డిప్యూటీ సీఎం భట్టి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై కేటీఆర్ ధ్వజం
సిరుల గనికి మరణ శాసనం రాస్తూ ఫొటోలకు పోజులిస్తారా? అంటూ ఆగ్రహం
తెలంగాణ సహజ సంపదను చెరబట్టిన కాంగ్రెస్, బీజేపీని చరిత్ర క్షమించదని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నేలపై కేంద్రం సింగరేణి గొంతు కోస్తున్నా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు బాధ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి రంది లేకపోయిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు మండిపడ్డారు. వారిద్దరికీ తెలంగాణ ప్రజలపై ప్రేమ, సింగరేణి కారి్మకులపై అభిమానం లేదని విమర్శించారు. సింగరేణి బొగ్గు బ్లాక్‌ల వేలంపై కాంగ్రెస్, బీజేపీ అనుసరిస్తున్న వైఖరిని ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’వేదికగా కేటీఆర్ మండిపడ్డారు.
వేలాది మంది కార్మికుల పొట్టగొట్టి వందేళ్ల సింగరేణి భవిష్యత్తును చీకట్లోకి నెట్టి కిషన్‌రెడ్డి, భట్టి ఫొటోలకు పోజులివ్వడం బీజేపీ, కాంగ్రెస్ కుట్రలకు నిదర్శనమని దుయ్యబట్టారు. సిరుల గనికి మరణ శాసనం రాస్తూ వేలాది మంది కారి్మకుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలం అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఇంటికి సీఎం వెళ్లి ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ సహజ సంపదను చెరబట్టి కాంగ్రెస్, బీజేపీ ఆడుతున్న వికృత క్రీడను చరిత్ర క్షమించదని కేటీఆర్ వ్యాఖ్య.
రేవంత్ మౌనం వెనుక ప్రశ్నలు...
గతంలో సింగరేణి గనుల వేలాన్ని వ్యతిరేకించిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తుతం మౌనం వహించడం కాంగ్రెస్ అవకాశవాదానికి అద్దం పడుతోందని కేటీఆర్ విమర్శించారు. ఈ విషయంలో వైఖరి మార్చుకోవడం వెనుక ఒత్తిళ్లను రేవంత్ రాష్ట్ర ప్రజలకు వివరించాలన్నారు. నీతిలేని బీజేపీ నిర్ణయాల్లో కాంగ్రెస్ కూడా భాగమైందని కేటీఆర్ దుయ్యబట్టారు.
అభివృద్ధి యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్లండి
తెలంగాణ ప్రగతిప్రస్థానంపై బురదచల్లడం మా ని అభివృద్ధి యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సూచించారు. ప దేళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధి నమూనా ఇతర రాష్ట్రాలకు అనుసరణీయమంటూ ప్రపంచ ప్రఖ్యాత ఆంగ్ల మ్యాగజైన్ ‘ది ఎకానమిస్ట్’ప్రచురించిన కథనాన్ని ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఆ కథనంలో మ్యాగజైన్ పొందుపరిచిన గణాంకాలను కేటీఆర్ ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment