● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
సిరిసిల్ల: ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవలపై ప్ర జల్లో నమ్మకం పెంచాలని, శిశుమరణాలు లేకుండా చూడాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరా రు. కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా వైద్యాధికారులతో సమీక్షించారు. జిల్లాలోని వైద్య కళాశాల జ నరల్ ఆసుపత్రిలో నూతన వైద్యులను నియమించామని, అవసరమైన ఆధునిక పరికరాలు ప్రభుత్వం సమకూర్చిందని, శిశు మరణాలు నివారించే దిశగా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. గర్భి ణుల ఏఎన్‌సీ రిజిస్ట్రేషన్ వంద శాతం చేయాల ని, ప్రతీ గర్భిణి తప్పనిసరిగా ఏఎన్‌సీ చెక్ అప్ చే సుకునేలా క్షేత్రస్థాయిలో ఆశ, ఏంఎన్‌ఎం పనిచేయాలన్నారు. నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీ సుకుంటామని హెచ్చరించారు. ప్రసవానికి దగ్గరగా ఉన్న కేసులను గుర్తించి రోజూ ఫాలో అప్ చే యాలని, క్రిటికల్ కేసులను వెంటనే ఆసుపత్రికి తరలించాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో వసంతరావు, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, మెడికల్ సూపరింటెండెంట్లు పెంచలయ్య, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment