సాక్షి, తిరుపతి: అంబేద్కర్ స్మృతివనం శిలా ఫలకాలపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరు తొలగించడం అమానుషమని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ జగన్.. అంబేద్కర్ ఆశయాలకు దీటుగా శిలా విగ్రహావిష్కరణ చేశారన్నారు. అంబేద్కర్ శిలా విగ్రహంపై దాడి ప్రభుత్వ కూటమి పతనానికి దారితీస్తుందన్నారు.
‘‘శిలా ఫలకాలపై వైఎస్ జగన్ పేరు చెరిపివేయవచ్చు కానీ చేసిన సేవలను చరిత్ర నుంచి తొలగించలేరు. ఒక వర్గానికి, ఒక మతానికి, ఒక కులానికి నాయకుడు కాదు అంబేద్కర్. పార్టీలకతీతంగా నాయకులందరూ ఏకతాటిపై వచ్చి శిలా విగ్రహంపై జరిగిన దాడిని ప్రతిఒక్కరూ ఖండించాలి. అంబేద్కర్ ఆశయాలు కనుగుణంగా బడుగు, బలహీన వర్గాలకు ఇంగ్లీష్ మీడియం విద్యను తెచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రెడ్‌బుక్ పరిపాలన సాగుతోంది జవాబుదారితనం అన్న పవన్ కల్యాణ్ జరుగుతున్న విధ్వంసాలపై సమాధానం చెప్పాలి. ఇకనైనా దాడులు మానుకుని చంద్రబాబు పరిపాలనపై దృష్టి పెట్టాలి’’ అని నారాయణస్వామి హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment