రాజ్యాంగ స్ఫూర్తి..
● సాగు, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో రాణింపు
● ఆదర్శం.. పలువురు ఉమ్మడి జిల్లావాసులు
● రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి
అవకాశాలు, హక్కులతో అభివృద్ధికి బాటలు
మన రాజ్యాంగం దేశ ప్రజలందరికీ సమాన అవకాశాలు, హక్కులు, బలహీనులకు ఆపన్నహస్తం ఇచ్చింది. దాని నీడలో గ్రామాలు, నగరాల అభివృద్ధికి బాటలు పడ్డాయి. రాజ్యాంగ ఫలాలతో తమను తాము తీర్చిదిద్దుకుంటున్న ఎందరో దేశ ప్రగతి, సంక్షేమం, అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు. చదువుకున్న పలువురు యువత ఉద్యోగాలు వదిలి, సాగు బాట పట్టారు. వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీ ఉపయోగిస్తూ.. ఆదాయం పొందుతూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉపాధి కోసం ఎదురుచూసిన కొందరు మహిళలు యజమానులుగా పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ యువత దేశ రక్షణకు సైన్యంలో చేరుతున్నారు. దేశభక్తి పెంపొందేలా పలు ప్రాంతాల్లో నిత్య జనగణమన ఆలపిస్తున్నారు. జాతీయ జెండాల తయారీతో సిరిసిల్ల నేతన్నలు ఉపాధి పొందుతున్నారు. ఇక్కడి జెండాలు దేశవ్యాప్తంగా సరఫరా అవుతుండటం మనకు గర్వకారణం. రాజ్యాంగం అమల్లోకి వచ్చి, నేటితో 75 ఏళ్లు పూర్తవుతున్న, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్ఫూర్తిగా నిలుస్తున్న పలువురిపై ప్రత్యేక కథనం.
Comments
Please login to add a commentAdd a comment