‘గుంటి మడుగు’పై గంపెడాశలు
కాల్వశ్రీరాంపూర్ మండలం పెద్దరాతుపల్లి సుంకరికోటల వద్ద గుంటిమడుగు ఎత్తిపోతల పథకంపై ఈ ప్రాంత రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఈ పథకం కోసం అప్పటి కలెక్టర్ అలుగు వర్షిణి, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, అది సర్వే దశలోనే నిలిచిపోయింది. సుమారు రూ.100 కోట్ల అంచనాతో ఎత్తిపోతలకు రూ.కోటి వెచ్చించి, ఏరియల్ సర్వే పూర్తి చేశారు. పథకం పూర్తయితే.. పెద్దపల్లి జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్, ఓదెల మండలాల ఎస్సారెస్పీ డీ–86, 83 కాలువల చివరి భూములు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల చిట్యాల భూములు సుమారు 50 వేల ఎకరాలకు సాగు నీరందుతుంది. తాగునీటి కొరత తీరుతుంది.
Comments
Please login to add a commentAdd a comment