ట్రాఫిక్ రూల్స్ పాటించాలి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి వి.లక్ష్మణ్ అన్నారు. మంగళవారం మండలంలోని కేసీఆర్‌నగర్, బద్దెనపల్లి, తంగళ్లపల్లి మీదుగా ఆటోరిక్షా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడపవద్దని, డ్రైవర్‌కు ఇరువైపులా ప్రయాణికులను కూర్చోబెట్టవద్దన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు కీ చైన్లు బహుమతిగా అందజేశారు. కార్యక్రమంలో ఐటీడీఆర్ ప్రిన్సిపాల్ దురయ్ మురుగణ్, రవాణా శాఖ అధికారులు జి.వంశీధర్, పృథ్వీరాజ్‌వర్మ, కానిస్టే బుల్ ప్రశాంత్, హోంగార్డు ఎల్లయ్య, ఆటో యూనియన్ అధ్యక్షుడు నాగరాజు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment