ప్రజావాణి అర్జీలకు తక్షణం పరిష్కారం చూపాలి
కలెక్టర్ నారాయణరెడ్డి
ఇబ్రహీంపట్నం రూరల్: వివిధ ప్రాంతాల నుంచి ప్రజావాణికి వచ్చే వినతులపై సంబంధిత శాఖల అధికారులు తక్షణమే స్పందించాలని కలెక్టర్ సి. నారాయణరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆయన అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్, రెవెన్యూ అధికారి సంగీతతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చే అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించేలా చూడాలని సూచించారు. ఈ వారం వివిధ అంశాలపై 41 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. ఇందులో రెవెన్యూకూ సంబంధించి 36, ఇతర శాఖలకు సంబంధించి 5 అర్జీలు అందాయని చెప్పారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్‌లు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
డిగ్రీ స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం
షాద్‌నగర్‌రూరల్: పట్టణంలోని నూర్ ఇంజనీరింగ్ కళాశాలలో కొనసాగుతున్న గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో ఐఎంఎస్‌సీ డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరేందుకు స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతా సో మవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐఎంఎస్‌సీలో అడ్మిషన్ పొందేందుకు ఆసక్తి కలిగిన విద్యార్థి నులు ఇంటర్‌లో ఎంపీసీ, బీపీసీలో 55 శాతం మార్కులు సాధించి ఉండాలని సూచించారు. ఐఎంఎస్‌సీ డిగ్రీ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొందితే ఆ విద్యార్థిని డిగ్రీ, పీజీ పూర్తి చేసుకుంటారని తెలిపారు. అడ్మిషన్ పొందాలనేకునే విద్యార్థినులు తమఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల 18 నుంచి 28 వరకు కళాశాల లో నేరుగా సంప్రదించాలని కోరారు. మ రిన్ని వివరాలకు 89789 42246, 95730 2 1 035 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
త్వరలో బీజాపూర్ రహదారి విస్తరణ పనులు
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి
చేవెళ్ల/మొయినాబాద్: అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. నగరంలోని తన నివాసంలో సోమవారం బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనుల పురోగతిపై ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ నాగేశ్వరరావు, ఆర్ అండ్ బీ ఈఈ ధర్మారెడ్డి, ఇతర అధికారులు, చేవెళ్ల ప్రాంత బీజేపీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రోడ్డు విస్తరణ పనుల ఆలస్యానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలస్యం చేయకుండా త్వరగా పనులు ప్రారంభించి రోడ్డు ప్రమాదాల బారి నుంచి ప్రజలను కాపాడాలని అధికారులకు సూచించారు. రెండు వారాల్లో పనులు ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన రోడ్డు విస్తరణ పనులు చేపడతామని అధికారులు తెలిపారు. చేవెళ్ల బైపాస్ వద్ద ఉన్న శ్మశానవాటిక దగ్గర అండర్‌పాస్ ఏర్పాటు చేయాలని చేవెళ్ల గ్రామస్తులు ఎంపీకి వినతిపత్రం అందజేశారు. సమావేశంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సన్‌వెల్లి ప్రభాకర్‌రెడ్డి, నాయకులు రాందేవ్‌రెడ్డి, రమణారెడ్డి, మాణిక్యరెడ్డి, జ్ఞానేశ్వర్, వెంటక్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, కిరణ్‌కుమార్, వైభవ్‌రెడ్డి, నాగరాజు, రాజీవ్‌రెడ్డి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment