ప్రజావాణికి వినతుల వెల్లువ
సిరిసిల్లటౌన్: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తుందని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పేర్కొన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్‌తో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి అన్ని శాఖలకు కలిపి మొత్తం 110 దరఖాస్తులు వచ్చాయి. ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా
సమస్యలు సత్వరం పరిష్కరించాలని ఆదేశాలు
Comments
Please login to add a commentAdd a comment