జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని రోల్ల వాగు ప్రాజెక్టు ఆధునీకరణకు రూ.137 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రాజెక్టు నిర్మాణం 95 శాతం పూర్తయింది. దిగువకు నీటిని విడుదల చేయడానికి 3 తూములను ఏర్పాటు చేశారు. అటవీశాఖ అనుమతులు రాకపోవడంతో వాటికి గేట్లు బిగించలేదు. దీంతో ప్రాజెక్టులోకి వచ్చిన నీరు వచ్చినట్లే బయటకు వెళ్లిపోతోంది. ఈ ప్రాజెక్టులో అటవీ శాఖకు చెందిన 800 ఎకరాల భూమి ముంపునకు గురవుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం అటవీ శాఖకు జగిత్యాల జిల్లా వెల్గటూర్, గొల్లపల్లి, పెగడపల్లి మండలాల్లోని రెవెన్యూ భూములను కేటాయించింది. అధికారులు అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్‌కు నివేదిక పంపారు. ప్రస్తుతం అటవీశాఖకు సంబంధించి నీటిలో మునిగిపోయిన చెట్ల లెక్కింపు పూర్తి కావొచ్చింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే 1 టీఎంసీ నీరు నిల్వ ఉండి, బీర్పూర్, ధర్మపురి మండలాల్లో 20 వేల ఎకరాలకు సాగు నీరందుతుంది. వర్షపు నీరు, ఎస్సారెస్పీ డీ–53 కాలువ ద్వారా వచ్చే నీరు రోళ్లవాగులోకి చేరి, అక్కడి నుంచి పంటలకు అందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment