీకి తెగులు పట్టింది: మంత్రి జోగి రమేష్
- ఆ పార్టీ దివాళా తీసిందని అందరికీ తెలుసు
- చంద్రబాబు దివాళా తీశాడనీ, ఒంటరిగా పోటీ చేసే దమ్ము, ధైర్యం లేదని తెలుసు
- పొత్తుల పేరుతో అందరి కాళ్లు పట్టుకుంటూ చంద్రబాబు తిరుగుతున్నారు
- అలాంటి పార్టీకి చెందిన అచ్చెన్నాయుడు మా మ్యానిఫెస్టో ఫెయిల్ అయిందని ఆరోపించటం సిగ్గుచేటు
- 99.5% హామీలను అమలు చేసిన లీడర్ జగన్
- దీన్ని మేము నిరూపిస్తాం,మ్యానిఫెస్టోలపై చర్చకు వచ్చే దమ్ముందా?
- మీ 2014 నాటి మ్యానిఫెస్టో, మా 2019 నాటి మ్యానిఫెస్టో మీద చర్చకు రాగలరా?
- మ్యానిఫెస్టో అంటే మాకు బైబిల్, ఖురాన్, భగవద్గీత
- మ్యానిఫెస్టో అమలు చేశాం కాబట్టే ధైర్యంగా ప్రతి ఇంటికీ వెళ్ళి మళ్ళీ ఓట్లు అడగగలుగుతున్నాం
- చరిత్రలో ఎవరైనా ఎన్నికల తర్వాత ఇలా ఇంటికి వెళ్ళి అమలు చేసిన కార్యక్రమాల గురించి చెప్పారా?
- చంద్రబాబులాగా మ్యానిఫెస్టోని నెట్ నుండి తొలగించలేదు
- మ్యానిఫెస్టోని చించి శనక్కాయల పొట్లాలుగా మార్చలేదు
- మాకు మ్యానిఫెస్టో అంటే పవిత్రగ్రంధం
- 2014లో మ్యానిఫెస్టోని అమలు చేయలేదు కాబట్టే చంద్రబాబును జనం చిత్తుచిత్తుగా ఓడించారు
- అసలు చంద్రబాబుకు ఏపీతో ఏం పని?
- ఈ రాష్ట్రంలో ఆధార్ కార్డు ఉందా?
- ఇల్లు, డోర్ నెంబర్ ఉందా?
- ఇలాంటి అడ్రస్ లేని వ్యక్తులు మా గురించి మాట్లాడటానికి సిగ్గుండాలి
- రైతులు, డ్రాక్రా మహిళలకు రుణమాఫీ పేరుతో దారుణంగా మోసం చేశారు
- నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేశారు
- అలాంటి మోసకారి, దుర్మార్గుడు అయినందునే చంద్రబాబుకు ఈ గతి పట్టింది
- 30 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తున్న జగన్ లాంటి సీఎం దేశంలో ఎక్కడైనా ఉన్నారా?
- అసలు చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్క పథకమైనా ఉందా?
- చంద్రబాబు దిక్కుమాలిన మ్యానిఫెస్టోని అసలు ఎవరైనా నమ్ముతారా?
- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోకాళ్ల మీద నడిచినా ఆ పాపం పోదు
- మళ్ళీ ఈరోజు మహిళలకు ఉచిత ప్రయాణమని అంటున్నారు
- మేము ఎలాంటి ప్రకటనా చేయకపోయినా మాపై ఆరోపణలు చేస్తున్నారు
- రామోజీ, రాధాకృష్ణ, చంద్రబాబు, పవన్, లోకేష్ ఉండేది, తినేది హైదరాబాదులో
- అక్కడ కూర్చుని ఏపీలో రాజకీయాలు చేయటం ఏంటి?
- ఈ ఎన్నికల తర్వాత వారు ఈవైపు ఇక కన్నెత్తి కూడా చూడరు
2:00 PM, డిసెంబర్ 28, 2023
YSRCP ప్రభుత్వం అంటే విశ్వసనీయతకు మారుపేరు : సీఎం జగన్
- జిల్లా కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ వీడియోకాన్ఫరెన్స్
- జనవరిలో 3, ఫిబ్రవరిలో ఒక కార్యక్రమం చేస్తున్నాం
- జనవరి 1 నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక రూ.3 వేలకు పెంపు
- రూ.3 వేలకు పెన్షన్ పెంచుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేరుస్తున్నాం
- విశ్వసనీయతకు ఈ ప్రభుత్వం మారు పేరు అని రుజువు చేస్తున్నాం
- జనవరి 1 నుంచి 8 వరకూ పెన్షన్ల పెంపు కార్యక్రమం ఉంటుంది
- గత ప్రభుత్వంలో పెన్షన్ కేవలం రూ.1000 మాత్రమే ఇచ్చేవారు
- మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.2,250లు చేశాం
- ఇప్పుడు రూ.3 వేల వరకూ పెంచుకుంటూ వచ్చాం : సీఎం వైఎస్ జగన్
- జనవరి 19న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం
- జనవరి 23 నుంచి 31 ఆసరా కార్యక్రమం జరుగుతుంది
- YSR చేయూత కార్యక్రమం ఫిబ్రవరి 5 నుంచి 14వరకూ కొనసాగుతుంది
- అర్హత ఉండీ ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోయిన సందర్భాల్లో వారికి పథకాలు వర్తింపు చేసే బై యాన్యువల్ కార్యక్రమం జనవరి 5న జరుగుతుంది
- ఈ కార్యక్రమం జరిగే లోపే దాదాపు 1.7 లక్షల పెన్షన్లు ఒకటో తారీఖు నుంచే ఇస్తారు
- 66,34,742మందికి రూ.1968 కోట్లకుపైగా పెన్షన్ల రూపంలో అందుతాయి
- పెన్షన్ల పెంపు కార్యక్రమంలో భాగంగా నేను 3వ తారీఖున కాకినాడలో పాల్గొంటున్నాను
- ఎమ్మెల్యేలు ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి
- 8 రోజులపాటు పెంచిన పెన్షన్లతో పెన్షన్ కానుక కార్యక్రమం జరుగుతుంది
- అక్క చెల్లెమ్మలకు తోడు ఉండే ప్రభుత్వం మనది
- ఆసరా కోసమే రూ.25,570 కోట్లు వెచ్చించాం
- మూడు విడతలుగా ఇప్పటికే రూ.19,,195 కోట్లు ఇచ్చాం
- చివరి విడతగా 6,394 కోట్లు ఇస్తున్నాం
- జనవరి 23 నుంచి 31వ తారీఖు వరకూ కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది
- ఈ కార్యక్రమం ద్వారా 78.94 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారు
- పెన్షన్ కానుక, ఆసరా, చేయూత లబ్ధిదారుల విజయగాధలను వీడియోల రూపంలో పంపాలి
- పంపిన వాటిలో అత్యుత్తమమైన వాటికి బహుమతులు
- సచివాలయాల స్థాయిలో రూ.10వేలు, మండల స్థాయిలో రూ.15వేలు, నియోజకవర్గ స్థాయిలో రూ.20వేలు, జిల్లా స్థాయిలో రూ.25వేలు బహుమతులు
- ఫిబ్రవరి 15-16 తేదీల్లోనే ఉత్తమ సేవలు అందించినందుకు వాలంటీర్లకు సేవామిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులు
- ఫిబ్రవరి 5 నుంచి 14వరకూ వైయస్సార్ చేయూత కార్యక్రమం
- ఇప్పటివరకూ రూ.14,129 కోట్లు ఇచ్చాం
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో 45 ఏళ్ల పైబడ్డ ఉన్న మహిళలకు ఏడాదికి రూ.18,750లు ఇచ్చాం
- యూనిక్ లబ్ధిదారులు 31,23,466 మంది ఉన్నారు
- ఈ పథకం వారి జీవితాల్లో ఏరకంగా మార్పులు తీసుకు వచ్చిందో తెలియజెప్పాలి
- చివరి విడతద్వారా 26,39,703 మంది లబ్ధి పొందుతున్నారు
1:52 PM, డిసెంబర్ 28, 2023
మ్యానిఫెస్టో మాయంపై ఎట్టకేలకు నోరు విప్పిన అచ్చెన్న
- 2014లో అధికారంలోకి రాగానే మ్యానిఫెస్టో మాయం చేసిన టిడిపి
- తెలుగుదేశం వెబ్‌సైట్‌తో పాటు పార్టీకి సంబంధించిన అన్నిచోట్ల మ్యానిఫెస్టో మాయం
- ఇచ్చిన ఏ హామీని సక్రమంగా నెరవేర్చకుండా పదవీ కాలం పూర్తి చేసిన చంద్రబాబు
- ఇప్పుడు మళ్లీ మ్యానిఫెస్టో అంశాన్ని గుర్తు చేసిన అచ్చెన్నాయుడు
- తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కనబడకుండా చేశామని చెబుతున్నారు
- ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ ఓపెన్ చేస్తే టీడీపీ మేనిఫెస్టో ఉంటుంది : అచ్చెన్నాయుడు
- మరి తెలుగుదేశం వెబ్‌సైట్‌లో ఎందుకు లేదు? : YSRCP
- ఏ దురుద్దేశంతో మ్యానిఫెస్టో మాయం చేశారు? : YSRCP
- అవకాశం దొరికితే ఎన్నికల సంఘం వెబ్‌సైట్ నుంచి కూడా మాయం చేస్తారా? : YSRCP
1:33 PM, డిసెంబర్ 28, 2023
అయినా.. తీరు మారలేదు
- బెంగుళూరులో ఐటీ ఉద్యోగులను కలిసిన చంద్రబాబు
- ఇన్నేళ్లయినా తీరు మారకుండా క్రెడిట్ తీసుకునే ప్రయత్నం
- నేను సాధారణ కుటుంబం నుంచి వచ్చాను
- అప్పట్లో మా ఊరిలో కరెంట్ లేదు..రోడ్లు లేవు
- రైతు కుటుంబంలో పుట్టి ఐటీని తీసుకొచ్చాను
- తెలుగుదేశం ప్రచారంలో కలవండి
- ఎన్నికలప్పుడు బెంగళూరు నుంచి ఊళ్లకు వచ్చి ఓటేయండి
- ఏ దేశానికి వెళ్లిన ఐటీలో తెలుగువారు ఉంటారు
- నా కొత్త నినాదం థింగ్ గ్లోబల్లీ యాక్ట్ గ్లోబల్లీ
- అదే నా విజన్..అదే నా మిషన్
- గతంలో ఆడపిల్లలపై శ్రద్ధ చూపేవారు కాదు
- ఇప్పుడు వరకట్నం పోయింది..రివర్స్ ఇచ్చే పరిస్ధితి వచ్చింది
- మన కుటుంబ వ్యవస్ధ ప్రపంచానికి ఆదర్శం
- నేను వస్తే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్‌నర్‌షిప్ తీసుకొస్తా
1:13 PM, డిసెంబర్ 28, 2023
చంద్రబాబు ఏం చేయాలి? : టిడిపిలో సమాలోచనలు
- మొన్నటి దాకా అన్ని రకాల ఆరోగ్య సమస్యలు కోర్టుకు చెప్పిన చంద్రబాబు
- ఎన్నికలు దగ్గరపడుతున్నాయి కాబట్టి మరో ప్రత్యామ్నయం లేక ఇబ్బందులు
- లోకేష్‌పై ఇంకా పూర్తి నమ్మకం వ్యక్తం చేయని పార్టీ
- చంద్రబాబుతోనే అన్ని చోట్ల సభలు పెట్టాలని టిడిపి నిర్ణయం
- జనవరిలో చంద్రబాబు షెడ్యూల్ ఖరారు చేస్తున్న టీడీపీ
- జనవరి 5 నుంచి 25 పార్లమెంట్ స్థానాల్లో 25 బహిరంగ సభలు
- రోజుకు 2 బహిరంగసభలు నిర్వహించేలా రూట్ మ్యాప్
- ఈ నెలాఖరులోగా 25 బహిరంగ సభలు పూర్తి చేయాలని నిర్ణయం
- ఈ 25 సభలు కాకుండా మరో 2 భారీ బహిరంగ సభలకు టీడీపీ ప్లాన్
12:37 PM, డిసెంబర్ 28, 2023
లోకేష్ అరెస్ట్‌కు అనుమతివ్వండి: సీఐడీ
- ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్‌పై విచారణ
- లోకేష్‌ను అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలన్న సీఐడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ
- రెడ్ బుక్ పేరుతో దర్యాప్తు అధికారులను బెదిరించేలా లోకేష్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్
- సీఐడీ పిటిషన్‌పై ఈరోజు కోర్టులో విచారణ
- తదుపరి విచారణ జనవరి 9కి వాయిదా వేసిన ఏసీబీ కోర్ట్
- నారా లోకేష్‌కు వ్యక్తిగతంగా నోటీసులివ్వాలని ఏసీబీ కోర్టు ఆదేశం
11:37 AM, డిసెంబర్ 28, 2023
మళ్లీ జగన్ ప్రభుత్వమే వచ్చేది.. ఇది ఫిక్స్: దేవినేని అవినాష్
- కొండ ప్రాంత వాసులకు ఇళ్ళ పట్టాలివ్వకుండా మోసం చేసింది టిడిపి
- అంగన్వాడి, పారిశుద్ధ్య ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం న్యాయం చేస్తుంది
- ప్రతిపక్ష నేతల చెప్పుడు మాటలు విని వారి మాయలో పడకండి
- జగన్ ప్రభుత్వాన్ని విమర్శించటం తప్ప.. వాళ్లేం చేశారో చెప్పుకోలేని స్థితిలో టీడీపీ
- వైఎస్సార్‌సీపీ ఇన్చార్జిల మార్పులపై టీడీపీ అనవసర రాద్ధాంతం
- ముందు మీ పార్టీ నేతలు కార్యకర్తలని కాపాడుకోండి
- టీడీపీ జనసేనలకు పార్టీలకు ముందుంది ముసళ్ళ పండగ
- జగన్ ప్రభుత్వం విజయం పై ప్రజలు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు
- జగన్ ప్రభుత్వ పథకాలపై సిగ్గులేని టీడీపీ నేతలు.. తోక పత్రికల ద్వారా విష ప్రచారం
- పత్రికలు కూడా వాస్తవాలు గ్రహించి నిజాలు ప్రచురించాలి
11:15 AM, డిసెంబర్ 28, 2023
నేడు 35వ రోజు సామాజిక సాధికార యాత్ర
- రాయచోటి, పెనమలూరు నియోజకవర్గాల్లో బస్సుయాత్ర
- అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర
- మధ్యాహ్నం 12 గంటలకు అభి కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ నేతల ప్రెస్ మీట్
- కళ్యాణ మండపం నుంచి శివాలయం చెక్ పోస్ట్ వరకు బైక్ ర్యాలీ
- శివాలయం చెక్ పోస్ట్ నుంచి బంగ్లా సర్కిల్ వరకు పాదయాత్ర
- బంగ్లా సర్కిల్ లో బహిరంగ సభ
- హాజరుకానున్న డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మత్రి విడదల రజినీ, ఎంపీ నందిగం సురేష్, మాజీ మంత్రి అనిల్, విప్ కొరముట్ల శ్రీనివాసులు
- కృష్ణా జిల్లా పెనమలూరులో మాజీ మంత్రి కొలుసు పార్ధసారధి ఆధ్వర్యంలో బస్సుయాత్ర
- మధ్యాహ్నం 2 గంటలకు తాడిగడపలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్
- కంకిపాడులో అయాన్ కన్వెన్షన్ వరకూ భారీ బైక్, కార్ల ర్యాలీ
- మధ్యాహ్నం 3:30 గంటలకు అయాన్ కన్వెన్షన్ నుంచి బస్సుయాత్ర ప్రారంభం
- సాయంత్రం 4:30 గంటలకు కంకిపాడు బస్టాండ్ వద్ద బహిరంగ సభ
- హాజరుకానున్న రీజనల్ కో ఆర్డినేటర్లు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, మంత్రులు జోగిరమేష్, మేరుగు నాగార్జున
11:12 AM, డిసెంబర్ 28, 2023
ఎన్నికల వేళ.. జనాన్ని ఎలా ఒప్పిద్దాం?
- జనవరి 5 నుంచి జిల్లాలకు చంద్రబాబు
- ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేయడానికి ప్రయత్నాలు
- జనవరి 11న నరసరావుపేటలో పవన్ తో కలిసి ఉమ్మడి సభ
- జనసేనతో పొత్తుపై పార్టీ నేతలతో మాట్లాడుతోన్న చంద్రబాబు
- పార్టీ మీటింగ్‌లలో ఇప్పటికే ఓ స్పష్టత ఇస్తోన్న చంద్రబాబు
- మరోసారి ఓడిపోతే ఏపీకి రానంటూ క్లారిటీ ఇస్తోన్న చంద్రబాబు
11:10 AM, డిసెంబర్ 28, 2023
వ్యూహం సినిమా @ హైకోర్టు
- వ్యూహం సినిమా పై హైకోర్టులో విచారణ
- వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని కోరిన నారా లోకేష్
- చంద్రబాబు, పవన్, లోకేష్ లను కించపరిచేలా సన్నివేశాలున్నాయని పిటిషన్
- వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం పడుతుందని పిటిషనర్ తరఫు వాదనలు
- గత విచారణలో స్టే ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు
- నేడు నిర్మాత, డైరెక్టర్ తరఫు వాదనలు విననున్న న్యాయస్థానం
- వాదనల తర్వాత సినిమా విడుదలపై నిర్ణయం ప్రకటించనున్న హైకోర్టు
- రేపు వ్యూహం సినిమా విడుదలకు సిద్ధమైన చిత్ర యూనిట్
11:00 AM, డిసెంబర్ 28, 2023
ఎవరు పార్టీని వీడినా ఇబ్బందేమీలేదు: వైవీ సుబ్బారెడ్డి
- ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన రాజీనామా చేసి వెళ్తున్నారంటే దానికి వారే సమాధానం చెప్పాలి.
- ఎంతమంది నాయకులు ఉన్నా బీసీలకు న్యాయం చేయాలని వంశీకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చాము.
- పార్టీ నుంచి ఎవరు వెళ్లిన మాకు ఇబ్బంది లేదు.
- ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్ళీ సీఎం అవుతారు.
- పవన్, చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన మా నాయకుడికి తిరుగులేదు.
- సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి చూసి మళ్లీ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు.
- ఎక్కడైతే పార్టీ పరిస్థితి బాగోలేదు అక్కడే ఇన్‌చార్జీలను మార్చాము.
- మేము 175 కి 175 టార్గెట్ పెట్టుకున్నాము
- అందులో భాగంగానే ఈ మార్పులు జరుగుతున్నాయి.
- ఎక్కడ అయితే అభ్యర్థులను మారుస్తున్నామో అక్కడ ముందు పనిచేసిన నాయకులు సహకరించాలని సీఎం చెప్పారు.
- కోర్ట్ పరిధిలో ఇబ్బందులు వల్ల రాజధాని మార్చడం ఆలస్యం అయింది.
- తప్పకుండా సీఎం జగన్ విశాఖ నుంచి పాలన సాగిస్తారు.
10:44AM, డిసెంబర్ 28, 2023
రోడ్ల మరమ్మత్తులకు ఎవరి పాలనలో ఏం చేశారు?
- బాబు హయాంలో(5 ఏళ్లలో)-రూ.2,954 కోట్లు
- జగన్ ప్రభుత్వంలో(4 ఏళ్లలో)-రూ.4,149 కోట్లు
రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణానికి..
- బాబు హయాంలో(5 ఏళ్లలో)-రూ.4,325 కోట్లు
- జగన్ ప్రభుత్వంలో(4 ఏళ్లలో)-రూ.7,340 కోట్లు
పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణానికి
- బాబు హయాంలో(5 ఏళ్లలో)-రూ.3,160 కోట్లు
- జగన్ ప్రభుత్వంలో(4 ఏళ్లలో)-రూ.5,444 కోట్లు
జాతీయ రహదారుల నిర్మాణానికి..
- బాబు హయాంలో(5 ఏళ్లలో)-రూ.14,353 కోట్లు
- జగన్ ప్రభుత్వంలో(4 ఏళ్లలో)-రూ.25,304 కోట్లు
రోడ్ల నిర్మాణం, నిర్వహణకు చేసిన మొత్తం ఖర్చు
- బాబు హయాంలో(5 ఏళ్లలో)-రూ.24,792 కోట్లు
- జగన్ ప్రభుత్వంలో(4 ఏళ్లలో)-రూ.42,236 కోట్లు
రోడ్ల నిర్మాణం, నిర్వహణకు చేసిన సరాసరి ఖర్చు
- బాబు హయాంలో (5 ఏళ్లలో)-రూ.4,958 కోట్లు
- జగన్ ప్రభుత్వంలో(4 ఏళ్లలో)-రూ.10,559 కోట్లు
బాబు కంటే 2 రెట్లు ఎక్కువ ఖర్చు
- రూ.1,120 కోట్లతో 3,448 కిలోమీటర్ల మేర రోడ్లను పునరుద్ధరణ
- తీరప్రాంత జిల్లాల్లో రూ.768 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధులతో 2,294 కి. మీ. మేర రోడ్లను పునరుద్ధరణ
- తీరప్రాంతం లేని జిల్లాల్లో రూ.352 కోట్ల ఆర్ఎస్ఐ డీఎఫ్ నిధులతో 1,154 కి.మీ. మేర పునరుద్ధరణ
- 339 రోడ్లను 'హై ప్రయారిటీ' రోడ్లుగా గుర్తింపు
రోడ్ల పునరుద్ధరణకు 2017–18లో తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణాన్ని కూడా ఎన్నికల ప్రయోజనాల కోసం ‘పసుపు–కుంకుమ’ పథకానికి మళ్లించాడు చంద్రబాబు
10:44AM, డిసెంబర్ 28, 2023
ఎన్నికలొస్తున్నాయి.. ఏం చేద్దాం.?
- కాకినాడలో పార్టీ అంతర్గత సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోన్న పవన్ కళ్యాణ్
- కాకినాడ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యులతో సమావేశం
- తర్వాత కాకినాడ నగర కమిటీతో సమావేశం
- మూడు రోజుల పాటు కాకినాడలోనే సిట్టింగ్
- పార్టీ అంతర్గత సమావేశాలు కాబట్టి మీడియా రావొద్దని సూచన
- పొత్తులో భాగంగా టికెట్లు ఇవ్వలేకపోయిన నేతలను బుజ్జగిస్తున్నట్టు సమాచారం
- టికెట్ త్యాగం చేయండి, గెలిచిన తర్వాత నామినేట్ పోస్టుకు ప్రయత్నిస్తా
- తెలుగుదేశం సభలకు వెళ్లి జై కొట్టాలని సూచన
10:33AM, డిసెంబర్ 28, 2023
పవన్ కళ్యాణ్‌కు అంత గొప్ప రికార్డు ఉందా?
- 2019 ఎన్నికల్లో 136 నియోజకవర్గాల్లో పోటీచేసిన జనసేన
- ఒక్క స్థానంతో సరిపెట్టుకున్న పవన్ కళ్యాణ్ పార్టీ
- పవన్ కల్యాణ్ తాను పోటీచేసిన రెండు నియోజకవర్గాలు భీమవరం, గాజువాకలలో ఓటమి
- ఓ పార్టీ అధినేత రెండుస్థానాల్లో పోటీచేసి రెండింటిలోనూ ఓడిపోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి
- 2009లో తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల్లో పోటీచేసిన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి.. తిరుపతిలో గెలిచి పాలకొల్లులో ఓడిపోయారు
- 1989లో టీడీపీ అధ్యక్షుడు ఎన్టీ రామారావు హిందూపూర్, వనపర్తి (తెలంగాణాలోని మహబూబ్‌నగర్ జిల్లా)లలో పోటీచేయగా.. హిందూపూర్‌లో గెలిచి వనపర్తిలో ఓడిపోయారు
- 2019లో పవన్ కల్యాణ్ రెండు నియోజకవర్గాల్లోనూ ఓడిపోవడం గమనార్హం.
10:06AM, డిసెంబర్ 28, 2023
2019లో TDP ఫ్యామిలీ ప్యాకేజీలు గల్లంతు
- డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఎన్నికల్లో పోటీ చేయకుండా తన కుమారుడు కేఈ శ్యాంబాబును పత్తికొండ నుంచి సోదరుడు కేఈ ప్రతాప్‌ను డోన్ నుంచి బరిలోకి దించారు. వారిద్దరూ వైఎస్సార్‌సీపీ ముందు నిలవలేకపోయారు.
- భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి.. నంద్యాల నుంచి ఆమె సోదరుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీ తరఫున పోటీ చేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల చేతిలో పరాజయం పాలయ్యారు.
- నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి జనసేన తరఫున నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి.. ఆయన అల్లుడు, కుమార్తెలు నంద్యాల, శ్రీశైలం, బనగానపల్లె శాసనసభ స్థానాల నుంచి పోటీ చేశారు. పోలింగ్ అయ్యాక ఎస్పీవై రెడ్డి మరణించారు. కానీ.. ఆ ఫ్యామిలీ మొత్తం ఓడింది.
- జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయులు జేసీ పవన్‌కుమార్‌రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిని టీడీపీ తరఫున బరిలోకి దిగి ఓటమి చవిచూశారు.
- సినీ నటుడు బాలకృష్ణ పెద్ద అల్లుడు నారా లోకేష్ మంగళగిరి నుంచి.. చిన్న అల్లుడు భరత్ విశాఖ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు.
- నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి బొల్లినేని రామారావు, ఆత్మకూరు నుంచి ఆయన సోదరుడు కృష్ణయ్య టీడీపీ తరఫున బరిలోకి దిగి ఓడిపోయారు.
- మంత్రి గంటా శ్రీనివాసరావు.. మరో మంత్రి పి.నారాయణ, భీమవరం మాజీ ఎమ్మెల్యే పూలపర్తి రామాంజనేయులు వియ్యంకులు. గంటా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఓటమి అంచున ఉన్నారు. నెల్లూరు, భీమవరం నుంచి పోటీ చేసిన ఆయన ఇద్దరు వియ్యంకులు ఓటమిపాలయ్యారు.
- విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన అశోక్ గజపతిరాజు, విజయనగరం శాసనసభ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన కుమార్తె అథితి ఓడిపోయారు.
9:36AM, డిసెంబర్ 28, 2023
పక్క పార్టీ అభ్యర్థులను లాక్కుంటే.. అథోగతే.. చరిత్ర చూడండి ఒక సారి.!
- 2019లో YSRCP నుంచి 23 మంది ఎమ్మెల్యేలను లాక్కున్న చంద్రబాబు
- ఇద్దరు మృతి, ఆరుగురికి వెన్నుపోటు, 15 మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన చంద్రబాబు
- పాపాలకు ఫలితం అనుభవించిన 23 మంది ఫిరాయింపుదారులు
- ఎన్నికల్లో నలుగురిని గట్టెక్కించలేకపోయిన మంత్రి పదవులు
- నలుగురు మంత్రులు ఆదినారాయణరెడ్డి, భూమా అఖిలప్రియ, సుజయకృష్ణ రంగారావు, అమర్‌నాథ్‌రెడ్డిలు ఘోర పరాజయం
- పాతపట్నంలో కలమట వెంకట రమణ, పాడేరులో గిడ్డి ఈశ్వరి, జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ ఓటమి
- రంపచోడవరంలో వంతల రాజేశ్వరి, పామర్రులో ఉప్పులేటి కల్పన, విజయవాడ పశ్చిమలో జలీల్‌ఖాన్ కుమార్తె షబానా ఖాతూన్ ఓటమి
- కందుకూరులో పోతుల రామారావు, గిద్దలూరులో అశోక్‌రెడ్డి, గూడూరులో సునీల్‌కుమార్, శ్రీశైలంలో బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ఓటమి
- ఆదినారాయణరెడ్డికి కడప ఎంపీ సీటివ్వగా ఓటమి
- ఫిరాయింపులకు వ్యతిరేకంగా తిరుగులేని పోరాటం చేసిన జగన్‌మోహన్‌రెడ్డి
- ఫిరాయింపుదారులపై వేటు వేయకుండా కాపాడి చంద్రబాబు పట్ల స్వామిభక్తిని చాటుకున్న నాటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు
9:00AM, డిసెంబర్ 28, 2023
మంగళగిరి నుంచే మళ్లీ పోటీ చేస్తా : నారా లోకేష్ బాబు నాయుడు
- మంగళగిరి నియోజకవర్గాన్ని విడిచి పెట్టలేదు : లోకేష్
- ప్రజలు నాకు పరీక్ష పెట్టారనుకున్నా
- మంగళగిరి ప్రజలు నాలో కసి పెంచారు
- ఆ కసితో మంగళగిరి కోసం ముందుకెళ్తున్నా
2019లో ఏం జరిగింది?
- 2019 వరకు ఎమ్మెల్యేగా పోటీ చేయని లోకేష్
- ఎమ్మెల్సీగా నామినేట్ అయి దొడ్డిదారిన మంత్రి అయిన లోకేష్
- 2019లో మంత్రి హోదాలో మంగళగిరి బరిలో దిగిన లోకేష్
- అప్పటికే అమరావతి పేరిట భ్రమరావతిని ప్రజలపై రుద్దిన చంద్రబాబు
- ఓ వైపు రాజధాని ప్రచారం, మరోవైపు గ్రాఫిక్స్ మాయాజాలం
- తనయుడి విజయం తథ్యమన్నట్టుగా సాగిన చంద్రబాబు తీరు
- 2019 ప్రచారంలో లోకేష్ ప్రధాన నినాదం : సీమాంధ్రను సింగపూర్ చేస్తాం
- అమలు కాని హామీలపై ఓటర్లు ప్రశ్నించినప్పుడు ఇబ్బంది పడ్డ లోకేష్
- రుణమాఫీ, పసుపు–కుంకుమ చెక్‌లపై ఓటర్లను ఒప్పించలేకపోయిన లోకేష్
- అలవాటులో పొరపాటుగా ఏప్రిల్ 9న తనకు ఓటేయాలని బహిరంగ సభలో ప్రకటించిన లోకేష్ (ఎన్నికలు జరిగింది ఏప్రిల్ 11, 2019)
2019: మంగళగిరిలో నారా లోకేష్‌కు షాక్, 5270 ఓట్ల తేడాతో ఓటమి
8:15AM, డిసెంబర్ 28, 2023
నేడు 35వ రోజు సామాజిక సాధికార యాత్ర
- రాయచోటి, పెనమలూరు నియోజకవర్గాలలో జరగనున్న బస్సుయాత్ర
- అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర
- మధ్యాహ్నం 12 గంటలకు అభి కళ్యాణ మండపంలో వైస్సార్‌సీపీ నేతల విలేకరుల సమావేశం
- అనంతరం కల్యాణ మండపం నుంచి శివాలయం చెక్ పోస్ట్ వరకు బైక్ ర్యాలీ
- శివాలయం చెక్ పోస్ట్ నుంచి బంగ్లా సర్కిల్ వరకు పాదయాత్ర
- బంగ్లా సర్కిల్‌లో బహిరంగ సభ
- హాజరుకానున్న డిప్యూటి సీఎం అంజాద్ బాష, మంత్రులు విడుదల రజినీ, ఎంపీ నదిగం సురేష్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, విప్ కొరముట్ల శ్రీనివాసులు తదితరులు
- కృష్ణాజిల్లా పెనమలూరులో మాజీ మంత్రి కొలుసు పార్ధసారధి ఆధ్వర్యంలో జరగనున్న బస్సుయాత్ర
- మధ్యాహ్నం రెండు గంటలకు తాడిగడపలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ నేతల ప్రెస్ మీట్
- అనంతరం కంకిపాడులో అయాన్ కన్వెన్షన్ వరకూ భారీ బైక్, కార్ల ర్యాలీ
- మధ్యాహ్నం 3:30 గంటలకు అయాన్ కన్వెన్షన్ నుంచి బస్సు యాత్ర ప్రారంభం
- సాయంత్రం 4:30 గంటలకు కంకిపాడు బస్టాండ్ వద్ద బహిరంగసభ
- హాజరుకానున్న రీజనల్ కో ఆర్డినేటర్లు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మర్రిరాజశేఖర్, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, మంత్రులు జోగిరమేష్ , మేరుగ నాగార్జున తదితరులు
8:00AM, డిసెంబర్ 28, 2023
కుప్పంకు చంద్రబాబు పరుగులు
- సొంత నియోజకవర్గం కుప్పంకు చంద్రబాబు
- మూడు రోజుల పాటు కుప్పంలోనే బాబు
- ఓటమి భయంతో కుప్పంపై ఫోకస్ పెట్టిన చంద్రబాబు
7:00AM, డిసెంబర్ 28, 2023
ఎల్లో మీడియా తప్పుడు ప్రచారానికి చెక్..
- వాలంటీర్ల సమ్మె అంటూ ఎల్లో మీడియా చెత్త ప్రచారం
- వాలంటీర్లు సీరియస్
- మా మీద ఆరోపణలు చేసిన వాళ్లు ఇప్పుడు సానుభూతి చూపిస్తున్నట్టు నటన.
- మేము ఆందోళనలు చేస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
- ఇలాంటి అవాస్తవాలను నమ్మకండి: వాలంటీర్లు
మామీద అనేక రకాల ఆరోపణలు చేసినవాళ్ళే..ఇప్పుడు సానుభూతి చూపిస్తున్నట్లు నటిస్తున్నారు. మేము ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నామని దుష్ప్రచారం చేస్తున్నారు...ఇలాంటి అవాస్తవాలను నమ్మకండి. #APVolunteer#CMYSJagan#AndhraPradesh pic.twitter.com/ina335DoPU
— YSR Congress Party (@YSRCParty) December 27, 2023
6:45 AM, డిసెంబర్ 28, 2023
ఏం చేస్తే నమ్ముతారు? ఏం చెబితే వింటారు?
- ఎన్నికల వేళ తెలుగుదేశం మాయోపాయాలు
- జనాలకు చెప్పేందుకు నానా మాయమాటలు తయారీ
- వచ్చే నెల నుంచి భారీ బహిరంగ సభలకు ప్లాన్
- 25 పార్లమెంట్ స్థానాల్లో 25 బహిరంగ సభలు నిర్వహించే యోచన
- ప్రతి బహిరంగ సభకు లక్షమంది హాజరు అయ్యేలా పార్టీ ఇన్‌ఛార్జీలకు టార్గెట్‌లు
- లెక్క తప్పిందా.. సీటు దక్కదంటూ హెచ్చరికలు
6:35 AM, డిసెంబర్ 28, 2023
ఎవరు బయటకు వస్తారబ్బా.?
- సొంత బలం లేక పక్కచూపులు చూస్తోన్న తెలుగుదేశం, జనసేన
- YSRCP నుంచి ఎవరైనా వస్తారా అని ఎదురుచూపులు
- YSRCPలో టికెట్ దక్కని నేతల వెంట పడుతోన్న టిడిపి, జనసేన
- వైసిపి నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన వంశీకృష్ణ యాదవ్‌ను పార్టీలో చేర్చుకున్న పవన్ కళ్యాణ్
- మిగతా ప్రాంతాల్లోనూ అభ్యర్థులు దొరక్క అధికార పార్టీ వైపు చూపులు
స్కిల్ కేసులో ఏం జరిగిందంటే.?
- టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.371 కోట్లు కొల్లగొట్టిన వ్యవహారమే స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసు
- డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర ఏజెన్సీల గుర్తింపుతో వెలుగులోకి
- 2017-2018లో నకిలీ ఇన్‌వాయిస్‌లతో బయటపడ్డ అక్రమం
- వేర్వేరు రాష్ట్రాలు, ఇతర దేశాలతోనూ ఈ కుంభకోణానికి లింకులు
- అప్రమత్తం చేసినా.. అప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబే కాబట్టి పట్టించుకోని వైనం
- ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే ప్రధాన సూత్రధారి, లబ్ధిదారు అని సీఐడీ అభియోగాలు
- కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరిన బ్యాంకు స్టేట్‌మెంట్లు, రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడీ
- ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ.. పలువురి అరెస్ట్ కూడా
- షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు
- చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామంటూ ఘరానా మోసం
- రూ.3,300 కోట్లకు సీమెన్స్ సంస్థ - డిజైన్‌టెక్ సంస్థలు ఒప్పందం
- ప్రభుత్వం 10 శాతం నిధులు ఇస్తే, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం జరిగిందని మోసం
- రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 శాతం వాటాగా జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లను విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం
- ప్రభుత్వం చెల్లించిన రూ.371 కోట్లలో రూ.240 కోట్ల రూపాయలను సీమెన్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్‌టెక్ సంస్థకు బదలాయించారని సీఐడీ అభియోగం
- ఎలైట్ కంప్యూటర్స్, స్కిల్లర్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, నాలెడ్జ్ పోడియం, ఈటీఏ- గ్రీన్స్, కేడన్స్ పార్టనర్ తదితర షెల్ కంపెనీలకు నిధుల మళ్లింపు
- ఈ కుంభకోణం 2016- 2018 మధ్య జరిగింది. దీనిపై గతంలోనే ఏసీబీకి పలువురు ఫిర్యాదు చేశారు
- ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు
- చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు
- సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెఓంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు
- కోర్టుల విచారణలో కీలక ఆధారాలను సమర్పించిన సీఐడీ