ప్రాజెక్టులపై రివ్యూ
● 30న ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్ భేటీ ● నిధులు, పనుల పురోగతిపై సమీక్ష ● వచ్చే నెల 4న పెద్దపల్లిలో భారీ బహిరంగ సభ ● హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి ● ఏం ప్రకటిస్తారోనని ప్రజల్లో ఉత్కంఠ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్●:
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇటీవల రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ సభలో.. ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇన్‌చార్జి మంత్రి, సాగునీటిశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా పాత కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో భేటీ అవుతారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 30న మంత్రి ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. నిధులు, పనుల పురోగతిపై సమీక్షించనున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగిరమవుతాయని కాంగ్రెస్ నాయకులు ఽధీమాగా ఉన్నారు. చాలా ప్రాజెక్టులు దాదాపు చివరి దశలో ఉండగా.. కొన్ని కొత్తవి కావడం గమనార్హం. వచ్చే నెల 4న పెద్దపల్లిలో నిర్వహించే భారీ బహిరంగ సభకు సీఎం రానున్నారు. ఆయన ఏం ప్రకటిస్తారోనన్న ఉత్కంఠ ఉమ్మడి జిల్లా వాసుల్లో నెలకొంది.
కలికోట సూరమ్మ ప్రాజెక్టు..
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. మొన్నటి బడ్జెట్‌లో ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.325 కోట్లు కేటాయించింది. మొత్తం 43 వేల ఎకరాలకు సాగు నీరివ్వడం దీని లక్ష్యం. ఇది పూర్తయితే.. మేడిపల్లి, భీమారం, రుద్రంగి, కథలాపూర్ మండలాల్లోని బీడు భూములు సాగులోకి వస్తాయి. రాష్ట్రంలోని 9 ప్రధాన ప్రాజెక్టుల్లో కలికోట సూరమ్మ చెరువును చేర్చారు. కుడి, ఎడమ కాలువ నిర్మాణానికి భూసేకరణ కోసం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
95 శాతం పూర్తయిన
‘రోల్లవాగు’
Comments
Please login to add a commentAdd a comment