AP Political News Jan 10th: పొలిటికల్‌ అప్‌డేట్స్‌ | AP Elections Political News Updates And Headlines 10th Jan 2024 Telugu | Sakshi
Sakshi News home page

AP Political News Jan 10th: పొలిటికల్‌ అప్‌డేట్స్‌

Published Wed, Jan 10 2024 6:47 AM | Last Updated on Sat, Feb 3 2024 1:31 PM

AP Elections Political News Updates And Headlines 10th Jan 2024 Telugu - Sakshi

AP Elections Political Latest Updates Telugu..

05:33 PM, జనవరి 10, 2024
రెండు చోట్లా ఓటు ఉంటే క్రిమినల్ చర్యలు: సీఈసీ రాజీవ్ కుమార్

  • ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశ లోను రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేస్తాం
  • ప్రతి ఒక్క ఓటరు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలి
  • ఓటర్ల తొలగింపు, నమోదు పూర్తిగా తనిఖీ చేసి చేపట్టాం
  • ఇంకా ఏమైనా ఉంటే..ప్రతి కేసు కి మేము పార్టీలకు లిఖితపూర్వకంగా అందిస్తాం
  • ఏపీ, తెలంగాణలలో ఒకేసారి ఎన్నికలు పెట్టమని కొన్ని పార్టీలు కోరారు
  • ఎవ్వరైనా ఒక్క చోట మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండాలి
  • ఎక్కడ నివసిస్తే అక్కడే ఓటు ఉండాలి అంటే.. పుట్టిన ఊరు, సొంత గ్రామం అని కాదు, ఎక్కడ నివసిస్తే.. అక్కడ అని అర్థం
  • రెండు చోట్లా ఉంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం.. కేసు నమోదు అవుతుంది
  • తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్ళు..ఏపీలో ఓటు కోసం ఎలా దరఖాస్తు చేస్తారు?
  • ఏపీలో ఆస్తులు ఉన్నంత మాత్రాన.. ఏపీలో నివాసం  ఉండకుండా ఉంటే ఓటు ఇవ్వలేం
  • తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం


05:25 PM, జనవరి 10, 2024
విమానాలు కూడా తనిఖీ చేస్తాం: సీఈసీ రాజీవ్ కుమార్  

  • ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నికల్లో ఉత్సాహం గా పాల్గొనాలి 
  • పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్ల పై సమీక్షించాం
  • మొట్ట మొదటి సమీక్ష, పర్యటన ఆంధ్రప్రదేశ్ లోనే చేశాం
  • ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం
  • ఓటర్ల అందరూ ఎన్నికల్లో పాల్గొనేలా చేయాలన్నదే మా లక్ష్యం
  • జాతీయ, ప్రాంతీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడాం
  • డబ్బు పంపిణీ ని నియంత్రించాలని కోరారు
  • ఓటర్ల జాబితా లో బల్క్ గా ఓటర్ల తొలగింపు పై చర్యలు తీసుకోవాలని కోరారు
  • ఓటర్ల జాబితా ను డౌన్ లోడ్ చెసి యాప్ ల పై చర్యలు తీసుకోవాలని కోరారు
  • ఇతర రాష్ట్రాల్లో ను, ఇక్కడ ఓటు ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు
  • రాజకీయ పార్టీలు ఇచ్చిన సూచనలపైన సమీక్ష చేశాం
  • పారదర్శకంగా ఉండాలని అధికారులకు అదేశాలిచ్చాం
  • అధికారులు, పోలీసు, ఇతర యంత్రంగం అందరికి గట్టిగా చెప్పాము
  • తొలగించిన ఓట్ల పై పూర్తి స్థాయిలో విచారించాం 
  • పండగ వాతావరణంలో ఓటింగ్ జరిగేలా ప్రత్యేక పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేస్తాం
  • సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తాం
  • ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా ఓటర్ల కు సహాయం అందిస్తాం
  • అభ్యర్థుల కోసం తెలుసుకునేలా సమాచారాన్ని అందిస్తాం
  • 139 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు
  • డబ్బు, మద్యం పంపిణీ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటాం
  • విమానాలు కూడా తనిఖీలు చేస్తాం
  • జిల్లా అధికారులు నిష్పాక్షికంగా, పారదర్శకంగా ఉండాలని అదేశించాం
  • సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

05:15 PM, జనవరి 10, 2024
ఏపీ ఓటర్‌ లిస్ట్‌పై సీఈసీ కీలక ప్రకటన

  •  ఈ ఏడాది ఎంపీ, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి 
  •  ఎన్నికల సందర్భంగా తొలుత ఆంధ్రప్రదేశ్ సందర్శిస్తున్నాం 
  • ఎన్నికల సందర్భంగా సంప్రదింపులు జరుగుతున్నాయి 
  • ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఓటర్లను కోరుతున్నాం 
  • ఎన్నికలు స్వేచ్చాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహిస్తాం 
  • నిన్న విజయవాడ లో పార్టీలతో సమావేశం నిర్వహించాం 
  • ఓటర్ల జాబితా లో మార్పులపై కొన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి 
  • పారామిలిటరీ బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని ఓ పార్టీ కోరింది 
  • ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నియంత్రించాలని కొన్ని పార్టీలు కోరాయి 
  • ఏపీ, తెలంగాణ రెండు చోట్లా కొందరు ఓట్లు నమోదు చేసుకున్న అంశాన్ని ఓ పార్టీ ప్రస్తావించింది 
  • అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పిస్తాం 
  • ఏపీలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు 
  • ఈ నెల 22న ఓటర్ల తుది జాబితా ప్రచురణ 
  • మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటం శుభపరిణామం 
  • మహిళా ఓటర్లు 2.07 కోట్లు, పురుష ఓటర్లు 1.99 కోట్ల మంది ఉన్నారు 
  • ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు 5.8 లక్షల మందికి అవకాశం 
  • వంద ఏళ్లు దాటిన వృద్ధులు 1174 మంది ఉన్నారు 
  • తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య 7.88 లక్షలు 
  • గతంలో 20 లక్షలకు పైగా ఓట్లను తొలగించారు 
  • అందులో 13 వేల ఓట్లను అక్రమంగా తొలగించినట్టు గుర్తించాం 
  • అక్రమంగా తొలగించినట్టు తేలిన ఓట్లను పునరుద్ధరించాం 
  • రాష్ట్రంలో 46,165 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి 
  • సగటున ఒక్కో పోలింగ్ కేంద్రం పరిథిలో 870 మంది ఓటర్లు 
  • కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 1500 వరకు ఓట్లు ఉన్నాయి 
  • 70 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సౌకర్యం ఉంది : కేంద్ర ఎన్నికల సంఘం
  • ఏపీలో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తాం: కేంద్ర ఎన్నికల సంఘం

04:55 PM, జనవరి 10, 2024
కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

  • ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ముగిసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని భేటీ
  • భేటీ అనంతరం మీడియాతో నాని సంచలన వ్యాఖ్యలు
  • సీఎం జగన్‌ పేదల పక్షపాతి
  • రాజీనామా తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరాలని నిర్ణయించుకున్నా 
  • సీఎం జగన్‌తో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నా
  • సీఎం జగన్‌ ఏ బాధ్యత అప్పగిస్తే దానిని నిర్వర్తిస్తా
  • చంద్రబాబు కొడుకుగా తప్పించి లోకేష్‌కు ఏ అర్హత లేదు
  • విజయవాడ పట్ల చంద్రబాబుకి చిత్త శుద్ధి లేదు
  • విజయవాడ అంటే నాకు ఎంతో ప్రేమ
  • టీడీపీపై కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు 
  • నా విషయంలో టీడీపీ ప్రోటోకాల్‌ విస్మరించింది
  • ఇష్టానుసారం నన్ను తిట్టినా పట్టించుకోలేదు
  • నన్ను చాలా రకాలుగా అవమానించారు
  • ఇష్టం లేకపోతే వెళ్లిపోతానని ఆనాడే చంద్రబాబుకి చెప్పా
  • అయినా నువ్వు ఉండాల్సిందేనని చంద్రబాబు పట్టుబట్టాడు
  • త్వరలో టీడీపీ ఖాళీ కాబోతోంది
  • ఎన్టీఆర్‌ జిల్లాలో 60 శాతం టీడీపీ ఖాళీ కాబోతోంది
  • చంద్రబాబు అంతటి పచ్చి మోసగాడు మరొకరు లేడు
  • అది ప్రపంచానికి తెలుసు
  • కానీ ఇంత పచ్చి మోసగాడు దగా చేస్తాడని అనుకోలేదు
  • కుటుంబాల మధ్య చిచ్చు పెట్టాడు
  • రాష్ట్రానికి పనికి రాని వ్యక్తి చంద్రబాబు
  • 2019లో నాకు సీటు ఇవ్వొద్దని చంద్రబాబు ప్రయత్నించారు 
  • 2014 -19 మధ్యలో బాబు విజయవాడకు ఒక్క పైసా ఇవ్వలేదు
  • టీడీపీ కోసం రూ.2 వేల కోట్లు ఖర్చు చేశా 
  • రాజీనామా ఆమోదించిన తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరతా

04:09 PM, జనవరి 10, 2024
సీఎం క్యాంప్‌ ఆఫీస్‌కు కేశినేని నాని

  • సీఎం జగన్‌తో ఎంపీ కేశినేని నాని భేటీ 
  • సీఎం క్యాంప్‌ కార్యాలయంలో కొనసాగుతున్న సమావేశం
  • నాని వెంట ఆయన కుమార్తె శ్వేత కూడా
  • ఇటీవలె టీడీపీకి రాజీనామా ప్రకటన చేసిన కేశినేని నాని
  • విజయవాడ 11వ డివిజన్‌ కార్పొరేటర్‌ పదవికి రాజీనామా చేసిన శ్వేత
  • వైఎస్సార్‌సీపీలో నాని చేరికను పరిశీలిస్తున్న టీడీపీ.. కాచుకుని కూర్చున్న బుద్ధా అండ్‌ కో
  • చేరితే.. వెంటనే విమర్శించేందుకు సిద్ధంగా ఉన్న ప్రత్యర్థులు

04:03 PM, జనవరి 10, 2024
పవన్‌తో అంబటి రాయుడు సుదీర్ఘ భేటీ

  • జనసేన కార్యాలయంలో క్రికెటర్ అంబటి రాయుడు
  • గుంటూరు రాజకీయ పరిణామాలు, పోటీ వ్యవహారం పై పవన్ తో అంబటి చర్చ 
  • సుమారు 2 గంటలకు పైగా పవన్ కల్యాణ్ తో భేటీ

03:15 PM, జనవరి 10, 2024
చంద్రబాబుకి ముందస్తు బెయిల్‌

  • మూడు కేసుల్లో చంద్రబాబు నాయుడికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
  • ఇసుక కేసు, మద్యం కేసు, ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ కేసులో అరెస్ట్‌ భయంతో ఉన్నత న్యాయస్థానం ఆశ్రయించిన టీడీపీ అధినేత
  • చంద్రబాబు తరపున సీనియర్ కౌన్సిలర్ సిద్ధార్ధ్ లూధ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు
  • రిజర్వ్‌ చేసిన తీర్పును ఇవాలళ మద్యాహ్నాం వెల్లడించిన హైకోర్టు
  • ఈ కేసుకు సంబంధించిన వివరాలేవీ మీడియా ముందు మాట్లాడొద్దని చంద్రబాబుకి ఆదేశాలు

1:39 PM, జనవరి 10, 2024
సంపాదించేదేమీ లేదట..!

  • రాజకీయాలపై దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిర్వేదం
  • భార్య పురందేశ్వరీ రాష్ట్ర బీజేపీకి అధ్యక్షురాలు
  • ఇప్పుడున్న పరిస్ధితిలో ఎన్నికలంటే బోలెడు ఖర్చు
  • రూ.30, 40 కోట్లు ఖర్చు పెడితే తప్ప గెలవలేరు
  • గెలిచినా ఎమ్మెల్యే సంపాదించుకునేది శూన్యం 
  • టికెట్ రాని ఎమ్మెల్యేలు, ఎంపీలు నా దృష్టిలో అదృష్టవంతులు 
  • తనకు టికెట్‌ రాదన్న బాధలో దగ్గుబాటి చెబుతున్నారా?
  • లేక రాజకీయాలపైనే దగ్గుబాటికి విరక్తి పుట్టిందా?

1:37 PM, జనవరి 10, 2024
చంద్రబాబు బోగస్ బండారం 

  • బైటపడిన టీడీపీ ఎన్నికల కుతంత్రం
  • తప్పుడు పద్ధతుల్లో ఓటర్ల చేర్పు, తొలగింపు
  • కోనేరు సురేష్ హె‌డ్‌గా తప్పుడు పనికి స్పెషల్ సెల్
  • ఈసీకి ఆధారాలతో సహా పట్టిచ్చిన వైఎస్సార్‌సీపీ
  • ఎన్నికల ముందే చేతులెత్తేసిన బాబు అండ్ కో

1:10 PM, జనవరి 10, 2024
నేడు చంద్రబాబు బెయిల్‌పై తీర్పు

  • మధ్యాహ్నం చంద్రబాబు బెయిల్‌పై తీర్పు
  • నేడు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై తీర్పు ఇవ్వనున్న ఏపీ హైకోర్టు
  • అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, మద్యం కేసు, ఇసుక కేసుల్లో చంద్రబాబుపై సీఐడీ కేసులు నమోదు 
  • ఈ కేసులలో విచారణ పూర్తి చేసి తీర్పు రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు 
  • మ. 2.15గంటలకు తీర్పును వెలువరించనున్న ఏపీ హైకోర్టు

1:05 PM, జనవరి 10, 2024
చింతమనేనికి సెగ తగులుతోందా?

  • మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు
  • దెందులూరు ఎవరి సొత్తుకాదు
  • డబ్బు సంచులతో వస్తే ప్రజలు ఆదరించరు 
  • నాయకుడు ప్రజల నుంచి రావాలి 


1:05 PM, జనవరి 10, 2024
చింతమనేని బాటలోనే కోడెల శివరాం వ్యాఖ్యలు

  • పల్నాడులో మాట్లాడిన టీడీపీ నేత కోడెల శివరాం 
  • ఎవరైతే పదవుల కోసం సత్తెనపల్లి వచ్చారో వారు ఇంతవరకు కోడెల గడప తొక్కలేదు 
  • పార్టీలు మారటంలో సీనియర్ పనికి వస్తారు 
  • పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదు 
  • నాకు పార్టీలో పూర్తి మద్దతు ఉంది : కోడెల శివరాం

1:00 PM, జనవరి 10, 2024
ఓటుకు కోట్లు కేసు వాయిదా..

  • మన వాళ్లంటూ బ్రీఫింది బాబే.. కోర్టులో కేసు విచారణ
  • ఓటుకు కోట్లు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ
  • చంద్రబాబు పాత్రపై విచారణ జరిపించాలంటూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్‌పై విచారణ
  • మరికొంత సమయం కావాలని రేవంత్ తరపు న్యాయవాదుల వినతి 
  • తదుపరి విచారణ ఏప్రిల్ కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

12:49 PM, జనవరి 10, 2024
సీఎం జగన్‌ పాలనలో జనం సంతోషంగా ఉన్నారు: మంత్రి పెద్దిరెడ్డి

  • చంద్రబాబు ఎన్నికల హామీలు నెరవేర్చలేదు
  • 99 శాతం లబ్ధిదారులకు పథకాలు అందజేశాం
  • వైఎస్సార్‌సీపీలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నాం
  • హిందూపురంలో బాలకృష్ణ రెండుసార్లు గెలిచినా అభివృద్ధి చేయలేకపోయారు

12:34 PM, జనవరి 10, 2024
సీఎం క్యాంప్‌ ఆఫీస్‌కు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు

  • ఎన్నికల్లో పోటీ చేసే నియోజకవర్గాలు సహా అంశాలపై చర్చ
  • క్యాంప్‌ ఆఫీస్‌కు వచ్చిన ఎంపీ మార్గాని భరత్‌, పేర్ని నాని, గోరంట్ల మాధవ్‌, జక్కంపూడి రాజా

12:19 PM, జనవరి 10, 2024
చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై నేడు తీర్పు ఇవ్వనున్న హైకోర్టు

  • ఐఆర్‌ఆర్‌, లిక్కర్‌, ఇసుక కుంభకోణం కేసులో వాదనలు పూర్తి
  • ఇప్పటికే వాదనలు పూర్తయి తీర్పు రిజర్వ్‌ చేసిన ఏపీ హైకోర్టు

12:02 PM, జనవరి 10, 2024
కేశినేని భవన్ రూపురేఖలు పూర్తిగా మార్పు

  • నిన్నటి వరకూ చంద్రబాబు, కేశినేని నాని, కేశినేని శ్వేత ఫ్లెక్సీలతో పసుపుమయంగా ఉన్న ఎంపీ ఆఫీస్
  • పూర్తిగా పసుపు ఫ్లెక్సీలు తొలగింపు
  • పార్టీలతో సంబంధం లేకుండా ఐ లవ్ విజయవాడ టైటిల్‌తో ఫ్లెక్సీలు ఏర్పాటు.
  • బెజవాడలో నిర్మించిన మూడు ఫ్లై ఓవర్‌ల ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలుఏర్పాటు
  • ఎన్టీఆర్ ఫోటోతో పాటు కేశినేని నాని, శ్వేత ఫోటోలు మాత్రమే ఉండేలా ఫ్లెక్సీల ఏర్పాటు


10:58 AM, జనవరి 10, 2024
గుంటూరులో సిగపట్లు

  • గుంటూరు పశ్చిమం, తెనాలి కావాలని జనసేన డిమాండ్‌
  • ఆ రెండూ తమ పార్టీకి బలమైన సీట్లు అంటున్న నేతలు
  • కానీ, తెనాలిలో పాదయాత్ర మొదలుపెట్టిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా
  • గుంటూరు పశ్చిమ.. మా సిట్టింగ్‌ సీటు అంటున్న తెలుగుదేశం 

10:25 AM, జనవరి 10, 2024
టీడీపీ కుట్రలపై దేవినేని అవినాష్‌ ఫైర్‌

  • టీడీపీ నాయకులు దొంగ ఓట్లతో గద్దెనెక్కే ప్రయత్నం చేస్తున్నారు
  • చంద్రబాబు మాటలు నమ్మరని పవన్‌ను తోడు తీసుకెళ్లి సీఈసీకి ఫిర్యాదు చేశారు
  • తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దొంగ ఓట్లతోనే రెండుసార్లు గెలిచాడు
  • తూర్పు నియోజకవర్గంలో చనిపోయిన వారి ఓట్లు, బంధువుల ఓట్లను చేర్చారు
  • దొంగ ఓట్లపై టీడీపీ నేతలు మాట్లాడుతుంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుంది
  • దొంగ ఓట్ల ఏరివేతకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • దొంగ ఓట్ల ఏరివేతలో అధికారుల కృషి అభినందనీయం

10:12 AM, జనవరి 10, 2024
చంద్రబాబు తాతా.. చంద్రగిరిలో దొంగ ఓట్లని నిరూపించు

  • మాజీ సీఎం చంద్రబాబుకు చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి బహిరంగ లేఖ
  • లక్ష దొంగ ఓట్లు ఉన్నాయని నిరూపిస్తే నామినేషన్‌ కూడా వేయను 
  • జగనన్న చేసిన సంక్షేమం, అభివృద్ధే మమ్మల్ని గెలిపిస్తాయి
  • చంద్ర­గిరి నియోజకవర్గంలో లక్ష దొంగ ఓట్లు చేర్పించినట్లు నిరూపిస్తే.. నామినేషన్‌ కూడా వేయనని సవాల్‌
  • దొంగ ఓట్లతో గెలవాల్సిన ఖర్మ తమకు ఎప్పుడూ లేదు
  • జగనన్న చేసిన సంక్షేమం, అభివృద్ధే తమను గెలిపిస్తాయి
  • మా తాత వయసున్న మీరు నిజాలు తెలుసుకోకుండా మాట్లాడడం తగదు
  • 2023 నవంబర్‌లో కేవలం 4 రోజుల్లో టీడీపీ వారు 14,200 దొంగ ఫారం 7లు నింపి దరఖాస్తు చేశారు
  • ఎన్నికల కమిషన్‌ విచారణ చేస్తే చాలా­మంది టీడీపీ వారు అరెస్ట్‌ అవుతారు
  • అసత్య ఆరోపణలు చేసిన అందరిపైనా పరువు నష్టం దావా వేస్తున్నాను
  • న్యాయ­స్థానం ముందు దోషులుగా నిలబెడతాను
  • చంద్రగిరి ప్రజల ముందు కూడా దోషు­లుగా నిలబెడతాను.
  • వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి అసత్యాలే మీరు కొనసాగిస్తే.. నేను మా నియోజకవర్గ ప్రజలతో కలిసి పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాను
  • అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు సైతం వెనకాడను

9:58 AM, జనవరి 10, 2024
లోకేశ్‌ ‘రెడ్‌బుక్‌’ బెదిరింపులపై విచారణ జరపాలి  

  • అధికారులను బెదిరించి లొంగదీసుకునేందుకు కుట్ర
  • సీఎం జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు, లోకేశ్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు 
  • రాష్ట్రంలో సామరస్య పరిస్థితులను దెబ్బతీసేందుకు పన్నాగం 
  • దురుద్దేశపూర్వకంగా ఉన్నతాధికారులపై నిరాధారణ ఆరోపణలు 
  • చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలను కట్టడి చేయండి
  • కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరిన వైఎస్సార్‌సీపీ
  • ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎంపీ మార్గాని భరత్‌ 

9:10 AM, జనవరి 10, 2024
ఏపీలో రెండో రోజు సీఈసీ బృందం పర్యటన

  • అధికారులతో చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుకార్‌ సమీక్షలు
  • నేడు సీఎస్‌, డీజీపీ, పోలీస్‌ నోడల్‌ ఆఫీసర్‌, ఏపీసీఈవోలతో సీఈసీ ఉన్నత స్థాయి సమీక్ష
  • ఎన్నికల నిర్వహణ సంబంధింత శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించనున్న సీఈసీ
  • సాయంత్రం చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌ మీడియా సమావేశం

8:48 AM, జనవరి 10, 2024
తాడేపల్లి: నేడు వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతల సమావేశం

  • ఎన్నికల దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై చర్చ
  • హాజరు కానున్న అనుబంధ సంఘాల నేతలు, ఇతర ప్రతినిధులు

8:30 AM, జనవరి 10, 2024
కోర్టు ద్వారా లోకేశ్‌కు నోటీసులు ఇవ్వండి

  • ఆదేశించిన ఏసీబీ న్యాయస్థానం 
  • ‘రెడ్‌ డైరీ’ బెదిరింపుల కేసులో నోటీసులు తీసుకునేందుకు లోకేశ్‌ ససేమిరా 
  • అదే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లిన సీఐడీ.. లోకేశ్‌ తీరుపై కోర్టు ఆగ్రహం 
  • నోటీసులు పంపాలని కోర్టు అధికారులకు ఆదేశం

8:17 AM, జనవరి 10, 2024
సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష

  • లోక్‌సభకు, రాష్ట్ర అసెంబ్లీకి ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సన్నద్ధతపై ఉన్నతస్థాయి సమీక్ష
  • గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో  కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమా­ర్‌తో పాటు కమిషనర్లు అనూప్‌ చంద్ర పాండే, అరుణ్‌ గో­యల్‌ సమావేశం
  • రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి వి­నతి పత్రాల­ను స్వీకరణ
  • అనంతరం అ­న్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పీలు, పోలీసు కమి­ష­నర్లతో సమీక్ష
  • లోక్‌­సభ, అసెంబ్లీలకు ఏక­కాలంలో ఎన్నికల నిర్వ­హణ సన్నద్ధతపై కలెక్టర్లు, ఎస్‌పీలు, పోలీసు కమిషనర్లలకు  దిశానిర్దేశం
  • నేడు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్ర­భు­త్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు ఎన్ని­కల నిర్వహణకు సంబంధించి సమీక్ష 

8:11 AM, జనవరి 10, 2024
మేమంటే అంత చులకనా బాబూ?

  • చంద్రబాబు వ్యాఖ్యలపై మహిళా పోలీసు సంఘం ఆగ్రహం
  • ప్రభుత్వం నిర్వహించిన రాతపరీక్ష, ప్రతిభ ఆధారంగా ఎంపికయ్యాం
  • ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే నియమితులయ్యాం
  • తప్పుడు ఆరోపణలు చేస్తే రానున్న ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరిక 

7:35 AM, జనవరి 10, 2024
రా..రమ్మన్నా.. రాని జనం

  • ఆళ్లగడ్డ సభకు లక్ష మందిని తరలించాలని జిల్లా నేతలకు టీడీపీ టార్గెట్‌
  • పదివేల మంది కూడా రాకపోవడంతో తీవ్ర అసంతృప్తి
  • వచ్చిన వారు కూడా సభ మధ్యలోనే వెనుదిరగడంతో బాబు అసహనం
  • ఎన్నికల్లో గెలిపిస్తే ఏం చేస్తారో చెప్పకుండానే సీఎం జగన్‌ కుటుంబం టార్గెట్‌గా సాగిన ప్రసంగం
  • ఆళ్లగడ్డ టికెట్‌ ప్రకటన చేయకపోవడంతో అఖిలప్రియ కార్యకర్తల ఆగ్రహం
  • అసహనానికి గురైన చంద్రబాబు
  • సభకు జనాలు లేకపోవడంతో చంద్రబాబు తీవ్ర అసహనం
  • ఈ సభలకు కూడా జనాలను తరలించలేకపోతే ఇక మీరెందుకంటూ నాయకులపై మండిపడినట్లు తెలిసింది.
  • సభ ఆద్యంతం ఆయన ముఖంలో అసహనం
  • మరోవైపు.. చంద్రబాబు ప్రసంగిస్తుండగానే వచ్చిన అరకొర జనం కూడా వెనుదిరిగారు
  • ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్న టీడీపీ నాయకులు
  • సభకు వచ్చేందుకు ఆసక్తి కనబరచని స్థానిక కార్యకర్తలు
  • ఆళ్లగడ్డ నుంచి కేవలం రెండు, మూడు వేల మందే వచ్చినట్లు ఆ పార్టీ నాయకులే మాట్లాడుకోవడం గమనార్హం  
     


7:07 AM, జనవరి 10, 2024
నన్ను అనర్హురాలిగా చేయాలని వైసీపీ పిటిషన్ వేసిన విషయం నాకు తెలియదు: ఉండవల్లి శ్రీదేవి

  • అనర్హత విషయమై నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు
  • ముందు నా వివరణ తీసుకోవాలి కదా
  • వివరణ తీసుకున్నాకే అనర్హత పై నిర్ణయం తీసుకోవాలి
  • పార్టీ మారేటప్పుడు ఈ విషయం తెలియదా?: వైఎస్సార్సీపీ
  • అవకాశం దొరుకుగానే పార్టీ జంపు చేసి ఇప్పుడు నీతులు చెప్తారా? 
  • ఇదే వివేచన ముందు ఎక్కడికి వెళ్ళింది?
  • మీరు గెలిచిన పార్టీకి చెప్పాకే పక్క పార్టీకి జంపు చేశారా? 
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి చెప్పి పక్క పార్టీకి ఓటేశారు? 
  • అనర్హత అనగానే మీకు వివరణలు గుర్తుకొచ్చాయా?


6:57 AM, జనవరి 10, 2024
బల్క్‌ ఫిర్యాదులు చంద్రబాబు కుట్రే

  • అర్హుల ఓట్లు తొలగించేందుకుటీడీపీ పన్నాగం
  • బల్క్‌ ఫిర్యాదులు అబద్ధమని తేలినందున చంద్రబాబు అండ్‌ కో పై చర్యలు తీసుకోవాలి
  • మరోవైపు దొంగ ఓట్లను చేరుస్తున్న టీడీపీ 
  • గుర్తింపులేని జనసేనకు సీఈసీని కలిసే అవకాశం ఎలా ఇచ్చారు.. జనసేన టీడీపీ పార్టనరా? బీజేపీ పార్టనరా? 
  • గుర్తింపులేని పార్టీకి కామన్‌ సింబల్‌ చట్ట విరుద్ధం 
  • కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఫిర్యాదు 
     
     

6:55 AM, జనవరి 10, 2024
రాజమండ్రి రూరల్‌లో జనసేన, టీడీపీ మధ్య చిచ్చు

  • తానే పోటీ చేస్తా అంటున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి
  • పెద్దల ఆశీస్సులు తనకే అంటున్న జనసేన నేత కందుల దుర్గేష్‌
  • విలేకర్ల సమావేశాలు పెట్టి మరీ ప్రకటనలు
  • సీటుపై ఎటూ తేల్చని చంద్రబాబుపై రగిలిపోతున్న తెలుగు తమ్ముళ్లు

6:52 AM, జనవరి 10, 2024
బ్రో.. ఇది దొంగ ఓటు!

  • జనసేన కార్యాలయం చిరునామాతో పవన్‌ కళ్యాణ్‌ ఓటు నమోదు
  • గత ఎన్నికల సమయంలో విజయవాడ తూర్పు పరిధిలో ఓటు
  • 6 నెలల క్రితం చిరునామా మార్పు
  • ఓటు నమోదులో పార్టీ కార్యాలయం అడ్రస్‌ చెల్లుబాటుపై అనేక రకాల అనుమానాలు
  • ఎన్నికల నిబంధనల ప్రకారం ఆర్డనరీ రెసిడెన్స్‌తోనే ఓటు నమోదుకు వీలు..
  • అంటే హైకోర్టు తీర్పు ప్రకారం రోజూ రాత్రి నిద్రపోయే నివాసం
  • రాష్ట్రానికి అప్పుడప్పుడొచ్చే పవన్‌ ఎక్కువగా హోటల్‌లోనే బస
  • తమ్ముడు బాటలోనే అన్న నాగేంద్రబాబు
  • వడ్డేశ్వరంలోని దొంగ చిరునామాతో ఓట్ల నమోదుకు విఫలయత్నం
  • తెలంగాణలో పోలింగ్‌ ముగిసిన మరునాడే ఆన్‌లైన్‌లో దరఖాస్తు.. అధికారుల తనిఖీలో దొంగ చిరునామాగా గుర్తింపు
  • నోటీసు ఇచ్చినా అధికారుల ముందు ఇంటి యజమానే హాజరు.. దాంతో నాగేంద్రబాబు సహా కుటుంబసభ్యుల ఆరు ఓట్లు తిరస్కరణ
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement