Netizens Trolling On TDP Nara Lokesh In Padayatra - Sakshi
Sakshi News home page

ఇదేందయ్యా ఇది లోకేష్‌.. సోషల్‌ మీడియాలో ఉతికి ఆరేశారు!

Published Tue, Jan 31 2023 8:05 AM | Last Updated on Tue, Jan 31 2023 8:42 AM

Netizens Trolling On TDP Nara Lokesh Padayatra - Sakshi

సాక్షి, చిత్తూరు/ శాంతిపురం: యువగళం పేరులో టీడీపీ నేత నారా లోకేష్‌ బాబు.. పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. యువగళం పాదయాత్ర సోమవారం ఉదయం చిత్తూరు జిల్లా వి.కోట మండలం అన్నవరం గ్రామం నుంచి ప్రారంభమై సాయంత్రం దానమయ్యగారి పల్లె వద్ద ముగిసింది. ఈ పాదయాత్ర సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. 

నేల పైన ఓ పసుపు రంగు వస్త్రం. దానిపైన ఓ నాలుగు ఆలుగడ్డలు, ఓ నాలుగు టమోటాలు, కొన్ని ముల్లంగి, ఓ చిన్న బుట్టలో నిమ్మకాయలు. ఇది కూరగాయల దుకాణమట! ఈ కూరగాయలు అమ్మడానికి ఇద్దరు మహిళలు! వారితో లోకేశ్‌ మాటామంతీ! ఇంతా చేస్తే.. ఈ ఇద్దరు మహిళల్లో ఒకరు ఆ తర్వాత లోకేశ్‌ పాదయాత్రలోనూ కనిపించారు. ఆమె చేతిలో తమిళనాడుకు చెందిన ఓ సంచీ.. ఆదివారం చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం బడుగుమాకులపల్లి సంతలో జరిగిన ఈ ‘షో’ను సోషల్‌ మీడియా పసిగట్టేసింది. లోకేశ్‌ పాదయాత్రకు తమిళనాడు నుంచి ఆర్టిస్టులను తెచ్చి, ఇక్కడ ‘షో’ చేస్తున్నారని సోషల్‌ మీడియా ఉతికి ఆరేస్తోంది.
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement