దత్త జయంతికి రండి
బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని వరదవెల్లిలో డిసెంబర్ 14 నుంచి 16వరకు గురుదత్తాత్రేయస్వామి ఆలయంలో జరిగే దత్త జయంతికి హాజరుకావాలని పలువురు నాయకులు సోమవారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను కలిసి ఆహ్వానించారు. కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్, నాయకులు నాగుల శ్రీనివాస్, గొట్ల వెంకటేశం, ఆడెపు రాజు, నిట్టు వెంకటేశం, మందాల వరుణ్ ఉన్నారు.
నేడు కేటీఆర్ రాక
సిరిసిల్ల: స్థానిక ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు మంగళవారం జిల్లా కేంద్రానికి వస్తారని ఆయన వ్యక్తిగత కార్యదర్శి కుంబాల మహేందర్‌రెడ్డి సోమవారం రాత్రి తెలిపారు. ఈ నెల 29 దీక్షా దివస్ సందర్భంగా నేడు తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే పార్టీ జిల్లాస్థాయి సన్నాహక సమావేశంలో పాల్గొంటారని వివరించారు.
నేత కార్మికులు ఆత్మవిశ్వాసంతో ఉండాలి
సిరిసిల్ల: నేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని జాతీయ చేనేత సేవా సంఘం అధ్యక్షుడు డాక్టర్ అనిల్ కాంబ్లే అన్నారు. సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణిని సోమవారం సాయంత్రం కలిశారు. ఈ సందర్భంగా వస్త్రపరిశ్రమ సంక్షోభం, నేతన్నల ఆత్మహత్యలపై చర్చించారు. ఏడాదికాలంగా వస్త్రపరిశ్రమ సమస్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా చేనేత సేవా సంఘం ప్రతినిధులను మున్సిపల్ చైర్‌పర్సన్ సత్కరించారు. షోలాపూర్ చేనేత సేవా సంఘం అధ్యక్షుడు మ్యాకల రాంగోపాల్, కోఆర్డినేటర్లు ఓం శంకర్ ఉల్గౌరీ, విజయ్‌కుమార్ జుంజ, వైభవ్ మైత్రి, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, పద్మశాలీ సంఘం ప్రధాన కార్యదర్శి మండల సత్యం, తాటి వెంకన్న, మేర్గు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ట్రైనీ అధికారుల సందర్శన
వేములవాడఅర్బన్: వేములవాడ మండలం చీర్లవంచలోని ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వా డీ కేంద్రం, కంపోస్ట్ షెడ్డును సోమవారం ట్రై నీ అధికారులు గౌరవ్‌గార్గ్ ఐఎఫ్‌వోఎస్, రిషాబ్ ఐపీఎస్, రెజ్జురాణా ఐఈఎస్, శివాన్షీ శుక్లా ఐఎస్‌ఎస్ సందర్శించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. ఎంపీడీవో రాజీవ్‌మల్హోత్ర తదితరులు ఉన్నారు.
వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ సిద్ధం
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ భవనం సిద్ధమైందని, ఆసక్తిగల వారు సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని హాస్టల్ జిల్లా మేనేజర్ వి.సుధారాణి సోమవారం కో రారు. సిరిసిల్ల మొదటి బైపాస్ రోడ్డులోని ప్ర భుత్వ నర్సింగ్ కళాశాల పక్కన 31 విశాలమై న రూమ్‌లతో వసతి గృహం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు మహిళా ఉద్యోగులు, పార్ట్ టైం జాబ్ చేసే మహిళలు, ఏదైనా కోర్సు నందు శిక్షణ పొందే విద్యార్థినులు వంద మందికి అవకాశం ఉందని, హా స్టల్‌లో వైఫై, మినరల్ వాటర్, సీసీ కెమెరాలతో కూడిన భద్రత, విశాలమైన డైనింగ్ హాల్, ప్రత్యేక గదుల సదుపాయం ఉందన్నారు. అ వివాహిత మహిళలు, వితంతువులకు చట్టపరంగా విడాకులు తీసుకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడునని తెలిపారు. ఏదైనా కోర్సులో శిక్షణ పొందుతున్న విద్యార్థినులకు 20 శాతం సీట్ల రిజర్వేషన్ ఉందని, అడ్మిషన్ ఫీజు రూ.250, నెలవారీ ఫీజు వసతి, భోజనంతో కలిసి రూ.3,500 ఉంటుందన్నారు. హాస్టల్‌లో జాయిన్ అయ్యేందుకు సిరిసిల్ల ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ పక్కనే ఉన్న భవనానికి రావాలని, మరిన్ని వివరాలకు 76600 22509, 76600 22510, 76600 22511 నంబర్లలో సంప్రదించాలని సుధారాణి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment