
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ విలువలు లేకుండా ఆవేశం, ఆక్రోశంతో ఊగిపోతున్నాడు. చంద్రబాబు రాజకీయ క్రీడలో పావుగా మారి.. తాను ఏం మాట్లాడుతున్నానో అనే సోయి లేకుండా సభలో ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్ చేస్తూ ఆధారాలులేని ఆరోపణలు, విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాడు.
ఇక, ఇటీవల టీడీపీ-జనసేన కూటమి సభకు స్పందన అంతంతమాత్రంగానే వచ్చింది. పవన్ స్పీచ్‌కు కూడా పెద్దగా స్పందనేమీ లేదు. ఈ క్రమంలో చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌తో పవన్.. డైలాగ్స్‌ను బట్టీపట్టి మారి ఆవేశంతో ఊగిపోయారు. విలువలు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ‘పెళ్లాం’ అంటే తప్పేంటీ?. పవన్ మాటలు నీచంగా ఉన్నాయి. సీఎం జగన్‌పై పవన్ మాటలు.. చాలా ఘోరంగా నీచంగా ఉన్నాయి. సభ్య సమాజం పవన్ మాటలను హర్షించడం లేదు.
పవన్‌లోని ‘అపరిచితుడు’ ఇలా..
►సముద్రం తల వంచదు.. ఒకరి కాళ్ల దగ్గరకు వెళ్లదు అని అంటాడు. కానీ, ఆయన మాత్రం చంద్రబాబు కాళ్లు మొక్కుతాడు.
మూడు అడుగులు.. మూడు ఎంపీ సీట్లు..
►పవన్‌కు మూడు ఎంపీ సీట్లు ఇచ్చింది చంద్రబాబు.. ఇక్కడ బలి చక్రవర్తి ఎవరు?.. పవన్ కాదా?. 25 ఎంపీ స్థానాల్లో మూడు సీట్లు ఏపాటి?
కాపులను మోసం చేసిన వ్యక్తి పవన్..
►ద్వితీయ శ్రేణి జనసేన నేతలను కూడా పవన్ మోసం చేస్తున్నాడు. కందుల దుర్గేష్‌ను కూడా చంద్రబాబుకు పవన్ తాకట్టు పెట్టాడు. టీడీపీ నిప్పు కాదు.. పప్పు. జనసేన పార్టీ ఓ తుప్పు పార్టీ.
పవన్‌ను నిజాయితీ ఎక్కడుంది?
►చంద్రబాబు కోపాన్ని తన కోపంగా మార్చుకుని ప్యాకేజీలో భాగంగా బాబును ఇంప్రెస్ చేయడానికి పవన్ ప్రయత్నిస్తున్నాడు. పవన్ నిజాయితీ గురించి మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు ఆయనకు నిజాయితీ ఉందా?. పవన్ ఎప్పుడైనా తాను చెప్పిన మాట మీద నిలబడ్డారా?. మాట మార్చకుండా కుండా ఉన్నారా?.
- విజయ్ బాబు, రాజకీయ విశ్లేషకులు