అర్హులకే కేటాయించాలి
సిరిసిల్లటౌన్: బీఆర్ఎస్ ప్రభుత్వంలో అర్హులై ఉండి డబుల్ బెడ్ రూమ్లు రానివారికి మొదటి ప్రాధాన్యత క్రమంలో ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ డిమాండ్ చేశారు. గతంలో ఇళ్లు రాని పేదలతో కలిసి సోమవారం సిరిసిల్ల ఆర్డీవో ఆఫీస్ ఎదుట ధర్నా చేపట్టి మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులందరికీ డబుల్బెడ్రూంలు ఇస్తామని చెప్పి డ్రా పెట్టి మోసం చేసిందన ఆరోపించారు. అనంతరం సిరిసిల్ల ఆర్డీవోకు వినతిపత్రం అందించారు. ప్రభుత్వం స్పందించకుంటే దశలవారీగా ఆందోళనలకు సిద్ధమని హెచ్చరించారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎర్రవెల్లి నాగరాజు, అన్నల్దాస్ గణేశ్, బెజుగం సురేశ్, సబ్బని చంద్రకాంత్, మొర తిరుపతి, నల్ల బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment