సాక్షి, న్యూఢిల్లీ: ధాన్యం సేకరణలో మొదటి దోషి టీఆర్‌ఎస్ కాగా, రెండో దోషి బీజేపీ అని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రైతులు రెండు నెలలుగా ఖరీఫ్ పంట ధాన్యం అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వెలిబుచ్చా రు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కోమటిరెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభు త్వం పెట్రోల్ డీజిల్‌పై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు.
పనికి రాని ప్రాజెక్టులను నిర్మించి కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నుంచి భద్రాచలం వరకు ఆమోదం పొందిన రహదారి నిర్మా ణంపై కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశానని పేర్కొన్నారు. రెండు నెలల్లో పను లు ప్రారంభమయ్యేలా అదేశాలిస్తామని గడ్కరీ హామీ ఇచ్చారని కోమటిరెడ్డి తెలిపారు. త్వరగా టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని కేంద్ర మంత్రి అధికారులను ఆదేశించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment