‘పత్తిపాక’పై ముందుకే..
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక గ్రామంలో పత్తిపాక ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది. 7.78 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలంటే సుమారు 1,700 ఎకరాల భూమి(400 ఎకరాలు అటవీ, 1,300 ఎకరాలు పట్టా భూములు) సేకరించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి, చొప్పదండి, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 2.40 లక్షల ఎకరాల ఎస్సారెస్పీ ఆయకట్టు భూముల స్థిరీకరణతోపాటు కొత్తగా.. 15 నుంచి 20 వేల ఎకరాలకు సాగు నీరందించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగా.. పత్తిపాక ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలాన్ని మంత్రి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు శనివారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి, పరిశీలించారు. ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే.. డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్(డీపీఆర్) రూపొందించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment