జాతరకు రండి
కోనరావుపేట(వేములవాడ): మండలంలోని నాగారంలో ఈనెల 29న నిర్వహించే మాఘ అమావాస్య జాతర మహోత్సవానికి రావా లంటూ కోదండ రామస్వామి ఆలయ కమి టీ సభ్యులు, గ్రామస్తులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను ఆహ్వానించారు. మార్కెట్ కమి టీ డైరక్టర్ అప్పాల నాగభూషణం, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు బొమ్మెన భాస్కర్‌రా వు, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి దుంపేట నాగరాజు, కోశాధికారి సైండ్ల నాగరాజు, కీసరి శ్రీనివాస్, సూర ప్రశాంత్ పాల్గొన్నారు.
ముగ్గులు సంస్కృతికి ప్రతిబింబాలు
వేములవాడ: ముగ్గుల పోటీలు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబాలుగా నిలుస్తాయని జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయి పేర్కొన్నారు. కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన ముగ్గుల పోటీల్లోని విజేతలను ఎంపిక చేశారు. ఏజీపీ ప్రశాంత్‌కుమార్, బా ర్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం, క్రీడల కార్యదర్శి నాగుల సంపత్, అడ్వకేట్లు పొత్తూరి అనిల్‌కుమార్, పంపరి శంకర్, ప్రభాకర్, అభిలాశ్, అనిల్ పాల్గొన్నారు.
పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరోగ్య పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని జనాభా పరిశోధన కేంద్ర(నేషనల్ హెల్త్ మిషన్ పాపులేషన్ రీసెర్చ్ సెంటర్) బృందం సభ్యులు డాక్టర్ ప్రాన్సిస్ జేవియర్, డాక్టర్ థాంగ్ పేర్కొన్నా రు. మండలంలోని రాచర్లబొప్పాపూర్‌లోని ఆరోగ్య ఉపకేంద్రాన్ని, మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను శనివారం త నిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. రోగికి సంబంధించిన పూర్తి వివరాలు రికార్డుల రూపంలో నమోదు చేయాలన్నారు. డీపీవో రాజేందర్, మండల వైద్యాధికారి సారియా అంజుమ్, ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రదీ ప్‌కుమార్, వైద్యులు బాబు, రఘు, ఓంకార్, డీడీఎం కార్తీక్, పీహెచ్ రజనీ, హెల్త్ సూపర్‌వైజర్లు పద్మ, పద్మజ, ఇందిర పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment