అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో ఏ-1 నిందితుడిగా ఉన్న చంద్రబాబుతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురువారం సెంట్రల్ జైల్లో ములాఖత్ అయ్యారు. అనంతరం పవన్ కళ్యాణ్.. టీడీపీతో పొత్తును ప్రకటించారు. ఈ విషయాన్ని జనసైనికులు అర్థం చేసుకోవాలని వారికి ఏవో కొత్త భ్రమలు కల్పించే ప్రయత్నం చేశాడు పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఆపేందుకే టీడీపీతో పొత్తు అంటూ తన పాత పల్లవినే పాడారు.
దీనిపై వైఎస్సార్సీపీ స్పందించింది. ‘నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైల్‌కి వెళ్ళింది టీడీపీతో పొత్తును ఖాయం చేసుకునేందుకనే విషయం ప్రజలకు పూర్తిగా అర్థం అయ్యింది. . ఇన్నాళ్ళూ నీమీద నమ్మకం పెట్టుకున్న అభిమానులకు, కాస్తో కూస్తో నిన్ను నమ్మిన వాళ్ళకు ఈరోజుతో భ్రమలు తొలగించేశావు.ఇక ఇది పొత్తులకి, ప్రజలకి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇక మిమ్మల్ని మూకుమ్మడిగా ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టడానికి ప్రజలంతా సిద్ధం* అని వైఎస్సార్సీపీ స్పష్టం చేసింది.
“ప్యాకేజ్ బంధం బయటపడింది”
నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైల్‌కి వెళ్ళింది @JaiTDPతో పొత్తును ఖాయం చేసుకునేందుకని ప్రజలకు పూర్తిగా అర్థం అయింది @PawanKalyan. ఇన్నాళ్ళూ నీమీద నమ్మకం పెట్టుకున్న అభిమానులకు, కాస్తో కూస్తో నిన్ను నమ్మిన వాళ్ళకు ఈరోజుతో భ్రమలు తొలగించేశావు.… pic.twitter.com/MCjVLq26zb— YSR Congress Party (@YSRCParty) September 14, 2023
Comments
Please login to add a commentAdd a comment