ఘర్షణలకు పాల్పడితే జిల్లా బహిష్కరణ | Sakshi
Sakshi News home page

ఘర్షణలకు పాల్పడితే జిల్లా బహిష్కరణ

Published Sun, May 26 2024 7:45 AM

-

చీరాల రూరల్‌: ఎన్నికల కౌంటింగ్‌ రోజు అల్లర్లు, గొడవలకు పాల్పడిన వారిని గుర్తించి రౌడీషీట్లు తెరవడమే కాకుండా నగర బహిష్కరణలు కూడా చేస్తామని గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్టి త్రిపాఠి హెచ్చరించారు. శనివారం చీరాల వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌ను బాపట్ల ఎస్పీ వకుల్‌ జిందాల్‌తో కలిసి ఐజీ సందర్శించారు. నియోజకవర్గ పరిధిలోని పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల తదనంతర పరిణామాలు, ఘర్షణలపై నమోదు చేసిన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులకు పలు సలహాలు, సూచనలు చేశారు. ఎన్నికల కౌంటింగ్‌ అనంతరం జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తీసుకుంటున్న భద్రతా చర్యలపై సమీక్షించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement