పెన్షన్ల హామీ మర్చిపోవడం సిగ్గుచేటు
● వీహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య
ఇబ్రహీంపట్నం రూరల్: ఆసరా పెన్షన్ పెంచుతామని ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య మండిపడ్డారు. ఆసరా పెన్షన్లు పెంచాలని కోరుతూ సోమవారం దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జంగయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.6వేలు, బీడీ కార్మికులకు రూ.4వేలు పెంచుతామని అధికారంలోకి రాగానే మర్చిపోవడం సిగ్గుచేటన్నారు. ఏపీలో ప్రతీ నెల 1న ఇంటికి వెళ్లి పెన్షన్ ఇస్తుంటే ఇక్కడ మాత్రం 30వ తేదీ వచ్చినా ఇవ్వడం లేదని అన్నారు. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పెన్షన్లు పెంచే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈనెల 26న నిర్వహించ తలపెట్టిన శ్రీచలో హైదరాబాద్‌శ్రీను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహాజన సోష లిస్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు రావుగళ్ల బాబు, వీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి జంగయ్య, గువ్వల యాదయ్య, బాలరాజ్, రాములు, పల్స శంకర్, జిల్లా నాయకులు చాకలి ఉపేందర్, డేరంగుల ఈశ్వర్, పల్నాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment