మంత్రుల పర్యటనకు ఏర్పాట్లు
రుద్రంగి(వేములవాడ): మండల కేంద్రంలో బుధవారం జరిగే ప్రజాపాలన గ్రామ సభ, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. హెలికాప్టర్ ల్యాండింగ్ ప్రదేశంలో జరుగుతున్న పనులను మంగళవారం పరిశీలించారు. అనంతరం రుద్రంగి శివారులోని సూరమ్మ ప్రాజెక్టు పనులు పరిశీలించారు. వారి వెంట ఆర్‌డీవో రాజేశ్వర్‌రావు, అడిషన్ ఎస్పీ శేషాద్రినిరెడ్డి, పీఆర్‌ఈఈ సుదర్శన్‌రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, తహసీల్దార్ శ్రీలత, ఎంపీడీవో నటరాజ్ నాయకులు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment