సిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రం సిరిసిల్ల పట్టణాన్ని మురికి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. మురికినీటిని శుద్ధి చేసేందుకు గతంలో నిర్మించిన ఈటీపీ ప్లాంట్ అధికారుల నిర్లక్ష్యంతో వృథాగా పడి ఉండగా.. ప్రస్తుతం నిర్మిస్తున్న ఎస్‌టీపీ ప్లాంట్ పనులు కొనసా..గుతూనే ఉన్నాయి. ఈ పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియడం లేదు. గతంలో డ్రెయినేజీల మళ్లింపుతోనే పట్టణం వరదముప్పులో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఎస్టీపీ పనులు త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
రూ.61.25 కోట్లతో ఎస్టీపీ
సిరిసిల్ల పట్టణంలో రెండు ప్రధాన మురికికాల్వ లు ఉన్నాయి. మొదటిది ఒకప్పటి మంచినీటి ఉ దారువాగు. ఇది ఇప్పుడు మురికికాల్వగా మా రింది. సిరిసిల్ల పట్టణంలోని సాయినగర్ నుంచి మొదలై శాంతినగర్‌లో ముగుస్తుంది. ఉదారువాగు మొత్తం కబ్జాలకు గురికావడంతో ఇరుకుగా మారింది. ప్రస్తుతం ఈ డ్రెయినేజీ నీటిని శాంతినగర్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కాలనీ వద్ద సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంటు(ఎస్‌టీపీ) ఏర్పాటు చేసి శుద్ధి చేయాలని నిర్ణయించారు. దీని కోసం ఆరు ఎకరాల భూమిని కొని, రూ.61.25 కోట్లతో ఎస్‌టీపీని నిర్మిస్తున్నారు. మురికినీటిని పూర్తి స్థాయిలో శుద్ధి చేసి తుమ్మలకుంటలోకి వదిలిపెట్టాలని ప్రతిపాదించారు. ఈమేరకు 70 శాతం ఎస్‌టీపీ పనులు పూర్తయ్యాయి.
మురికినీటి మళ్లింపుతో వరదముప్పు
సిరిసిల్ల కార్గిల్‌లేఖ్ నుంచి ఇందిరానగర్, తారకరామానగర్, బీవై నగర్, సుందరయ్యనగర్, వెంకంపేట, అంబికానగర్, పద్మనగర్ మీదుగా కొత్తచెరువులోకి వెళ్లే మరో ప్రధాన మురికికాల్వను మూడేళ్ల క్రితం మళ్లించారు. మురికినీరు కొత్తచెరువులోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేశారు. ఫలితంగా వర్షాకాలంలో సర్దార్‌నగర్, సంజీవయ్యనగర్ ముంపునకు కాఆరణమైంది. సిరిసిల్లలో మురికినీటిని శుద్ధి చేస్తే భూగర్భ జలాల కలుషిత సమస్యకు, పట్టణ ప్రజా ఆరోగ్యానికి సవాల్‌గా మారిని మురికినీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
సిరిసిల్ల స్వరూపం
వార్డులు : 39
సిరిసిల్ల పట్టణ జనాభా : 1.05 లక్షలు
పట్టణ విస్తీర్ణం : 55.47 చదరపు కిలోమీటర్లు
ప్రధాన మురికికాల్వలు : 02
కుటుంబాలు : 22,608
ఇది సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్‌లో ప్రవహించే డ్రెయినేజీ. పట్టణంలోని అద్దకం(డయింగ్) యూనిట్లలో వాడే రంగులు, రసాయనాలు, వ్యర్థ జలాలు ఈ మురికి కాల్వలో పారుతుంటాయి. ఆ మురికినీరు వ్యవసాయ భూముల్లో, సిరిసిల్ల శివారులోని చెరువుల్లో చేరి భూగర్భజలాలు కలుషితమవుతున్నా యి. వర్షాకాలంలో వరద పోటెత్తి ము రికినీరు మానేరువాగులో కలుస్తుంది. మధ్యమానేరులోని ఆ నీటినే మిషన్ భగీరథ ద్వారా మళ్లీ శుద్ధిచేసి తాగునీరుగా అందిస్తున్నారు. ఈ సమస్యను శాశ్వతంగా తొలగించేందుకు సిరిసిల్ల మున్సిపల్ అధికారులు కొత్తగా సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్(ఎస్‌టీపీ) ఏర్పాటు చేస్తున్నారు.
ఇది సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మనగర్‌లో మురికినీటిని శుద్ధి చేసేందుకు ఏర్పాటు చేసిన ఇంప్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్(ఈటీపీ). రూ.1.98 కోట్లతో 2019లో నిర్మించారు. డ్రెయినేజీకి అడ్డంగా మురికినీరు శుద్ధి అయ్యేలా ఈటీపీ ప్లాంటు నిర్మించాల్సి ఉండగా.. మురికినీరు కిందనుంచి వెళ్లిపోయేలా, ప్లాంటును పైకి నిర్మించారు. దీంతో అది నిరుపయోగంగా మారింది. ఆ ప్లాంటు పనిచేయాలంటే.. డ్రెయినేజీ కాల్వ అడుగుభాగం ఎత్తు పెంచాలి. ఇందుకు మరో రూ.5 కోట్లు వెచ్చించాలి. ఇది మున్సిపల్ ఇంజినీర్ల బాధ్యత రాహిత్యానికి నిదర్శనం. దీని కోసం వెచ్చించిన రూ.1.98 కోట్లు మురికిలో పోసినట్లు అయ్యింది.
ఎస్‌టీపీ పనులు జరుగుతున్నాయి
శాంతినగర్‌లో సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంటు(ఎస్‌టీపీ) పనులు జరుగుతున్నాయి. మంత్రి కేటీఆర్ చొరవతో మంజూరైంది. మరో మూడు నెలల్లో పూర్తవుతుంది. పూర్తి స్థా యిలో మురికినీటిని శుద్ధి చేసేందుకు ఎస్‌టీపీని ఏర్పాటు చేస్తున్నాం. సిరిసిల్ల పట్టణంలోని ఇతర మురికి కాల్వల సమస్యలను పరిష్కరిస్తాం.
– జిందం కళాచక్రపాణి, మున్సిపల్ చైర్‌పర్సన్
Comments
Please login to add a commentAdd a comment