వేసెక్టమీపై అవగాహన కల్పించాలి
సిరిసిల్ల: పురుషులకు వేసెక్టమీ ఆపరేషన్లు చేయడం ఎంతో సులభమని, సురక్షితమని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎం.వసంతరావు అన్నారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశాల మేరకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై సోమవారం కలెక్టరేట్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ, జిల్లాలో శస్త్ర చికిత్సల పక్షోత్సవాన్ని డిసెంబర్ 24 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ‘కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల’ గురించి భార్యాభర్తలు ఈ రోజు నుంచే మాట్లాడుకోవడం ప్రారంభించండి అనే నినాదంతో అవగాహన కల్పించాలన్నారు. పురుషులకు కోత, కుట్టులేని ఆపరేషన్ కేవలం 5 నిమిషాల్లో చేస్తామని పేర్కొన్నారు. అపోహలు వీవాలని, ఈ ఆపరేషన్ వల్ల దాంపత్య జీవితానికి ఏలాంటి ఆటంకం రాదని వివరించారు. సదస్సులో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీరాజం, వేములవాడ ప్రాంతీయ ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ పి.పెంచలయ్య, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ రజిత, డాక్టర్ అంజలి ఆల్ఫ్రెడ్, డాక్టర్ రాజగోపాల్‌రావు, జిల్లాలోని ప్రాథమిక కేంద్రాల వైద్యాధికారులు దివ్యశ్రీ, రేణుక, కృష్ణవేణి, గీతాంజలి, స్రవంతి, వేణుగోపాల్‌రెడ్డి, వేణుమాధవ్, డెమో రాజకుమార్, బాలయ్య, సంజీవ్, ఏఎన్‌ఎంలు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment