జగనన్నతోనే సంక్షేమ రాజ్యం | Sakshi
Sakshi News home page

జగనన్నతోనే సంక్షేమ రాజ్యం

Published Tue, Feb 27 2024 12:50 AM

 వైఎస్సార్‌ విగ్రహం వద్ద మాట్లాడుతున్న బూచేపల్లి శివప్రసాదరెడ్డి  - Sakshi

వైఎస్సార్‌ సీపీ దర్శి ఇన్‌చార్జి

బూచేపల్లి శివప్రసాదరెడ్డి

తాళ్లూరు(దర్శి): సంక్షేమ రాజ్యం కొనసాగేందుకు రానున్న ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందని వైఎస్సార్‌ సీపీ దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. ‘మన ఊరికి మన శివన్న’ కార్యక్రమంలో భాగంగా సోమవారం రాత్రి తాళ్లూరు మండలంలోని వెలుగువారిపాలెం, అయ్యలపాలెం, రెడ్డిసాగర్‌ గ్రామాల్లో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బూచేపల్లి కుటుంబ సభ్యులను పార్టీ నేతలు గజమాలలతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. వైఎస్సార్‌ విగ్రహానికి బూచేపల్లి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వెలుగువారిపాలెంలో రూ.15 లక్షలతో నిర్మించిన రెండు సైడు కాల్వలు, రూ.5 లక్షల సీసీ రోడ్డు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌, జగనన్న పాల వెల్లువ భవనాలను జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, బూచేపల్లి శివప్రసాదరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలోనూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నికల హామీలను అమలు చేసిన ఏకై క ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు జన్మభూమి కమిటీలతో పేదల సొమ్ము దోచుకుతిన్నారని విమర్శించారు. ‘మీకు మేలు జరిగితేనే నాకు ఓటు వేయండి’ అని ఓటు అడిగే దమ్మున్న నాయకుడు ఒక వైఎస్‌ జగన్‌ మాత్రమేనన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేక పొత్తుల కోసం పాకులాడుతున్నాడని విమర్శించారు.

జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ.. రాజన్న ఆశయాలు కొనసాగించేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, బూచేపల్లి సుబ్బారెడ్డి ఆశయాలు కొనసాగించేందుకు శివప్రసాదరెడ్డి కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు. వెలుగువారిపాలెం గ్రామం తమ పుట్టిళ్లు లాంటిదన్నారు. దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాదరెడ్డి, ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డిని అధిక మెజార్టీతో గెలుపించాలని కోరారు.

కార్యక్రమాల్లో మండల ఇన్‌చార్జి మద్దిరెడ్డి నరసింహారెడ్డి, చిన్నపురెడ్డి మస్తాన్‌రెడ్డి, షేక్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ఎస్‌ఎం బాషా, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షులు తూము వెంకటసుబ్బారెడ్డి, వైస్‌ ఎంపీపీలు ఇడమకంటి వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఐవీ సుబ్బారెడ్డి, మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు పాలెం నాగలక్ష్మి, సర్పంచ్‌ల సంఘ అధ్యక్షుడు మారం ఇంద్రసేనారెడ్డి, వెలుగువారిపాలెం సర్పంచ్‌ ముచ్చుమారి కోటేశ్వరమ్మ, సచివాలయ కన్వీనర్‌ బ్రహ్మారెడ్డి, ఎంపీటీసీ మూలంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, మాజీ సర్పంచ్‌ మూలంరెడ్డి ఓబుల్‌రెడ్డి, బ్రహ్మారెడ్డి, చిన్నపురెడ్డి రామకోటిరెడ్డి, యర్రారెడ్డి, వెంకటరెడ్డి, తాళ్లూరు సర్పంచ్‌ చార్లెస్‌ సర్జన్‌, మాజీ ఎంపీపీలు పోశం మధుసూదనరెడ్డి, గోళ్లపాటి మోషే, కోటా రామిరెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షులు పులి ప్రసాదరెడ్డి, పులి అంజిరెడ్డి, లక్కవరం సర్పంచ్‌ వెంకటేశ్వర్లు, గంగవరం సర్పంచ్‌ ఇమ్మానియేలు, దోసకాయలపాడు సర్పంచ్‌ కోటా వెంకటరామిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, జిల్లా యూత్‌ వింగ్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి నాగమల్లేశ్వరరెడ్డి, జిల్లా విద్యార్థి విభాగం జాయింట్‌ సెక్రటరీ విష్ణు, జక్కుల రామకృష్ణ, గువ్వల వెంకటశ్రీనివాసరెడ్డి, గుజ్జుల యోగిరెడ్డి, సంగు కొండారెడ్డి, మేకల కొండయ్య, గోపిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, మాజీ సర్పంచ్‌ తూము శివశంకరరెడ్డి, పి.దేవదానం పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement