‘సర్వే’ సమాచారం ఆన్‌లైన్
సిరిసిల్ల: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నా రు. కలెక్టరేట్‌లో నమోదు పక్రియ సోమవారం షు రూవైంది. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సి పాలిటీలు, 260 గ్రామాల్లో సర్వే సాగింది. మున్సి పాలిటీ పరిధి 377 బ్లాకుల్లో 47,460 ఇళ్లు, గ్రామాల్లో 1,154 బ్లాకుల్లో 1,44,972 ఇళ్లలో సర్వేచేశారు. ఈ సమాచారాన్ని 488 మంది కంప్యూటర్ ఆపరేట ర్లతో ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. కలెక్టర్ సందీ ప్‌కుమార్‌ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ఆ ర్డీవోలు కె.వెంకటఉపేందర్‌రెడ్డి, రాజేశ్వర్, జిల్లా ముఖ్యప్రణాళిక అధికారి శ్రీనివాసచారి పర్యవేక్షణ లో ఆయా మండలాల తహసీల్దార్లు సమాచార న మోదు పక్రియలో పాల్గొన్నారు. సర్వే ఆన్‌లైన్ నమోదుతో కలెక్టరేట్ సందడిగా మారింది. ప్రజావాణిని కలెక్టర్ మరో హాల్‌లో నిర్వహించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment