జానీ.. జానీ.. 'ఎస్‌.. పాపా'!  | AP Assembly Elections: Janasena And Pawan Kalyan Under TDP Chandrababu Control, Details Inside - Sakshi
Sakshi News home page

జానీ.. జానీ.. 'ఎస్‌.. పాపా'! 

Published Mon, Feb 26 2024 4:49 AM | Last Updated on Mon, Feb 26 2024 10:59 AM

Janasena And Pawan Kalyan Under TDP Chandrababu Control - Sakshi

గాలికి ఎగిరిపోయే పేలాలు కృష్ణార్పణం..! బలహీన స్థానాలు జనసేన పరం..! పొత్తుల పేరుతో జనసేన స్థావరాల్లోకి చొరబాట్లు! ఇదీ చంద్రబాబు రాజకీయ నీతి! గత ఎన్నికల్లో జనసేన కాస్తో కూస్తో ఓట్లు తెచ్చుకున్న స్థానాలను పొత్తుల పేరుతో కబళిస్తూ ఆ పార్టీ చేతులెత్తేసిన సీట్లను మాత్రం చంద్రబాబు బలవంతంగా అంట గట్టేసి చేతులు దులుపుకొంటున్నారు. పొత్తుల పేరుతో నామమాత్రంగా 24 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ స్థానాలను జనసేనకు కేటాయించిన చంద్రబాబు అందులోనూ తన కుటిల రాజకీయాన్ని ప్రదర్శించారు.

గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసినప్పుడు జనసేన తమకన్నా అధికంగా ఓట్లు తెచ్చుకున్న సీట్లను కూడా ఈ సారి ఆ పార్టీకి కేటాయించలేదు. అంటే... చంద్రబాబు కోరుకుంటున్నదేంటి? మిత్రపక్షంగా జనసేన గెలుపునా? లేక కేవలం జనసేనతో పొత్తువల్ల తమకు వచ్చే ఓట్లనా? సందేహం లేదు.. ఆ రెండోదే!. మరి ఇన్ని జరుగుతున్నా... ఇలాగైతే జన­సేన ఓట్లు టీడీపీకి బదిలీ కావటం సాధ్యం కాదంటూ పార్టీ శ్రేణులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నా పవన్‌ మాత్రం నోరు మెదపటం లేదెందుకు? బాబు ఏం చేసినా ఊ.. కొడుతున్నారెందుకు? మరోసారి ఆయన్ను నమ్మి జనసేన శ్రేణులు దెబ్బతినాల్సిందేనా? 

సాక్షి, అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌­­కళ్యాణ్‌ 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి­న రెండు స్థానాలతోపాటు జనసేన గెలిచిన ఏకైక సీటు­తో కలిపి ఆ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా 15 స్థానా­ల్లో 30 వేలకు పైగా ఓట్లు సాధించింది. అయితే ఇందులో ఏడు చోట్ల ఇప్పటికే టీడీపీ అభ్యర్ధులను చంద్రబాబు ప్రకటించేశారు. మిగిలిన­వి ప్రస్తుతానికింకా ప్రకటించలేదు. ఈ 15 సీట్లలో ఒక్కటంటే ఒక్కటి... కేవలం కాకినాడ రూరల్‌ స్థానాన్ని మాత్రమే జనసేనకు కేటాయించారు.  


► గత ఎన్నికలో జనసేనకు కేవలం 7,633 ఓట్లు మాత్రమే వచ్చిన నెలిమర్ల లాంటి బలహీన స్థానాలను పొత్తుల పేరుతో చంద్రబాబు ఆ పార్టీకి మరోసారి కేటాయించేశారు. అనకాపల్లి అసెంబ్లీ స్థానంలో గత ఎన్నికల్లో జనసేనకు 11,988 ఓట్లు వచ్చాయి. విచిత్రమేంటంటే పవన్‌ కళ్యాణ్‌ సైతం సీట్ల సంఖ్యపై గానీ, ఏఏ సీట్లు అనే విషయంలో గానీ పెద్దగా పట్టుబట్టడం లేదన్నది ఆ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ. ఎంత సంఖ్య చెప్పినా ‘ఊ’ కొట్టేస్తున్నారని... నాదెండ్ల మనోహర్‌ ఏ జాబితా ఇస్తే ఆ జాబితాను ప్రకటించేస్తున్నారని పార్టీ వర్గాలు రగిలిపోతున్నాయి.  

► గత ఎన్నికల్లో జనసేన ఏకంగా 36,259 ఓట్లు దక్కించుకున్న పి.గన్నవరం సీటుకు చంద్రబాబు ఈ దఫా టీడీపీ అభ్యర్థిని బరిలోకి దించి జనసైనికులకు షాక్‌ ఇచ్చారు. ఇంకా విస్మయకరమైన వాస్తవమేంటంటే జనసేనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టిన మహాసేన రాజేష్‌ను పి.గన్నవరం టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడం. దీనిపై జనసేన నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు.  

► మరోవైపు విజయవాడ తూర్పులో జనసేన అభ్యర్థికి 30,137 ఓట్లు, విజయవాడ సెంట్రల్‌లో జనసేనతో మిత్రపక్షంగా నాడు పోటీ చేసిన సీపీఎం అభ్యర్ధికి 29,333 ఓట్లు రాగా ఈసారి ఆ రెండు స్థానాల్లోనూ చంద్రబాబు ఇప్పటికే టీడీపీ అభ్యర్ధులను ప్రకటించేశారు. ఇక నగరంలో మిగిలింది విజయవాడ పశ్చిమ స్థానమే. జనసేన పట్టుబట్టి దాన్ని సాధించుకున్నా... అక్కడ మిగతా రెండు స్థానాలతో పోలిస్తే జనసేనకు గతంలో తక్కువగా 22,367 ఓట్లు మాత్రమే వచ్చాయి.  

► రాజమండ్రి రూరల్‌లో గత ఎన్నికల్లో 42,685 ఓట్లు సాధించిన జనసేన అభ్యర్ధి కందుల దుర్గేష్‌ ఈ దఫా ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నా సిట్టింగ్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తానూ పోటీలో ఉన్నానంటున్నారు. దుర్గేష్‌ను నిడదవోలు పంపించేందుకు పవన్‌కళ్యాణ్‌ ద్వారా చంద్రబాబు స్కెచ్‌ వేసినట్లు సమాచారం. నిడదవోలులో గత ఎన్నికల్లో జనసేనకు 23 వేల ఓట్లు మాత్రమే దక్కాయి. పవన్‌కళ్యాణ్‌ తర్వాత జనసేనలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించిన అభ్యరి్థకి సైతం సీటు గ్యారెంటీ లేకపోవడంపై జనసైనికులు కంగు తింటున్నారు.   

► తణుకు శాసనసభ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థికి 31,961 ఓట్లు వచ్చాయి. పొత్తుల పేరుతో అక్కడ ఈసారి టీడీపీ పాగా వేసింది. జనసేనకు 35,833 ఓట్లు వచ్చిన కొత్తపేట, 35,173 ఓట్లు వచ్చిన మండపేట, 33,334 ఓట్లు వచ్చిన ముమ్మడివరం, 32,984 ఓట్లు లభించిన పాలకొల్లు నియోజకవరాల్లో సైతం చంద్రబాబు ఇప్పటికే టీడీపీ అభ్యర్ధులను ప్రకటించారు. తణుకు పర్యటన సందర్భంగా స్థానిక జనసేన ఇన్‌చార్జ్‌ని గెలిపించుకుందామంటూ ప్రకటనలు చేసిన పవన్‌కళ్యాణ్‌... పొత్తుల పేరుతో ఆ స్థానాన్ని టీడీపీకి అప్పగించడంపై జనసైనికులకు మాట పెగలటం లేదు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement