ఫిక్స్‌డ్ వేతనాలివ్వాలి
సిరిసిల్లటౌన్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు ఫిక్స్‌డ్ వేతనం రూ.18,000 ప్రకటనతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్ చేశారు. మంగళవారం ఆశావర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కాలేజీ గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ తీసి కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు వినతిపత్రాలు అందించారు. ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న ఆశావర్కర్లపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఆరోగ్య శాఖ కమిషనర్ ఇచ్చిన హామీలు అమలు చేసి, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బదవేని మంజుల, నాయకులు అన్నల్‌దాస్ గణేశ్, గురజాల శ్రీధర్, రమేశ్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment