మీటర్‌కు షాక్‌.. రీడింగ్‌కు బ్రేక్‌! | - | Sakshi
Sakshi News home page

మీటర్‌కు షాక్‌.. రీడింగ్‌కు బ్రేక్‌!

Published Tue, Nov 19 2024 7:15 AM | Last Updated on Tue, Nov 19 2024 8:31 AM

రీడిం

రీడింగ్‌కు బ్రేక్‌!

గడువు ముగియక ముందే కాలిపోతున్న వైనం

యావరేజ్‌ బిల్లింగ్‌తో నష్టపోతున్న వినియోగదారులు

సాక్షి, రంగారెడ్డి జిల్లా: దక్షిణ తెలంగాణ విద్యుత్‌పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్‌)లో విద్యుత్‌ మీటర్ల పనితీరు ప్రశ్నార్థకంగా మారింది. లూజ్‌ కాంటాక్ట్‌, ఎర్తింగ్‌ నిర్వహణ లోపం, విద్యుత్‌ పంపిణీలో హెచ్చుతగ్గులు మీటర్ల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో నెలకు సగటున 20 వేల మీటర్లు స్టకప్‌ (రీడింగ్‌ నమోదు ఆగిపోవడం) అవుతుండగా, సుమారు 4,620 మీటర్లు దగ్ధం అవుతుండటంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. తరచూ మీటర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటం, సిబ్బంది కూడా ఇష్టారాజ్యంగా విద్యుత్‌ బిల్లులు జారీ చేస్తుండటంతో వినియోగదారులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. ఇదిలా ఉంటే ప్రతి యూనిట్‌కు పక్కాగా లెక్క కట్టాలని భావించిన డిస్కం మాన్యువల్‌ మీటర్ల స్థానంలో ఎలక్ట్రానిక్‌ తర్వాత డిజిటల్‌ మీటర్లంటూ ఎప్పటికప్పుడు మారుస్తోంది. నాణ్యతకు పెద్దపీట వేయాల్సిన అధికారులు పలు మీటర్ల తయారీ కంపెనీలతో కుమ్మకై ్క నాసిరకం మీటర్లను కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

కనెక్షన్ల సంఖ్య కన్నా ఎక్కువ కొనుగోలు
హెచ్‌పీఎల్‌ ఎలక్ట్రానిక్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌, హిమాచల్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జెనిసస్‌పవర్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌, నైనా పవర్‌ లిమిటెడ్‌, అవాన్‌ మీటర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ల నుంచి ప్రస్తుత కనెక్షన్ల కంటే ఎక్కువ మీటర్లు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా హెచ్‌పీఎల్‌ సంస్థ నుంచి కొనుగోలు చేసినమీటర్లే. గ్రేటర్‌ జిల్లాల్లో 11 సర్కిళ్లు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 60 లక్షలకుపైగా విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా, వీటిలో 53 లక్షల వరకు గృహ, 8 లక్షలకుపైగా వాణిజ్య, 50 వేలకుపైగా పారిశ్రామిక విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఒక్కో సర్కిల్‌ పరిధిలో నెలకు 5 వేల మీటర్లు స్టకప్‌ అవుతుంటే, 2500 నుంచి 4000 పైగా మీటర్లు కాలిపోతున్నాయి. 2023 అక్టోబర్‌ నుంచి 2024 మార్చి వరకు 1,19,432 మీటర్లు స్టకప్‌ కాగా, 27,722 మీటర్లు కాలిపోవడం గమనార్హం. సాంకేతిక సమస్యలు తలెత్తి పని చేయకుండా పోయిన ఈ విద్యుత్‌ మీటర్లలో చాలా వరకు ఓ ప్రముఖ కంపెనీవే ఉండటంతో ఆ కంపెనీ ఉత్పత్తుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అక్టోబర్‌ 2023 నుంచి 2024 మార్చి వరకు పాడైన మీటర్లు
మీటరు కాలిపోవడానికి లూజ్‌ కాంటాక్ట్‌, షార్ట్‌ సర్క్యూట్‌, వర్షానికి తడిసిపోవడం ప్రధాన కారణమని డిస్కం పేర్కొంది. కానీ నిజానికి చాలా మీటర్లు నాణ్యత లోపం వల్లే కాలుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సమీపంలోని తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు నాణ్యతకు పెద్ద పీఠ వేస్తున్నాయి. ధర కొంత ఎక్కువైనా నాణ్యమైన కంపెనీల నుంచి మీటర్లను కొనుగోలు చేసి వినియోగదారులకు అమర్చుతున్నాయి. కానీ మన డిస్కం మాత్రం ఇతర రాష్ట్రాలు నిరాకరించిన ఓ కంపెనీ మీటర్లును కొనుగోలు చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యతలేని మీటర్లను కొనుగోలు చేసి, బిగిస్తుండటం వల్ల అమర్చిన కొద్ది రోజులకే అవి పాడైపోతున్నట్లు సీనియర్‌ ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. ఒక వేళ మీటరు ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే దాన్ని రీప్లేస్‌ చేయాల్సిన బాధ్యత సదరు సంస్థపై ఉన్నా.. స్తంభించిన మీటర్లు మినహా వివిధ కారణాలతో కాలిపోయిన మీటర్లును రీ ప్లేస్‌ చేయడం లేదు.

సర్కిల్‌ మీటర్‌ మీటర్‌ స్టకప్‌ బర్న్‌

బంజారాహిల్స్‌ 5977 935

సైబర్‌సిటీ 8992 4151

హబ్సిగూడ 11235 1747

హైదరాబాద్‌ సెంట్రల్‌ 11896 2241

హైదరాబాద్‌ సౌత్‌ 11015 3673

మేడ్చల్‌ 18248 1595

రాజేంద్రనగర్‌ 13869 4488

సరూర్‌నగర్‌ 11892 1950

సికింద్రాబాద్‌ 7789 612

వికారాబాద్‌ 3583 2115

సంగారెడ్డి 14936 4215

గ్రేటర్‌లో నెలకు సగటున 20 వేల విద్యుత్‌ మీటర్లకు రిపేర్లు.. 4,620 మీటర్లు దగ్ధం

 

No comments yet. Be the first to comment!
Add a comment
రీడింగ్‌కు బ్రేక్‌!1
1/1

రీడింగ్‌కు బ్రేక్‌!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement